40 దేశాధినేతలతోపాటు 10 లక్షల మంది ఐక్యతా ర్యాలీ
పారిస్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 40 మందికిపైగా దేశాధినేతలు గొంతెత్తారు. వారితోపాటు పది లక్షల మంది ఈరోజు ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. అందరి గుండె చప్పుడు ఒకటే. ఉగ్రవాదం నశించాలి అన్నదే వారి నినాదం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది లక్షల మంది ప్యారిస్ వీధుల్లోకి వచ్చారు. వివిధ దేశాల జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నలభై దేశాధినేతలు ఉగ్రవాద దాడులను ఖండిస్తూ ప్యారిస్ ప్రజలకు సంఘీభావంగా ర్యాలీ చేపట్టారు. వ్యంగ్య వార్తా పత్రిక ఎడిటర్ చార్లీ హెబ్డే సహా దారుణంగా 17 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న ఘటనను ప్యారిస్ వాసులు మరిచిపోలేకున్నారు. వారికి సంఘీభావంగా లక్షలాది మంది ''మీకు మేమున్నాం'' అంటూ ప్యారిస్ వీధుల్లో నడిచారు.