parnashala
-
పోడు ‘పోరాటం’..!
పర్ణశాల: ఏజన్సీలోని పచ్చని పల్లెలు.. ఇప్పుడు పోడు భూముల వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు గిరిజనులు తాము కష్టపడి పోడు కొట్టి, వాటి రక్షణ కోసం అటవీ అధికారులతో కొట్లాడారు. కానీ ఇప్పుడు ఒకరి పోడు భూమిని మరొకరు దుక్కులు దున్నుతున్నారు. ఘర్షణకు దిగుతున్నారు. దీంతో పల్లెలు పగతో రగిలిపోతున్నాయి. దుమ్ముగూడెం మండలంలో రోజుకొక్క ఊరిలో పోడు భూముల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. కేసులు నమోదవుతున్నాయి. గిరిజనులు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ చుట్టు తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం సిగారం, రామరావుపేట గ్రామాల మధ్య పోడు వివాదంతో మొదలైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ఒక మహిళకు తీవ్రంగా, ఇంకొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ తరువాత రోజు జిన్నెలగూడెం, చింతగుప్ప గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గురువారం చిన్ననల్లబల్లి మరో ఘటన జరిగింది. ఇలా ప్రతి రోజు ఏదో ఒక ఊరిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ వివాదాలను రాజకీయ లబ్దికోసం వాడుకునేందుకు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన భూతగాదాలు అన్ని గ్రామాల్లో రాత్రులే జరిగాయి. ఇప్పటికైనా ఈ వివాదాలను పోలీసు ఉన్నతాధికారులు పరిష్కరించకపోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది. -
కానిస్టేబుల్ దుర్మరణం
పర్ణశాల : దుమ్ముగూడెం మండలం కేశవపట్నం గ్రామ శివారులో చెట్టును బైక్ ఢీకొంది. వాహన చోదకుడైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్ మృతిచెందాడు. ఇది గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... మండలానికి సరిహద్దునగల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మారాయిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బొడ్డు శివకుమార్(30), ప్రస్తుతం డిప్యూటేషన్‌పై సైదాగూడ సీఆర్పీఎఫ్ క్యాంపులో పనిచేస్తున్నాడు. ఏటీఎంలో నగదు తీసుకుని నిత్యావసర సరుకులు కొనేందుకని బైక్‌పై గురువారం లక్ష్మీనగరం వచ్చాడు. సరుకులు కొనుక్కుని బైక్‌పై తిరిగి క్యాంపునకు వెళుతున్నాడు. కేశవపట్నం వద్ద ఆయన బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. తీవ్ర గాయాలవడంతో శివకుమార్ అక్కడిక్కడే మృతిచెందాడు. మారాయిగూడేనికి చెందిన ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఏఎస్ఐ గఫార్ కేసు నమోదు చేశారు. -
సందడిగా మారిన భద్రాద్రి పర్ణశాల
-
వరద గోదారిలో పర్ణశాల
దుమ్ముగూడెం : మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగుతోంది. పర్ణశాల పరిసరాలను వరదనీరు కమ్మేసింది. అంత్యపుష్కరాలకు వచ్చిన భక్తులకు ఆటంకం ఏర్పడింది. స్నానఘట్టాల వద్ద ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయంభయంగా స్నానమాచరించిన భక్తులు రామయ్యను దర్శించుకున్నారు. సీతవాగు ఉధృతితో సీతమ్మ విగ్రహం సగభాగం నీటిలోనే ఉంది. సీతవాగు పరిసరాలను దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పర్ణశాలలోని అపురూప దృశ్యాలను చూడలేకపోయామని నిరాశతో వెనుదిరిగారు. పుష్కరాల్లో భాగంగా వేదపండితులు గోదావరి తల్లికి పూజలు చేశారు. సాయంత్రం 6 నుంచి 6.15 గంటల వరకు నదీ హారతి ఇచ్చారు. -
పర్ణశాలలో NDRF భద్రతాసిబ్బంది
-
పర్ణశాలకు పుష్కర సొబగులు..
ముస్తాబవుతున్న సుందర దృశ్యాలు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు దుమ్ముగూడెం: గోదావరి పుష్కర ఘడియలు దగ్గరపడ్డాయి.. ఘాట్లు.. ఆలయూలు అందంగా ముస్తాబవుతున్నాయి.. పుష్కరాలకు తరలివచ్చే భక్తులు పర్ణశాలను సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అక్కడి సుందర దృశ్యాలను అలంకరిస్తున్నారు.. పర్ణశాలలో సీతమ్మ జలకాలాడిన సీతవాగు.. ఆటలాడిన వానకుంటలు.. నారచీరలు.. శూర్పనక చెట్టుకు భక్తులు రాళ్లుకొట్టి వారి ఆక్రోశం వెళ్లగక్కిన దృశ్యాలు.. సీతారాముల పాదాల ఆనవాళ్లను భక్తులు దర్శించుకొని పూజలు చేసేందురు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాములు 14 ఏళ్ల వనవాసంలో సీతమ్మ జలకాలాడిన సీతవాగు చుక్కనీరు ఇంకకుండా నిత్యం జీవనదిలా ఉండడం విశేషం. పుష్కరాల సందర్భంగా పర్ణశాలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.