particularly Usually
-
ప్రజల రుణం తీర్చుకుంటా : రోజా
నిండ్ర, న్యూస్‌లైన్: తనను గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి రుణం తీర్చుకుంటానని నగరి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆర్కే.రోజా అన్నారు. వుండలంలోని కొప్పేడులో ఆదివారం ఆమె కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల అండతోనే విజయం సాధిం చినట్లు చెప్పారు. నిండ్ర మండలంలో పార్టీ ముఖ్య నాయకుడు చక్రపాణిరెడ్డి చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. గతంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యేగా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా పోరా టం చేస్తామన్నారు. చక్రపాణిరెడ్డి వుట్లాడుతూ ఎమ్మెల్యేగా రోజాను గెలిపించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు. గ్రామాల్లోని సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ నాయుకులు ఆర్కే.సెల్వవుణి, వునోహర్‌నాయుడు, శ్యామ్‌లాల్, మురళినాయుుడు, నాగభూషణంరాజు, అనిల్‌కువూర్, మేరి, దీప, భాస్కర్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, ఎంపీటీసీలు పరందావుయ్యు, చెంచవ్ము, పవిత్ర, నాదవుునస్వామి, గోపి, దశరథనాయుడు, దామోదరం, రావుచంద్రయ్యు, రేవతి, తదితరులు పాల్గొన్నారు. రోజాకు ఘన స్వాగతం కొప్పేడు గ్రామంలో ఆర్కే.రోజాకు ప్ర జలు ఘనస్వాగతం పలికారు. కర్పూర హారతులు పట్టారు. గ్రావుంలో నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తమ్ముళ్లను నమ్మొచ్చా?
టీడీపీ అభ్యర్థుల్లో అంతర్మథనం తాయిళాల పంపిణీ ఎలా అన్న సందేహం అనుచరుల్ని నమ్ముకుంటే పోలా అని నిర్ణయం నక్కపల్లి, న్యూస్‌లైన్: అసలే ఎన్నికల వేళ... పరిస్థితి చూస్తే అంతంతమాత్రంగా ఉంది... కనీసం తాయిళాలిచ్చైనా ఓటర్లను ప్రసన్నం చేసుకుందామంటే అదీ అంత ‘వీజీ’లా లేదు. ఇప్పుడెలా? టీడీపీ అభ్యర్థుల అంతర్మథనమిది. అసలే మూడు వర్గాలు... ఆరు గ్రూపుల గోలతో సతమతమవుతుంటే పోనీ ఇచ్చిందయినా సక్రమంగా ఓటరుకు చేరుతుందా? లేక మధ్యలోనే మింగేస్తారా? అన్నదే వీరి అనుమానం. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఈ అంశమే చర్చనీయాంశం. తెలుగు తమ్ముళ్ల మధ్య హాట్ టాపిక్లా చర్చ సాగుతోంది. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం స్థానంలో ఎంపీ అభ్యర్థితోపాటు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానికేతరులే కావడంతో వీరంతా పూర్తిగా పార్టీ కేడర్‌పైనే ఆధారపడి కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. జగన్మోహన్రెడ్డికి ఒకసారి అధికారమిద్దామన్న కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ నాయకులు ఎంత డబ్బు వెదజల్లి ఎన్ని ఆశలు చూపినా ఓటర్లు మాత్రం వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ కార్యకర్తలు, నాయకుల ద్వారా డబ్బు పంపిణీ చేస్తే ఓటర్లకు చేరుతుందా అన్న గుబు లు అభ్యర్థులను వేధిస్తోంది. ప్రధానంగా ‘ఎలాగూ ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు కావున, ఇప్పుడు డబ్బులిచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ఈ పరిస్థితుల్లో అభ్యర్థులిచ్చిన మొత్తం కాస్తా మనమే నొక్కేస్తే నాలుగు రాళ్లు వెనుకేసుకున్నట్లు ఉంటుంది కదా’ అన్న ఆలోచన పలువురు తమ్ముళ్లు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా మరో ఐదేళ్ల వరకు ఎన్నికలుండవు, ఈ ఎన్నికల తర్వాత అభ్యర్థులు పలకరించిన పాపాన పోరు. ఈ పరిస్థితుల్లో అందినకాడికి వెనుకేసుకోవడమే మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది తమ్ముళ్లలో ఉన్నట్లు సమాచారం. ఆ నోటా ఈ నోటా విస్తరించిన ఈ మాటలు చివరికి అభ్యర్థుల చెవుల్లోకి చేరాయి. దీంతో డబ్బులు పంచినా ఓటర్లకు చేరుతాయన్న గ్యారంటీ లేదన్న నమ్మకానికి అభ్యర్థులు వచ్చేశారు. పైగా ఎన్నికల ముందు పలువురు కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరారు. ఎప్పటి నుంచో ఉన్న తెలుగు తమ్ముళ్లకు, వీరికి మధ్య అసలు పొసగడం లేదు. దీంతో ఓటర్లకు పంచే డబ్బులు మా ద్వారా పంపిణీ జరగాలంటే... మా ద్వారా జరగాలంటూ రెండు వర్గాలు అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఒక వర్గానికి ఇచ్చి మరొక