Paris climate agreement
-
ట్రంప్ చేసిన పనికి బైడెన్ క్షమాపణ
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ క్షమాపణలు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అంశంపై మాట్లాడుతూ ఈ మేరకు ప్రపంచ దేశాలను క్షమాపణలు కోరారు బైడెన్. పారిస్ ఒప్పందంలో వెంటనే చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాన పర్యావరణ సదస్సులను నిర్వహించామని తెలిపారు. భూతాపాన్ని తగ్గించే పోరాటంలో నాయకత్వాన్ని తిరిగి తీసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు బైడెన్. ఐక్యరాజ్య సమితి కాప్27 సదస్సులో ప్రసంగించారు. ‘స్నేహితులారా.. ఈ ఒక్క సమస్యపై దశాబ్దాలుగా చర్చ కొనసాగుతోంది. పురోగతిలో అడ్డంకులను అధిగమించడానికి అమెరికా చేయవలసిన పరివర్తనాత్మక మార్పులు చేయాలని నిర్ణయించుకునే నేను అధ్యక్ష పదవికిలోకి వచ్చాను. అమెరికా ఒక విశ్వసనీయమైన, గ్లోబల్ లీడర్‌గా వాతావరణ మార్పులపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంది. దానిని సాధించటానికి మా సాయశక్తులా కృషి చేస్తాం.’ అని తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రపంచ దేశాలు సైతం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కోరారు బైడెన్. వారిపై ఒత్తిడి తేవటం గ్లోబల్ లీడర్‌గా తమ బాధ్యత అని వెల్లడించారు. పర్యావరణ సంక్షోభంతో అది మానవ, ఆర్థిక, వాతవారణ, జాతీయ భద్రతకు ముప్పు తెస్తోందని సూచించారు. ఈ భూమండలంపై ఉన్న ప్రతి జీవికి ముప్పు వాటిల్లుతోందన్నారు. ఇదీ చదవండి: పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత -
ట్రంప్ పై మండిపడుతున్న దేశాధినేతలు
-
ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు
కర్బన్ ఉద్గరాల విడుదల నియంత్రణకు కుదుర్చుకున్న ఎంతో చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు. పారిస్ వాతావరణ ఒప్పందానికి ట్రంప్ కట్టుబడి ఉండాలని ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఇతర బిజినెస్ లీడర్లంటున్నారు. ఈ విషయంపై మంగళవారమే టిమ్ కుక్, వైట్ హౌజ్ కు ఫోన్ చేసి అధ్యక్షుడితో మాట్లాడారని బ్లూమ్ బర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది. కానీ ఒక్కరోజులోనే అంటే బుధవారం ఈ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కర్బన్ ఉద్గారాల శాతాన్ని తగ్గించడానికి దాదాపు అన్ని దేశాలు దీనిలో సంతకాలు చేశాయి. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు మాత్రం ట్రంప్ నిరాకరించారు. ఇంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకోడానికి తనకు మరింత సమయం అవసరమని ఆయన చెప్పారు. డెమొక్రాట్లు, పర్యావర్ణ కార్యకర్తలు, కొందరు వ్యాపార నాయకుల నుంచి వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా.. వెంటనే ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయించినట్టు రిపోర్టులు తెలిపాయి. నేడు దీనిపై ట్రంప్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఒకవేళ అమెరికా ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంటే వైట్ హౌజ్ అడ్వయిజరీ కౌన్సిల్స్ కు తాను రాజీనామా చేస్తానని టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు. -
సందిగ్ధంలో పారిస్ ఒప్పందం
మారకేచ్(మొరాకో): అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో పారిస్ పర్యావరణ ఒప్పందంలో ఆ దేశం పాలుపంచుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఆ ఒప్పందాన్ని బూటకంగా వర్ణించి తాను గెలిస్తే దాన్ని రద్దుచేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. ప్రస్తుతం మొరాకాలో జరుగుతున్న యూఎన్ పర్యావరణ సదస్సులో ట్రంప్ విజయం సాధించారన్న వార్త ప్రకంపనలు సృష్టించింది. చిన్న దీవుల దేశాల తరుఫున మాల్దీవులు పర్యావరణ మంత్రి స్పందిస్తూ పర్యావరణ సవాళ్లు, క్లీన్ ఎనర్జీ దిశగా వస్తున్న మార్పును అమెరికా కొత్త అధ్యక్షుడు దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలతో పర్యావరణ వేత్తలు కంగుతిన్నారు. ‘పర్యావరణ ప్రణాళికకు ట్రంప్ బ్రేక్ వేస్తారు. మనమంతా దీనికి విరుగుడు కనుగొనాలి’ అని పర్యావరణ సంస్థ 350. ఆర్గ్ ప్రతినిధి బోఈవ్ అన్నారు. అమెరికా ఈ ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవాలనుకుంటే మొత్తం ప్రక్రియ పూర్తవడానికి నాలుగేళ్లు పడుతుంది. కాలుష్య స్థాయులును గణనీయంగా తగ్గిస్తామన్న ఒబామా ప్రభుత్వం హామీని ట్రంప్ పెడచెవిన పెట్టే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఒప్పందం నుంచి తప్పుకుంటే భవిష్యత్తు పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది స్పష్టం కావట్లేదు. -
పారిస్ ఒప్పందం రద్దు చేస్తా: ట్రంప్
వాషింగ్టన్: చారిత్రక ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ను రద్దు చేస్తానని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ శపథం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే చేపట్టనున్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ట్రంప్ శుక్రవారం వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐరాస గ్లోబల్ వార్మింగ్ ప్రోగ్రామ్‌కు అమెరికా అందిస్తున్న నిధులను ఆపేస్తామని చెప్పారు. అమెరికాకు ఎనర్జీ పరంగా స్వతంత్రత వచ్చేందుకు ఈ చర్యలు అవసరమన్నారు.