parital sriram
-
కట్టు కథలు, పిట్ట కథలు మానుకో శ్రీరామ్
రాప్తాడురూరల్: పరిటాల శ్రీరామ్ చెబుతున్నట్లు వారి తాతల కాలం నుంచి వారి కుటుంబం నిజంగా బడుగు, బలహీన వర్గాల బాగు కోసం పనిచేసి ఉంటే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలే 2019 ఎన్నికల్లో ఏకంగా 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై పరిటాల శ్రీరామ్ కట్టు కథలు, పిట్ట కథలు మానుకోవాలని హితవు పలికారు. ‘మా నాన్న తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ఎవరికీ బెదిరే, అదిరేవారు కాదు. దౌర్జన్యాలకు తలవంచే మనస్తత్వం అసలే కాదు. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడే దౌర్జన్యాలను ఎదిరించిన ధీరుడు. నీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే వారెవరూ లేరని రవి మొహం మీదే చెప్పిన వ్యక్తి మా నాన్న. ఈ విషయాన్ని అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాలార్ బాషా, మీ చిన్నాన్న గడ్డం సుబ్రహ్మణ్యంను అడిగితే తోపుదుర్తి పౌరుషం ఏంటో తెలుస్తుంది. మీ తాతల గురించి, మీ నాన్న గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మీరు మంచి చేసిందేమీ లేదు. ఉద్యమం పేరుతో దోపిడీ సాగించారు. ఐదెకరాల నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. మా ఆస్తులు పేదలకు పంచేందుకు సిద్ధం. మీ ఆస్తులు పంచేందుకు మీరూ సిద్ధమేనా?’ అని సవాల్ విసిరారు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది! ‘పరిటాల శ్రీరాములు, బోయ సిద్దయ్య ఇద్దరూ కలసి దోపిడీలు చేస్తే..బోయ సిద్దయ్యనేమో దొంగగా మార్చి, శ్రీరాములు ఉద్యమకారుడు అంటూ పచ్చమీడియా చిత్రీకరించింది. ఇద్దరూ దొంగలైనా కావాలి.. లేదంటూ ఇద్దరూ ఉద్యమకారులైనా కావాలి. పరిటాల శ్రీరాములు ఒక్కడే ఉద్యమకారుడు ఎలా అవుతాడు? పరిటాల రవి హత్యలు చేసి ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంపినాడు. గత ప్రభుత్వంలో శ్రీకాకుళం అడవుల్లో 26 మంది నక్సల్స్‌ను ఎన్కౌంటర్ చేస్తే మంత్రిగా ఉన్న మీ తల్లి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది? నసనకోట పంచాయతీలోనే భూములు లాక్కున్న చరిత్ర మీ నాన్నది. నువ్వు బచ్చావు.. నీకు తెలీకపోతే ఓసారి పెద్దోళ్లను అడిగితే చెబుతార’ని పరిటాల శ్రీరామ్‌కు హితవు చెప్పారు. అనంతపురం చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతూ లిటిగెంట్ భూములను కొనుగోలు చేస్తూ దందాలు చేస్తోంది మీరుకాదా అని నిలదీశారు. బెంగళూరు కేంద్రంగా అడ్రెస్ లేని సిమ్ల ద్వారా తమ కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతుండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో పరిటాల కుటుంబం ఉన్మాద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. (చదవండి: అనంతలో ప్రభుత్వ ఉద్యోగుల కృతజ్ఞత ర్యాలీ) -
ఓటు వేయకపోతే చంపేస్తాం: పరిటాల వర్గీయుల బెదిరింపులు
-
పరిటాల వర్గీయుల బెదిరింపులు
సాక్షి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినప్పటికీ అధికార పార్టీ అండతో టీడీపీ నేతలు బుధవారం కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్.. రామగిరి, చెర్లోపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. కోడ్‌ను ఉల్లంగిస్తున్నారు. శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపుతామని ఆయన వర్గీయులు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీకి సహరించకపోతే అంతుచూస్తామని స్థానిక నేత ముత్యాలుపై పరిటాల అనుచరులు దాడికి దిగారు. పరిటాల దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సునీత వర్గీయులను చెర్లోపల్లి గ్రామస్తులు అడ్డుకుని.. పోలీసులు సమాచారం ఇచ్చినా.. అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. ఓటర్లకు బెదిరింపులు, పోలీసుల తీరును వైఎస్సార్సీపీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. మంత్రి సునీతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఓటర్లను బెదిరిస్తున్నా పరిటాల వర్గీయులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాడ్ చేశారు. -
టోల్‌గేట్‌పై పరిటాల శ్రీరాం దాడి!
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి టోల్‌గేట్‌పై పౌరసరఫరాలశాఖ రాష్ట్రమంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంతో పాటు అతని అనుచరులు మంగళవారం రాత్రి దాడి చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... హైదరాబాద్ నుంచి అనంతపురానికి వస్తున్న శ్రీరాం కోసం కొందరు అనుచరులు డోన్‌కు వెళ్లారు. గుత్తి టోల్గేట్ వద్ద కేవలం పోయేందుకు మాత్రమే రుసుం చెల్లించారు. శ్రీరాంకు స్వాగతం చెప్పి తిరిగి వస్తుండగా టోల్గేట్ వద్ద సిబ్బంది వాహనాలు నిలిపారు. తిరుగు ప్రయాణానికి మళ్లీ రసీదు తీసుకోవాలని చెప్పారు. దీంతో శ్రీరాంతో పాటు అతని అనుచరులు అక్కడున్న వేదక్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిపై దాడి చేసినట్లు తెలిసింది. కాగా ఈ వివరాలను అధికారికంగా చెప్పేందుకు టోల్గేట్ నిర్వాహకులు భయపడుతున్నారు. సీసీ పుటేజీల స్వాధీనానికి మంత్రి హుకుం విషయం తెలిసిన మంత్రి పరిటాల సునీత వెంటనే టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలు స్వాధీనం చేసుకోవాలని వారి అనుచరులకు సూచించినట్లు తెలిసింది. ఘటన జరిగిన సమయానికి డీజీపీ రాముడు అనంతపురంలోనే ఉన్నారు. ఉదయం మంత్రి ఇంటికి కూడా వెళ్లారు. రాత్రి టోల్గేట్ వద్ద జరిగిన సంఘటనను మంత్రి డీజీపీకి వివరించి, కేసు లేకుండా టోల్గేట్ నిర్వాహకులతో చర్చిస్తామని, వీలుకాని పక్షంలో శ్రీరాంను కేసు తప్పించాలని డీజీపీకి మంత్రి సూచించినట్లు తెలిసింది.