వర్గానికి ఇవ్వకపోతే ఏ చిక్కు వచ్చిపడుతుందోననే భయం అభ్యర్థులను వెంటాడుతోంది. దీంతో అభ్యర్థులు పునరాలోచనలో పడ్డారని సమాచారం. సొంతవారితోనే కొంత మేలు స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్లను నమ్ముకునే కంటే తమ వారిని నమ్ముకుంటేనే కొంతై నా మేలు జరుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నట్లు స మాచారం. ఒక అభ్యర్థి అయితే ఏకంగా తన సంస్థల్లో పనిచే సే సిబ్బందిని, చదువుతున్న విద్యార్థులతోపాటు తన సొం త ప్రాంతానికి చెందిన వారితో తాయిళాలు పంపిణీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సదరు అభ్యర్థి అనుచర గణం గ్రామాల్లో ఈ దిశగా పనిచేస్తున్నారు. పార్టీ జెండాలు, స్టిక్కర్లు, పోస్టర్లను వారే పంపిణీ చేస్తున్నారు. దీన్ని చూసి స్థానిక తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జెండాలు మోసే తమను కాదని వారి సొంత మనుషులతో ఎలాపంపిణీ చేస్తారో చూద్దామంటూ తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఉప ఎన్నికల్లో ఇలా వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వచ్చి పెత్తనం చేయడంవల్లే కాంగ్రెస్, టీడీపీలు పరాజయం పాలయ్యాయనే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. అభ్యర్థులు తమ వారితో డబ్బులు పంపిణీ చేయిస్తారా? లేక ఏదయితే అదయిందిలే అని స్థానికంగా ఉన్న కార్యకర్తలకే ఇస్తారా చూడాలి. -
9393610113 నంబరు నుంచి మాజీ మంత్రి బెదిరింపులు ?
స్వతంత్రులకు మద్దతివ్వాలంటూ హుకుం వ్యాపారుల నుంచి చందాలకు డిమాండ్ ? పట్టణంలో కలకలం రేపిన వైనం ఉయ్యూరు, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం పెచ్చుమీరింది. వైఎస్సార్ సీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఆయా వార్డుల్లో అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్న నాయకులను, కార్యకర్తలను, వ్యాపారులను మీ అంతు చూస్తామంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు వార్నింగ్‌లు ఇవ్వడం సంచలనం రేకెత్తించింది. కృష్ణా జిల్ల ఉయ్యూరులో ఆరో వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంగవీటి శ్రీనివాసప్రసాద్‌కు మద్దతుగా రజక సంఘ నాయకుడు, వైఎస్సార్ సీపీ అభిమాని కె.సాయిశ్రీనివాస్ ప్రచారం చేశారు. అక్కడ మాజీ మంత్రి పార్థసారథి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపిన సయ్యద్ అజ్మతుల్లా గెలుపునకు సాయి శ్రీనివాస్ ఆటంకంగా మారారు. ఇది సారథికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంకేముంది సదరు మాజీ మంత్రి అగ్గిమీద గుగ్గిలమై 9393610113 నంబరు నుంచి ఫోన్ చేసి సాయిశ్రీనివాస్‌తో దుర్భాషలాడారు. బెదిరించారు. ‘ఏరా సాయి.. ఒళ్లు బలిసిందా.. నాతో పనులు చేయించుకుని వాడెమ్మట తిరుగుతావా.. వైఎస్సార్ సీపీకి మద్దతుగా వెళ్తే నీ అంతు చూస్తా.. నా మద్దతుదారుడికే చేయ్.. లేకుంటే తొక్కేస్తా..’ అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతూ విరుచుకుపడ్డారు. దీంతో కంగుతిన్న శ్రీనివాస్ ఈ విషయాన్ని రజకసంఘం, పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు చాగంటి సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, బాపట్ల సుబ్బారావు స్థానిక రాయల్ సమావేశపు హాల్లో శనివారం సమావేశమై మాజీ మంత్రి సారథి బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలానే మరికొందరి వ్యాపారులపైనా సారథి, ఆయన అనుచరులు చిందులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘నేను అధికారంలో ఉండగా పనులు చేయించుకుని ఇప్పుడు షాపుల్లో కూర్చుంటారా. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వెళ్లకపోతే మీ అంతు చూస్తా..’ అంటూ బెదిరిస్తున్నట్లు పట్టణం కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే సారథి అనుచరుల ఆగడాలు మరింత పెరిగాయి. ఓ బడా వ్యాపారి వద్దకు వెళ్లి చందా అడగ్గా, ఆ వ్యాపారి కొంత మొత్తం ఇచ్చాడు. ‘ఈ మొత్తం చాలదు. నీవు లక్ష ఇవ్వాల్సిందే’ అంటూ పట్టుబట్టాడు సదరు మాజీ మంత్రి అనుచరుడు. దీంతో నివ్వెరపోయిన ఆ వ్యాపారి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండగా, ఓ మధ్యవర్తి జోక్యం చేసుకుని మధ్యేమార్గంగా సర్దుబాటు చేసినట్లు తెలిసింది.