Parigi police
-
దళితుడిని దూషించిన వ్యక్తిపై డీఎస్పీకి ఫిర్యాదు
పరిగి : దళిత యువకుడిని కులం పేరుతో దూషించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని టీ మాస్ స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యులు వెంకటయ్య, గో వింద్, వెంకట్రాం డిమాండ్ చేశారు. పరిగి డీ ఎస్పీ శ్రీనివాస్‌ను మంగళవారం కలిసి వారు ఫి ర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బొంరాస్‌పేట్ మండలం నందార్‌పూర్‌లో రా జ్యాంగ నిర్మాత అంబెడ్కర్‌ను ఎందుకు కించపరుస్తున్నావని అడిగిన దళిత యువకుడిని కులం పే రుతో దూషించాడని ఆరోపించారు. అతన్ని వెం టనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అంజిల య్య, రమేష్, హబీబ్, రవి, బలరామ్, మోహన్, శాంత య్య, అశోక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
పరిగి పోలీస్‌స్టేషన్‌లో దారుణం
వికారాబాద్ జిల్లా : పరిగి పోలిస్ స్టేషన్లో దారుణం జరిగింది. ఓ కేసు విషయంలో రాజు అనే యువకుడిని స్థానిక ఎస్సై ఓబుల్ రెడ్డి చితకబాదారు. ఎస్సై దెబ్బలు తాళలేక రాజు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసుల దెబ్బలు తాళలేకే స్పృహ కోల్పోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మీడియాకు తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హూటాహుటిన బాధితుడిని పోలీసులు ఇంటికి పంపించేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంతా తూచ్.. గుప్త నిధుల్లేవు..
సాక్షి, పరిగి : ఓ పురాతన ఇళ్లును కూల్చివేస్తుండగా దొరికిన పురాతన పెట్టెలో గుప్త నిధులున్నాయంటూ ప్రచారం జరిగిన ఆ పెట్టెను శనివారం తహశీల్దార్ సమక్షంలో అత్యంత ఉత్కంఠ నడుమ పోలీసులు తెరిచారు. తీరా బాక్స్ ఖాళీగా ఉండటంతో పరిగి ప్రజలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో పురాతన ఇళ్లు కూల్చి వేస్తుండగా శుక్రవారం రాత్రి ఓ పెట్టె లభ్యమైన విషయం తెలిసిందే. ఈ పెట్టె పురాతన గల్లపెట్టె మాదిరి ఉండటంతో గుప్తనిధులు ఉన్నాయని జోరుగా ప్రచారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరి పెట్టెను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు. శనివారం తహశీల్ధార్ సమక్షంలో తెరుస్తామని చెప్పారు. దీంతో చుట్టు పక్కల ప్రజలంతా ఆతృతతో తహశీల్దార్ కార్యాలయానికి చేరారు. తీరా పెట్టెను తెరిచి చూస్తే అందులో ఎలాంటి నిధులు లేవు. దీంతో అక్కడికి చేరిన ప్రజలంతా నిరాశతో వెనుదిరిగారు. పట్టణానికి చెందిన మనోహర్ తన పాత ఇంటిని ఇతరులకు విక్రయించాడు. కొనుగోలుదారుడు శుక్రవారం రాత్రి జేసీబీతో ఇళ్లు కూల్చివేస్తుండగా ఈ పురాతన పెట్ట బయటపడింది. -
వికారాబాద్ జిల్లాలో గుప్తనిధులు లభ్యం
సాక్షి, పరిగి : వికారాబాద్ జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. దీంతో స్థానికంగా గుప్త నిధులు చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని పరిగి మార్కెట్ యార్డులో పురాతన ఇళ్లు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో గుప్త నిధులు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. గుప్తు నిధులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో ఏమున్నాయన్నది తెలియాల్సి ఉంది. -
దొంగల ముఠా నాయకుడు మాన్సింగ్!
♦ కాల్పులకు యత్నించింది అతనే ♦ గుల్బర్గాలో ముఠా ఏర్పాటు ♦ గతంలో పలు నేరాలు.. దోపిడీలు ♦ కొనసాగుతున్న విచారణ పరిగి: సినీ ఫక్కీలో పట్టుబడిన దోపిడీ ముఠా నాయకుడు మాన్సింగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నాలుగు రోజుల క్రితం (శుక్రవారం అర్థరాత్రి) పరిగిలో ఓ ముఠాను అడ్డుకోగా పోలీసులపై కాల్పులకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని పోలీసులు పట్టుకోగా ఓ వ్యక్తి తప్పించుకు పారిపోయాడు. దొరికిన వారి సాయంతో పారిపోయిన దొంగతో పాటు మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముఠా సభ్యుల్లో ఒకడైన సమద్‌ను రిమాండ్‌కు తరలించిన సంగతి విధితమే. నాలుగు రోజులుగా పట్టుబడిన దొంగలను విచారించిన పోలీసులు వారిని వెంటబెట్టుకుని కర్ణాటక గుల్బర్గాకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దొంగలముఠా నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. కాల్పులకు యత్నించిన ఘటనలో గాయపడి ఆస్పత్రిపాలైన మాన్సింగే ముఠా నాయకుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే సమయంలో నేరాలు చేసే క్రమంలో రివాల్వర్ సైతం ఎక్కడో కొట్టుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు. కాల్పులకు యత్నించిన సమయంలో మాన్సింగ్ రివాల్వర్ పట్టుకుని కాల్పులు జరిపే ప్రతయ్నం చేశాడని.. ఆ సమయంలో రివాల్వర్‌లో ఆరు బుల్లెట్లు, అదనంగా జేబులో మరో మూడుతో కలిపి మొత్తం తొమ్మిది బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. పెనుగులాటలో సంఘటనా స్థలంలో మూడు బుల్లెట్లు పడిపోగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫైరింగ్లోనూ దిట్టే.. తెలుగు, కనడ, హిందీ భాషలు తెలిసిన మాన్సింగ్ గుంతకల్ వాసి. ఏడేళ్ల క్రితం అనంతాపూర్ జిల్లాలో, గుంతకల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు సమాచారం రాబట్టారు. గతంలో తుపాకులు పేల్చిన నేర చరిత ఉన్నట్లు తేల్చారు. పలు నేరాలు..దొంగతనాలు చేసిన అతను పోలీసులకు పట్టుబడడంతో జైలుకు వెళ్లి ఐదేళ్లు శిక్ష కూడా అనుభవించినట్లు తెలిసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గుంతకల్ నుంచి గుల్బర్గాకు మకాం మార్చాడు. గుల్బర్గాలో మామూలు గుడిసెలో నివాసం ఉంటూ అక్కడ ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. నెల, రెండు నెలలు విరామం ఇచ్చి వేర్వేరు ప్రాంతాల్లో నేరాలు చేయడం ఈ ముఠాకు అలవాటు. హైదరాబాద్ వెళుతూ.. స్విఫ్ట్ డిజైర్ కారులో హైదరాబాద్ బయలు దేరిన ఈ దోపిడీ ముఠా అనుకోని పరిస్థితిలో పరిగి పట్టణంలోకి వెళ్లి పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్‌కు అర్థరాత్రి వరకు చేరుకుని అక్కడ దొంగతనానికి పాల్పడాలని గుల్బర్గా నుంచి బయలుదేరిన వీరు పరిగికి చేరుకునే వరకు రాత్రి 2 గంటలైంది. హైదరాబాద్‌కు తెల్లవారు జామున 4 గంటలకు చేరుకుంటే అక్కడ ఏ దొంగతనం చేయడానికి వీలుకాదని భావించి పరిగి పట్టణంలోకి కారును మళ్లించినట్లు సమాచారం. బ్యాంకే అని కాకుండా ఎక్కడో ఒకచోట దోపిడీ చేసి తిరిగి వెళ్లి పోవాలని పరిగిలోకి మళ్లడంతో అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. వీరి నుంచి గతంలో చేసిన దోపీడీలకు సంబంధించి సొత్తు రికవరీకి యత్నిస్తుండడంతో రిమాండ్‌కు తరలించేందుకు ఆలస్యం అవుతున్నట్లు తెలిసింది.