ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు | Apple CEO Tim Cook Urged President Trump to Stay in the Paris Climate Agreement | Sakshi
Sakshi News home page

ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు

Published Thu, Jun 1 2017 7:13 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM

ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు - Sakshi

ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు

క‌ర్బ‌న్ ఉద్గ‌రాల విడుద‌ల‌ నియంత్ర‌ణ‌కు కుదుర్చుకున్న ఎంతో చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు.  పారిస్ వాతావరణ ఒప్పందానికి ట్రంప్ కట్టుబడి ఉండాలని ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఇతర బిజినెస్ లీడర్లంటున్నారు. ఈ విషయంపై మంగళవారమే టిమ్ కుక్, వైట్ హౌజ్ కు ఫోన్ చేసి అధ్యక్షుడితో మాట్లాడారని బ్లూమ్ బర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది. కానీ ఒక్కరోజులోనే అంటే బుధవారం ఈ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
 
కర్బన్ ఉద్గారాల శాతాన్ని తగ్గించడానికి దాదాపు అన్ని దేశాలు దీనిలో సంతకాలు చేశాయి. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు మాత్రం ట్రంప్ నిరాకరించారు. ఇంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకోడానికి తనకు మరింత సమయం అవసరమని ఆయన చెప్పారు. డెమొక్రాట్లు, పర్యావర్ణ కార్యకర్తలు, కొందరు వ్యాపార నాయకుల నుంచి వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా.. వెంటనే ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయించినట్టు రిపోర్టులు తెలిపాయి. నేడు దీనిపై  ట్రంప్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఒకవేళ అమెరికా ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంటే వైట్ హౌజ్ అడ్వయిజరీ కౌన్సిల్స్ కు తాను రాజీనామా చేస్తానని టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement