హరితహారంలో భాగస్వాములు కావాలి
మిడ్జిల్ : గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం మండలంలోని మాధారం ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. చెట్లు ఉంటేనే మనం క్షేమంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దీప, వైస్ ఎంపీపీ సుదర్శన్, సర్పంచ్ నారాయణరెడ్డి, ఎంపీటీసీ యాదయ్య, నాయకులు గిరినాయక్, గోపాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, భాస్కర్, శేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, గోపాల్, కాడయ్య తదితరులు పాల్గొన్నారు.