
సీతారాముల పాదాల ఆనవాళ్లు
- ముస్తాబవుతున్న సుందర దృశ్యాలు
- ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
దుమ్ముగూడెం: గోదావరి పుష్కర ఘడియలు దగ్గరపడ్డాయి.. ఘాట్లు.. ఆలయూలు అందంగా ముస్తాబవుతున్నాయి.. పుష్కరాలకు తరలివచ్చే భక్తులు పర్ణశాలను సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అక్కడి సుందర దృశ్యాలను అలంకరిస్తున్నారు.. పర్ణశాలలో సీతమ్మ జలకాలాడిన సీతవాగు.. ఆటలాడిన వానకుంటలు.. నారచీరలు.. శూర్పనక చెట్టుకు భక్తులు రాళ్లుకొట్టి వారి ఆక్రోశం వెళ్లగక్కిన దృశ్యాలు.. సీతారాముల పాదాల ఆనవాళ్లను భక్తులు దర్శించుకొని పూజలు చేసేందురు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీతారాములు 14 ఏళ్ల వనవాసంలో సీతమ్మ జలకాలాడిన సీతవాగు చుక్కనీరు ఇంకకుండా నిత్యం జీవనదిలా ఉండడం విశేషం. పుష్కరాల సందర్భంగా పర్ణశాలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.