ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం రెవెన్యూ సహాయ మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. ‘ఫాస్’్ట పథకంతో న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలను విడుదల చేయలేదన్నారు. విద్యార్థులను ఫీజు కోసం యాజమాన్యాలు వేధిస్తున్నాయని, విద్యార్థి సమస్యలపై ఉద్యమిస్తున్న ఏబీవీపీ నాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుంటే టీఆర్ఎస్ నేతలను తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ సం్దర్భంగా ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.