హాస్టల్ గదిలో మెడికో ఆత్మహత్య
చెన్నై: హెచ్ సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్ యూ వివాదం పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న తరుణంలోనే తమిళనాడులో మరో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కన్యాకుమారిలోని ప్రఖ్యాత శ్రీ మూగాంబికా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మెడిసిన చివరి సంవత్సరం చదువుతోన్న పార్థి అనే దళిత విద్యార్థి ఆదివారం హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పోస్టుమార్టం నివేదిక అందాల్సి వుంది. ఆత్మహత్యకు గల కారణాలూ తెలియాల్సిఉంది.