parents murder
-
ఒకరిని డబ్బు ఇవ్వలేదని..మరొకరిని తన భార్యపై...
కడుపున పుట్టిన బిడ్డలే కన్నవారి పాలిట కాలయముళ్లయ్యారు. పున్నామనరకం నుంచి కాపాడాల్సిన వారే క్షణికావేశంలో కడతేర్చారు. ఒకరు తాను అడిగిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో అందరూ చూస్తుండగానే వృద్ధురాలైన తల్లి తలపై విచక్షణా రహింతంగా కట్టెతో మోది చంపగా.. మరొకరు తన భార్యపై అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంగా తండ్రిపై కర్రతో దాడిచేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడు, సింగరాయకొండ మండలం మూలగుంటపాడుల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒంగోలు/సింగరాయకొండ: ఒంగోలు మండలం ముక్తినూతలపాడులోని అరుంధతీనగర్కి చెందిన రాయపాటి రాజమ్మ(60), భర్తతో కలిసి చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు కాగా కుమార్తె ఇటీవల మరణించింది. దీంతో కొడుకు నాగరాజే వారికి ఆధారంగా మిగిలాడు. తాము కుమారుడికి భారం కాకూడదనే భావనతో వయసు మీదపడినా ఆ వృద్ధ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రాజమ్మ ఇంట్లో టీవీకి కేబుల్ కనెక్షన్‌కు సంబంధించి సెట్‌టాప్ బాక్సు పెట్టించిన నాగరాజు ఇందుకు రూ.1000 చెల్లించాలంటూ బుధవారం ఉదయం తల్లిని డిమాండ్ చేశాడు. తన వద్ద ఇప్పుడు డబ్బులు లేవని, కొద్దిరోజులు ఆగి ఇస్తానని చెప్పింది. ఈ విషయంలో తల్లితో వాగ్వాదానికి దిగిన నాగరాజు ఆగ్రహంతో ఊగిపోతూ సమీపంలో కనిపించిన పెద్ద కట్టెను తీసుకొని ఆమె తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో రాజమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు నాగరాజును పట్టుకొని తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్సై రాజారావులు ఘటనాస్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కట్టెను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగరాజు ముక్తినూతలపాడు హైవేమీద ఉన్న సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో హమాలీగా పని చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. అతనికి కోపం ఎక్కువని, ఆ మూర్ఖత్వమే కన్నతల్లి ప్రాణాలను హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసి.. ప్రమాదంగా చిత్రించి.. సింగరాయకొండ మండలంలో మూలగుంటపాడు గ్రామంలో కొడుకు చేతిలో తండ్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వలేటివారిపాలెం మండలం పోకూరు గ్రామానికి చెందిన లింగాబత్తిన మాలకొండయ్య(45) చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతలు మరచి అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇతని ప్రవర్తనకు విసుగుచెందిన కొడుకు నరేష్ తల్లితో సహా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు వచ్చి కారు డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. తల్లి ఒక ప్రైవేటు ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంటులో పనిచేస్తోంది. ఈ క్రమంలో నరేష్ ఒక ముస్లిం యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మాలకొండయ్య తరచూ భార్య దగ్గరకు వచ్చి వారితో గొడవపడుతూ ఉండేవాడు. గర్భవతి అయిన నరేష్ భార్య ఇటీవల కందుకూరు ఏరియా ఆస్పత్రిలో బిడ్డను ప్రసవించింది. ఆ సమయంలో మాలకొండయ్య ఆస్పత్రిలో ఉన్న కోడలితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె గత ఆదివారం తన భర్త నరేష్‌కు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన నరేష్ అదేరోజు ఇంట్లో ఉన్న తండ్రిపై కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన తండ్రిని నరేష్ చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించాడు. వైద్యులకు మాత్రం తనతండ్రి ప్రమాదంలో గాయపడ్డాడని నమ్మబలికాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాలకొండయ్య మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామమైన పోకూరుకు తీసుకెళ్లిన నరేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని బంధువులకు చెప్పాడు. మృతదేహంపై గాయాలను చూసి, ప్రమాదం కాదని భావించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోకూరు వీఆర్ఓ పొనుగోటి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కందుకూరు ఏరియా ఆస్పత్రిలో బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని సీఐ ఆర్ దేవప్రభాకర్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
హాలీవుడ్ క్రైం సినిమా చూసి..
తన తల్లిదండ్రులతో పాటు సహజీవనం చేస్తున్న భాగస్వామి ఆకాంక్షా శర్మను కూడా చంపేసి, కాంక్రీటు సమాధి చేసిన ఉదయన్ దాస్.. అదంతా ఎందుకు, ఎలా చేశాడో ఇన్నాళ్లకు బయటపడింది. చిన్నతనంలో అతడిని తోటి పిల్లలు తరచు ఏడిపిస్తుండేవారట. దానివల్లే అతడు సైకోగా మారి ఉంటాడని పోలీసులు అంటున్నారు. 'డెవిల్స్ నాట్' అనే అమెరికన్ క్రైం సినిమా చూసిన తర్వాత.. దాంతో స్ఫూర్తి పొంది, అందులో చూపించినట్లుగానే హత్యలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఉదయన్‌ను బంకురా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య బంకురా పట్పటణానికి తీసుకొచ్చారు. చిన్నతనంలో కూడా ఇతడికి మంచి చెప్పుకోదగ్గ స్నేహితులంటూ ఎవరూ లేరు. నల్లగా ఉంటాడని అతడిని అందరూ ఏడిపించేవాళ్లు. దాంతో వాళ్లమీద పగ తీర్చుకోవాలని అనుకుంటూ.. చివరకు ఒక ఫ్రెండుకు సంబంధించిన ఆర్కూట్ అకౌంటును హ్యాక్ చేశాడు. అతడికి ఉన్నవాళ్లంతా వర్చువల్ స్నేహితులేనని, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కలిసినవాళ్లనే స్నేహితులుగా భావించేవాడు. అతడికి వేర్వేరు పేర్లతో మొత్తం 110 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. ఉదయన్ వద్ద మొత్తం 2500 హాలీవుడ్ సినిమాల కలెక్షన్ ఉంది. వాటిలో ఒకటైన డెవిల్స్ నాట్లో చూపించినట్లే ఆకాంక్షను చంపి, కాంక్రీటుసమాధి కట్టేశాడు. తాను ఐఐటీలో చదివినట్లు అతడు చెప్పాడు గానీ, నిజానికి చదువుల్లో బాగా వెనకబడి, కాలేజిలో కూడా పరీక్షలు ఫెయిలవ్వడంతో అతడిని బయటకు పంపేశారు. ఆకాంక్ష రాసినట్లుగా ఉన్న నాలుగు ఉత్తరాలను ఉదయన్ తన ఇంటి గోడలలో దాచిపెట్టగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత కథనాలు చదవండి.. ‘ఆన్లైన్’ ప్రేయసిని అతి దారుణంగా.. ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా.. -
ఈ శిక్ష తగునా..?
కక్షల నేపథ్యంలో తలిదండ్రుల హత్య అనాథగా మారిన కుమారి పోలీసుల సంరక్షణలో ఎన్నాళ్లు? సాలూరు(విజయనగరం) : అభం, శుభం తెలియని ప్రాయం ఆ బాలికది. ఏ తప్పూ చేయకపోయినా.. అయినవారు కక్షలకు పోవడంతో తాను శిక్ష అనుభవిస్తోంది. కన్న తల్లిదండ్రులకు దూరమై అనాథగా మారింది. ఆ బాలిక పేరు తాడంగి కుమారి. వయసు ఎనిమిదేళ్లు. ఊరు బింగుడువలస. ఈనెల 11వరకు తను కూడా అందరి చిన్నారుల్లాగే ఎంతో సంతోషంగా ఆడుతూ.. పాడుతూ.. అమ్మా, నాన్నల చెంత మారాం చేస్తూ సంతోషంగా గడిపింది. ఇంతలో బాబాయి కుటుంబంతో తన తల్లిదండ్రులు సీతమ్మ, శంబుకున్న పాతకక్షలు పొడచూడడంతో ఈనెల 11న తల్లిదండ్రులిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. తల్లిదండ్రులు తప్పు చేసారో లేదో గానీ స్పర్థల నేపథ్యంలో కుమారి జీవితం ప్రశ్నార్థకమైంది. అన్నీ తామై పెంచిన అమ్మానాన్నలు ఇక తిరిగిరారన్న విషయం పూర్తిగా అర్థం కాకపోయినా.. బంధువులు, ఇళ్లూ వాకిలీ, ఊరు అన్నీ వదిలి పోలీసుల సంరక్షణలో కాలం వెళ్లబుచ్చాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇమడలేకపోతున్న చిన్నారి తల్లిదండ్రుల హత్య నేపథ్యంలో విచారణకు వెళ్లిన సీఐ జి. రామకృష్ణ అనాథ అయిన కుమారిని వెంటబెట్టుకుని సాలూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. రెండు రోజులపాటు మహిళా హోమ్‌గార్డ్ ఇంటిలో ఆశ్రయం కల్పించారు. అక్కడ ఇమడలేకపోతే తన ఇంటికే సీఐ తీసుకువెళ్లి తన పిల్లలతో కలిపి ఉంచారు. రెండు రోజులు గడచిన తర్వాత చైల్డ్‌లైన్ సంస్థకు అప్పగించారు. అయితే కొండకోనల్లో హాయిగా గడిపిన ఆ చిన్నారి అక్కడ కూడా ఇమడలేకపోయింది. దీంతో బాలికను అక్కడ నుంచి బొబ్బిలిలోని సన్‌రైజ్ హోమ్‌కు తరలించారు. అక్కడా అదే పరిస్థితి. చేసేది లేక కుమారిని మరలా తన ఇంటికే తీసుకువచ్చారు సీఐ రామకృష్ణ, తన బిడ్డ దుస్తులనే వేయించి, ఆలనాపాలనా చూస్తున్నారు. కుమారికి అండగా నిలుస్తానని సీఐ రామకృష్ణ చెబుతున్నప్పటికీ, ఇలాంటి వ్యక్తులు తారసపడకపోయి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. జీవితాలు బలిపెట్టొద్దు.. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం, కక్షలు పెంచుకోవడం వంటి కారణాలతో చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు, పిల్లల భవిష్యత్‌ను కూడా నాశనం చేస్తున్నారు. అందుకే చట్టంపై అవగాహన పెంచుకుని, ప్రశాంతంగా జీవనం సాగించాలి. – జి రామకృష్ణ, సీఐ, సాలూరు -
ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య
-
ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య
నల్గొండ : నల్లగొండ జిల్లా దిండి మండలం వీరబోయినపల్లిలో దారుణ సంఘటన జరిగింది. తన ప్రేమ పెళ్లిని నిరాకరించారనే ఆగ్రహంతో తల్లిదండ్రులను కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా మద్యం మత్తులో అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.