parents are shocked
-
బికినీలో ‘మేడమ్’ హల్చల్.. కంగుతిన్న పేరెంట్స్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల కారణంగా ఆమె ఉద్యోగం ఊడింది. అందుకు కారణం.. ఆ ఫొటోలు అభ్యంతకరంగా ఉన్నాయని పేరెంట్స్ ఫిర్యాదు చేయడమే!. ఏడాది కాలంగా నడుస్తోంది ఈ కేసు.. కోల్‌కతాకు చెందిన ఓ ప్రముఖ కాలేజీలో సదరు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పని చేస్తోంది. అయితే ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తరచూ ఫొటోలు అప్లోడ్ చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలో ఓరోజు ఫ్లస్ టూ చదువుతున్న ఓ విద్యార్థి(18) ఆమె ఫొటోలను పదే పదే చూస్తూ ఉండిపోయాడట. అది రహస్యంగా గమనించిన అతని తండ్రి బీకే ముఖర్జీ.. కాలేజీ యాజమాన్యానికి ఓ లేఖ రాశాడు. సదరు మేడమ్‌గారు అలాంటి ఫొటోలు అప్లోడ్ చేయడం సిగ్గుచేటని.. ఆమె వల్ల తమ పిల్లలు పాడైపోతున్నారని, ఆమె బికినీలో ఫొటోలు అప్లోడ్ చేయడం విద్యార్థులను రెచ్చగొట్టడమే అవుతుందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె ఫొటోలను సైతం ఎటాచ్ చేసి మరీ పంపించాడట. ఈ నేపథ్యంలో.. కిందటి ఏడాది అక్టోబర్‌లో మీటింగ్ పెట్టి మరీ ఆమెను తొలగించక తప్పలేదు కాలేజీ యాజమాన్యానికి. అయితే ఆమె తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసిందని.. అభ్యంతరకర ఫొటోల విషయంలో కాదని కాలేజీ యాజమాన్యం ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే ఆ మరుసటిరోజే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇదిలా ఉంటే.. తన ఫోన్‌ను, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి ఎవరో.. వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన క్యారెక్టర్‌ను దిగజార్చే క్రమంలోనే ఇదంతా జరుగుతోందని, ఇది ముమ్మాటికీ కాలేజీ యాజమాన్యం తనపై చేస్తున్న వేధింపుల కిందకే వస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. A student of St. Xavier’s Kolkata was recently caught looking at a pic of a Prof in her swimsuit (taken from her private IG). His father sent a letter to the uni condemning HER for his son’s leching. Prof was forced to resign in a strikingly humiliating manner. 2022… damn. pic.twitter.com/2RNLnXBd0p — Sukhnidh ⚆ _ ⚆ (@skhndh) August 8, 2022 ఈలోపు తనకు సదరు విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు కాపీ ఇవ్వాలంటూ యూనివర్సిటీకి సదరు ప్రొఫెసర్ లీగల్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు ఈ ఏడాది మార్చ్ 28న యూనివర్సిటీ స్పందించింది. లీగల్ నోటీసులను దురద్దేశ పూర్వకంగా పంపారని, ఇది కాలేజీ ప్రతిష్టను దెబ్బ తీయడమే అవుతుందని బదులు ఇచ్చింది. అంతేకాదు భేషరతు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం కింద 99 కోట్ల రూపాయలు చెల్లించాలని సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు బదులు ఇచ్చింది యూనివర్సిటీ. దీంతో ప్రస్తుతం ఆమె హైకోర్టుకు వెళ్లనున్నారు. ఇదీ చదవండి: హాయ్.. నేను కలెక్టర్ టీనా దాబిని! -
ఇందు...ఎందుకమ్మా ఇలా చేశావ్...!
ఇరవై ఏళ్ల ప్రాయం..వివాహం నిశ్చయమై మార్చి 20న పెళ్లి పీఠలు ఎక్కాల్సిన యువతి. తల్లిదండ్రులు కుమార్తె వివా హం కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే...యువతి మాత్రం తన వివాహం కోసం ఉన్న పొలమంతా అమ్మేస్తే కన్నవారి జీవనం ఎలాగంటూ మదనపడ సాగింది. తన తరువాత ఉన్న చెల్లి వివాహం ఎలా చేస్తారని ఆలోచించింది. ఆ ఆలోచనలో తీవ్ర మనస్తాపానికి గురైంది. తన చెల్లి పెళ్ళి చేయాలన్నా...తల్లిదండ్రులు ఉన్నంతలో సంతోషంగా జీవి ంచాలన్నా...తన చావే పరి ష్కారమనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృ దయ విదారక ఘటన రామభద్రపురం మండలం శిష్టు సీతారాంపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... రామభద్రపురం: మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీఠలెక్కి వధువు కావాల్సిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కన్నవారి జీవనం, తోబుట్టువు వివాహం కోసం ఆలోచించసాగింది. తన మరణంతోనే తోబుట్టువు పెళ్లి, కన్నవారి జీవనం సాగుతుందని ఆలోచించి పురుగుల మందు తాగేసింది. మండలంలోని శిష్టుసీతారాంపురం గ్రామానికి చెందిన శిష్టు ఇందు(20) అనే యువతి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... శిస్టు సీతారాంపురం గ్రామానికి చెందిన శిష్టు తిరుపతికి ముగ్గురు కుమార్తెలు. పెద్దమ్మాయికి ఏడాది కిందట తన పొలంలో కొంత భాగాన్ని విక్రయించి వివాహం చేశారు. రెండవ అమ్మాయి ఇందు. ఈమెకు ఇటీవలె వివాహం నిÔశ్చయమైంది. పొలంలో మిగిలిన భూమిని విక్రయించి వివాహం చేయాలని తల్లిదండ్రులు అనుకోవడంతో ఉన్నదంతా తన వివాహం కోసం అమ్మేస్తే చెల్లి ఉంది తరువాత ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో మనస్తాపానికి గురైంది. గురువారం సాయంత్రం క్రిమిసంహారక మందు తాగింది. తల్లిదండ్రులు పొలం పనులు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి కుమార్తె వాంతులు చేసుకుంటుండం గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయింది. మార్చి 20న వివాహం జరపవలసిన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. చెల్లి పెళ్లి కోసం...తల్లిదండ్రుల జీవనం కోసం ఆలోచించి ఇందు చేసిన ఈ ప్రయత్నంతో కుటుంబ సభ్యులు గొల్లుమంటున్నారు. మా కోసం ఎందుకమ్మా! ఇలా చేశావ్...అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఏఎస్ఐ రమణమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుని మింగిన సంప్
లింగాల : ప్రమాదవశాత్తు సంప్‌లో పడి ఓ రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. లింగాల మండలంలోని పద్మన్నపల్లికి చెందిన శ్రీలత, గోలి యాదవరెడ్డి దంపతులకు ఏకైక కుమారుడు మోహన్‌రెడ్డి (2) ఉన్నాడు. కాగా, గురువారం ఉదయం తమ కుమారుడిని తాత, నాయనమ్మ దగ్గర ఉంచి తల్లిదండ్రులు వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం బాలుడు ఆరుబయట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంప్‌లో పడి మృతి చెందాడు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన తాత, నాయనమ్మ విషయం తెలుసుకుని బోరుమన్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిని స్వగ్రామానికి వచ్చి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.