వాటర్‌షెడ్ పనుల పరిశీలించిన కలెక్టర్
హుస్నాబాద్‌రూరల్: నాబార్డు సహకారంతో పనికిరాని భూములు సాగుకు యోగ్యంగా మారడం సంతోషకరమని కలెక్టర్ నీతూకుమారి అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలం కుందనపల్లిలో నాబార్డు ఆధ్వర్యంలో చేపట్టిన వాటర్‌షెడ్ పనులను ఆమె పరిశీలించారు. హరితహారంలో భాగంగా రైతుల భూముల్లో టేకు మొక్కలు నాటేందుకు నాబార్డు సహకారంతో ప్రకృతి ఎన్జీవో చొరవచూపుతుందన్నారు. గిరిజన రైతులకు ఆరుతడి పంటల విత్తనాలను కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం రవిబాబు, ఎంపీపీ భూక్య మంగ, సర్పంచులు నిర్మల, స్వరూప,ఎంపీటీసీ స్వామిరెడ్డి, ప్రకృతి ఎన్జీవో సీఈవో జయశ్రీ, ప్రతి నిధులు కిరణ్, మోతిలాల్,ౖ రెతులు పాల్గొన్నారు.
గీతా కార్మికుల ఉపాధి..
హరితహారంలో కర్జూర, ఈత వనాలను పెంచుటకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని కలెక్టర్ అన్నారు. జనగామలో కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రభుత్వ భూముల్లో ఈత, కర్జూర వనాలతో గీతాకార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య మంగ, నగరపంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీడీవో జి.రాంరెడ్డి, తహసీల్దార్ వాణి, ఏపీవో వేణు, ఏవో శ్రీనివాస్,సర్పంచులు ఈశ్వర్, ఉపసర్పంచ్ రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, షాబుద్దీన్ పాల్గొన్నారు.