సాక్షి, పరిగి : వికారాబాద్ జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. దీంతో స్థానికంగా గుప్త నిధులు చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని పరిగి మార్కెట్ యార్డులో పురాతన ఇళ్లు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో గుప్త నిధులు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. గుప్తు నిధులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో ఏమున్నాయన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment