నమ్మకం: నమ్మలేని నమ్మకాలు!
నమ్మకాలనేవి చాలా బలంగా ఉంటాయి కదా! అదేంటో గానీ, కొన్ని నమ్మకాలు విచిత్రంగా కూడా ఉంటాయి. వాటిని నమ్మాలో వద్దో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి కొన్ని నమ్మకాలు ఇవి...
ముక్కు దురద పెడితే, తమను ఎవరో ముద్దు పెట్టుకోవాలని అనుకుంటున్నారని రొమేనియన్లు నమ్ముతారు!
క్యాబేజీ తింటే పిల్లలు పుట్టరని ఆంగ్లేయులు ఒకప్పుడు నమ్మేవారు. కానీ కాలక్రమంలో ఆ నమ్మకం పోయింది!
జపనీయులు బొటనవేలును ‘పేరెంట్స్ ఫింగర్’ అంటారు. అందుకే శ్మశానం ముందు నుంచి వెళ్లేప్పుడు బొటనవేలును బయటకు కనబడకుండా దాచెయ్యాలని, లేదంటే తల్లిదండ్రులకు ప్రాణాపాయం సంభవిస్తుందని అంటారు వారు!
వైవాహిక జీవితం కలకాలం ఆనందంగా సాగాలంటే... వెడ్డింగ్ కేక్‌లోని చిన్న ముక్కను దాచుకోవాలని అమెరికాలోని కొన్ని ప్రాంతాల వారు నమ్ముతారు!
యువ్వనస్తులు డైనింగ్ టేబుల్‌కి మూలన కూర్చోకూడదంటారు రష్యన్లు. అలా చేస్తే వారికి పెళ్లి కాదట!
శీతాకాలంలో గుమ్మంలో కూర్చుని లేసు అల్లకూడదని, అలా చేస్తే చలి మరింత పెరిగిపోతుందని, చలికాల వ్యవధి కూడా పెరుగుతుందని ఐస్‌ల్యాండ్‌లో నమ్ముతారు!
{పసవ సమయంలో చాకుని దిండు కింద పెట్టుకుంటే, నొప్పులు తక్కువగా వస్తాయని, సుఖ ప్రసవం అవుతుందని చాలా దేశాల్లో విశ్వసిస్తారు!
ఈజిప్టులో ముగ్గురు కలసి ఫొటో దిగరు. అలా చేస్తే మధ్యలో ఉన్న వ్యక్తి అతి త్వరలో చనిపోతాడని వారి భయం!
ఇంట్లోకి ప్రవేశించిన ద్వారం గుండా కాకుండా, మరో ద్వారం గుండా బయటకు వెళ్తే మరణం వెంటాడుతుందనే నమ్మకం ఆఫ్రికా దేశాల్లో ఉంది!