ధర్మాన్ని రక్షిద్దాం
కర్నూలు(న్యూసిటీ): ప్రతి ఒక్కరు ధర్మాన్ని రక్షించాలని జైనుల గురువు రాజ్తిలక్ సురీశ్వరజీ అన్నారు. జైనుల పర్యుషన్ పండగ సందర్భంగా ఆదివారం కర్నూలులోని బొంగుల బజార్ శ్రీశాంతినా«ద్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైనుల గురువులు రాజ్తిలక్ సురీశ్వరజీ చాతుర్మాస్య దీక్షల్లో భాగంగా జైనుశ్వేతాంబర్మూర్తి పూజక్ సంఘ్ ఆధ్యర్యంలో కార్యక్రమాన్ని వైభంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ జీవహింస చేయరాదన్నారు. జైనుల 45 రోజులపాటు ఉపవాసదీక్షలు పాటించిన 18 మంది యువతీ, యువకులను సన్మానించారు. ముందుగా పాతబస్టాండు నుంచి కాంగ్రెసు ఆఫీసు, రాధకష్ణ టాకీసు, మీదుగా శాంతినా«ద్ జైన దేవాలయం వరకు అంగరంగ వైభవంగా ర«థాల మీద ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో జైనుశ్వేతాంబర్మూర్తి పూజక్ సంఘ్ నాయకులు దీలీప్కుమార్జైను, అంబాలాల్జైను, శాంతిలాల్జైను రాజీన్షాజైనుతో పాటు అనేక మంది జైనులు పాల్గొన్నారు.