పాకిస్థాన్ పైశాచికం
పెషావర్: ఎవరి పేరు మీద కోటానుకోట్ల డాలర్లు ఉపకారాన్ని పొందుతుందో.. ఎవరిని ఆదుకుంటున్నామని చెప్పుకుంటూ అంతర్జాతీయ సమాజం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తుందో.. అలాంటి పాస్తున్(అఫ్ఘాన్) శరణార్థుల పట్ల పాకిస్థాన్ ఘోర పైశాచికాన్ని ప్రదర్శిస్తోంది. 'అఫ్ఘాన్ శరణార్థులకు మేము ఆశ్రయం కల్పిస్తున్నాం.. పాకిస్థాన్ శాంతికాముక దేశం అనడానికి ఇదే నిదర్శనం. వాళ్లను ఆదుకోవడానికి మరింత డబ్బు సాయం చేయండి' అని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొద్ది రోజుల కిందట ఐక్యరాజ్యసమితిలో గొప్పలు చెప్పుకున్నదానికి భిన్నంగా.. 50 లక్షల మంది పాస్తున్ శరణార్థులపై పాక్ సైన్యం, వైమానిక దళాలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ దేశం విడిచి పోరాపోయేలా చేస్తున్నాయి.
గడిచిన పాతికేళ్లుగా పాక్ నేలతో మమేకమైన పాస్తున్ లు గడిచిన వారం రోజులుగా కట్టుబట్టలతో అఫ్ఘాన్ లోని సొంత ప్రాంతం బటి కోట్ కు పారిపోతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు శనివారం అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. అటు బటి కోట్ (తూర్పు అఫ్ఘాన్ లోని నంగార్హర్ ప్రావిన్స్)లోనూ పరిస్థితులు ప్రమాదకంగా ఉన్నాయి. అక్కడ ఐసిస్, అఫ్ఘాన్ సన్యాలకు పెద్ద యుద్ధమే నడుస్తోంది. అయినాసరే పాకిస్థాన్ వాళ్లను తరుముతూనేఉంది. శరణార్థులపై దాడులు కొత్త కానప్పటికీ భారత్-అఫ్ఘానిస్థాన్ ల మైత్రి బలపడుతుండటంతో ఇటీవల పాక్ వికృతాలు పరాకాష్టకు చేరాయి. ఈ వలసకు సంబంధించిన వార్తలు శనివారం అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి.
2014, డిసెంబర్లో పెషావర్ సైనిక స్కూల్‌పై పాక్ తాలిబన్ల దాడి అనంతరం.. అఫ్ఘాన్ శరణార్థులపై దాడులు పెరిగిపోయాయి. వాళ్లను సొంతదేశానికి వెళ్లగొట్టడమేపనిగా పెట్టుకున్న పాక్ బలగాలు.. శరణార్థులపై తీవ్ర హింసను ప్రయోగిస్తున్నాయి. వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో దాదాపు 50 లక్షల మంది అఫ్ఘన్ శరణార్థులు గడిచిన 25 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. 1980ల్లో అమెరికా- రష్యాల ఆధిపత్యపోరులో భాగంగా జరిగిన యుద్ధం సమయంలో, 9/11 సంఘటన తర్వాత అఫ్ఘాన్ పై అమెరికా దాడుల సమయంలో వీరంతా పాకిస్థాన్ కు వలవవచ్చారు.
అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్నవారిపైనేకాక అధికారికంగా పేర్లు నమోదుచేయించుకున్న వారిని కూడా పాక్ సైన్యాలు వదలడం లేదు. పాస్తున్ లు నివసించే ఇళ్లు, చిన్న చిన్న దుకాణాలను ధ్వంసం చేయడం, మేకలు, గొర్రెల్లు, కోళ్లను ఎత్తుకెళ్లడంతోపాటు బలవంతంగా లంచాలు వసూలు చేయడం, మాట వినకుంటే జైళ్లలో పెట్టి హింసించడం పాక్ బలగాలకు అలవాటైనపని. పెషావర్ సైనిక స్కూల్ పై దాడి జరిగిన తర్వాతి మూడు నెలల్లో దాదాపు 60 వేల మంది శరణార్థులు సొంతదేశానికి వెళ్లిపోగా ఇప్పుడు ఆ సంఖ్య లక్షలకు పెరిగింది.