ప్రమాద దృశ్యం (ఇన్‌సెట్) శివకుమార్ మృతదేహం
పర్ణశాల : దుమ్ముగూడెం మండలం కేశవపట్నం గ్రామ శివారులో చెట్టును బైక్ ఢీకొంది. వాహన చోదకుడైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్ మృతిచెందాడు. ఇది గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... మండలానికి సరిహద్దునగల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మారాయిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బొడ్డు శివకుమార్(30), ప్రస్తుతం డిప్యూటేషన్‌పై సైదాగూడ సీఆర్‌పీఎఫ్ క్యాంపులో పనిచేస్తున్నాడు. ఏటీఎంలో నగదు తీసుకుని నిత్యావసర సరుకులు కొనేందుకని బైక్‌పై గురువారం లక్ష్మీనగరం వచ్చాడు.
సరుకులు కొనుక్కుని బైక్‌పై తిరిగి క్యాంపునకు వెళుతున్నాడు. కేశవపట్నం వద్ద ఆయన బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. తీవ్ర గాయాలవడంతో శివకుమార్ అక్కడిక్కడే మృతిచెందాడు. మారాయిగూడేనికి చెందిన ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఏఎస్‌ఐ గఫార్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment