parkala
-
పరకాలలో విజయం బీఆర్ఎస్ దే..
-
రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేయాలి
∙ఎన్నికల హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలి ∙డివిజన్ కోసం ఇనుగాల 48 గంటల నిరాహార దీక్ష ∙ మాజీ చీఫ్ విప్ గండ్ర వెల్లడి పరకాల : పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రాం తానికి చెందిన స్పీకర్ మధుసూదనాచారి కృషి చేయాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎందరో వీరులు ప్రాణాల ర్పించిన ధీరగడ్డ పరకాలన్నారు. మరో జలియన్ వాలాబాగ్‌గా పేరుగాంచిన చారిత్రాక ప్రాంతం పరకాలను నాటి సీఎం ఎన్టీఆర్ 1984లో రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారన్నారు. రాజకీయ కారణాలతో 1987లో ములుగుకు ఆర్డీఓ కార్యాలయాన్ని తరలించుకుపోయారన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంను ఏర్పాటు చేసిందన్నారు. గతం లో రెవెన్యూ డివిజన్ కోసం కాంగ్రెస్ అనేక ఉద్యమాలను చేపట్టిందన్నారు. ఇటీవల కాంగ్రెస్ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రామ్రెడ్డి ఒక్క రోజు దీక్షను చేపట్టారన్నారు. ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన హామీని ఎమ్మెల్యే ధర్మారెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. వెంకట్రామ్రెడ్డి 48 గంటల నిరవధిక దీక్షను చేపట్టబోతున్నారన్నారు. రెండు రోజుల పాటు పరకాల బంద్‌కు ప్రజలు, వ్యాపారులు సిద్ధమవుతున్నారన్నారు. పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మౌళిక వసతులు ఉన్నాయన్నారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, కౌన్సిలర్లు పోరండ్ల సంతోష్, బండారి కవితకృష్ణ, మాజీ సర్పంచ్ ఇనుగాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రావణ కిరణం
21 ఏళ్లకే సీఏ పట్టా అందుకున్న విద్యార్థి పరకాల : ప్రస్తుత కాలంలో చాలామంది విద్యార్థులు పదో తరగతి పూర్తికాగానే ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులను అభ్యసించేందుకు వెళ్తుంటారు. మరికొందరు మెడిసిన్, ఇంజినీరింగ్‌ను పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఆరాటపడుతుంటారు. అయితే ఓ విద్యార్థి మాత్రం అందరిలా సంప్రదాయ కోర్సులను చదవకుండా భిన్నంగా, ఎంతో కష్టతరంగా ఉండే చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)ను అభ్యసించేందుకు ఆసక్తి చూపాడు. ఈ మేరకు తాను ఎంచుకున్న కోర్సును చిరుప్రాయంలోనే విజయవం తంగా పూర్తి చేసి పలువురు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన గంజి పద్మ, వెంకట్‌రెడ్డి దంపతులకు కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వెంకట్‌రెడ్డి ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితం పరకాలకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన నగర పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఫస్ట్.. వెంకటరెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు శ్రావణŠ కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. 1995 ఆగస్టు 7వ తేదీన జన్మించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి 1 నుంచి 8వ తరగతి వరకు పరకాలలోనే చదివాడు. 8 నుంచి 10వ తరగతి వరంగల్ ఎస్పీఆర్లో పూర్తి చేశాడు. కాగా, 2010లో పదో తరగతి ఫలితాల్లో ఆయన 600 మార్కులకు 538 సాధించి ప్రతిభ కనబరిచాడు. 2012లో ఎంఈసీ గ్రూపులో 1000కి 937 మార్కులు సాధించాడు. అనం తరం సీపీటీలో ప్రవేశ పరీక్ష రాయగా 200 మార్కులకు 172 మార్కులను సాధించాడు. అలాగే ఐపీసీసీలో 700 మార్కు లకు 385 మార్కులను సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత రెండేళ్ల పాటు ప్రముఖ ఆడిటర్ తిప్పర్తి రాఘవరెడ్డి దగ్గర అప్రెంటీస్ పూర్తి చేశాడు. మంచి మార్కులతో సీఏ ఉత్తీర్ణత గత మే నెలలో జరిగిన సీఏ ఫైనల్ పరీక్షకు హాజరైన శ్రావణ్‌కుమార్‌రెడ్డి 800 మార్కులకు 479 మార్కులు సాధించాడు. మెుత్తం మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. కాగా, గత ఏడాదిలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి సాధించిన 479 మార్కులకు ఆలిండియా ర్యాంకు రాగా.. ఇప్పుడు త్రుటిలో జాతీయ ర్యాంకు కోల్పోయాడు. ఇదిలా ఉండగా, సీఏ గ్రూపు–1, గ్రూపు–2లో మొత్తంగా 8 సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో ఏ ఒక్క సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చిన సీఏలో అనర్హుడిగానే పరిగణిస్తారు. కానీ.. శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఒకేసారి 8 సబ్జెక్ట్‌లను రాసి మొదటి శ్రేణిలో పాస్ కావడం విశేషం. ఎంతో కష్టమైన సీఏ కోర్సును చిన్న వయస్సులోనే పూర్తి చేసి రికార్డు సాధించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు. కష్టమని తెలిసే ఎంచుకున్నా. ఇంటర్ తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులను అభ్యసించేందుకు ఆరాటపడుతుంటారు. నాకు మొదటి నుంచి గణితం, సైన్స్‌లో 98 శాతం మార్కులు వచ్చేవి. దీంతో ఇంట్లో అందరు నన్ను ఇంజినీరింగ్ చేయాలని ఒత్తిడి చేశారు. నాకు మాత్రం సీఏ చేయాలనే ఉండేది. సమాజంలో సీఏలకు మంచి గౌరవం ఉంటుంది. అందుకనే ఆ కోర్సును పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నా. సీఏ చదివేందుకు అమ్మనాన్న నాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. మా సార్ రాఘవరెడ్డి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సహంతో మొదటి ప్రయత్నంలోనే సీఏను సాధించాను. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినందుకే ఫలితం వచ్చింది. –గంజి శ్రావణ్‌కుమార్‌రెడ్డి -
కోరిక తీర్చలేదని..కిరోసిన్ పోసి నిప్పంటించాడు..
పరకాల: కోరిక తీర్చనందుకు ఉన్మాదిలా మారిన వ్యక్తి.. ఓ వితంతువును సజీవ దహనం చేసిన ఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పరకాల సీఐ బి.మల్లయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిక్క లలిత(35) భర్త కుమారస్వామి ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. అయితే రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన కొయ్యడ రాజేశ్ తో ఆమెకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరిద్దరి వ్యవహారన్ని పసిగట్టిన రాజేశ్ భార్య.. 8 నెలల క్రితం పెద్దలను ఆశ్రయించగా, మరోసారి వారిద్దరు కలవొద్దని హెచ్చరించి వదిలేశారు. అప్పటి నుంచి లలిత దూరంగా ఉంటుండగా రాజేష్ మాత్రం బలవంతం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న లలిత వద్దకు వచ్చిన రాజేష్ తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. లలిత నిరాకరించడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 95 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న లలితను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి పెద్ద కుమారుడు దిలీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పరకాల ఐటీసీ గోడౌన్లో అగ్నిప్రమాదం
వరంగల్: వరంగల్ జిల్లా పరకాల ఐటీసీ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.