patel reservation
-
వీలునామా సిద్ధం చేసుకున్న హార్దిక్
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్లతోపాటు రైతు రుణమాఫీ చేయాలంటూ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ చేస్తున్న అమరణ నిరాహార దీక్షకు ఆదివారంతో 9రోజులు పూర్తయ్యాయి. అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్ తన ఆస్తులను పంచుతూ వీలునామా రాయడం సంచలనం సృష్టిస్తోంది. హార్దిక్ ఖాతాలో రూ.50 వేలున్నాయి. ఇందులో తల్లిదండ్రులకు 20వేలు, పంజ్రపోల్ గ్రామంలో ఆవులకు షెడ్ కోసం రూ.30వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ‘తన జీవితగాథపై వస్తున్న పుస్తకం హూ టుక్ మై జాబ్‌పై వచ్చే రాయల్టీ, ఇన్సూరెన్స్ డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడేళ్ల క్రితం పటీదార్ ఉద్యమంలో చనిపోయిన 14 మందికి పటేళ్లకు సమానంగా పంచాలని హార్దిక్ పేర్కొన్నారు’ అని పటీదార్ సంఘం అధికార ప్రతినిధి మనోజ్ పనారా వెల్లడించారు. ఒకవేళ ఈ దీక్షలో తను చనిపోతే.. కళ్లను దానం చేయాలని సూచించారు. వీలునామాలో పేర్కొన్న వివరాల ప్రకారం హార్దిక్ ఆస్తిలో 15%తల్లిదండ్రులకు, 15% చెల్లెలికి మిగిలిన 70% 14 మంది పటీదార్లకు చెందుతుంది. -
కాంగ్రెస్‌లోకి గుజరాత్ ఠాకోర్ నేత అల్పేశ్
అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్లో కాంగ్రెస్‌కు ఠాకోర్ వర్గం నాయకుడు అల్పేశ్ ఠాకోర్ మద్దతు లభించింది. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల్లో కలిసిరావాలని పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హర్దిక్ పటేల్‌తో పాటు, అల్పేశ్, జిగ్నేష్ మేవానీలను శుక్రవారం కాంగ్రెస్ ఆహ్వానించిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ ఓబీసీ ఏక్తా మంచ్‌కు కన్వీనర్‌గా ఉన్న ఠాకోర్కు బీసీ వర్గాల్లో మంచి పట్టుంది. గుజరాత్ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జ్ అశోక్ గెహ్లోట్, గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్సిన్హ్ సోలంకితో కలిసి ఆయన రాహుల్‌ను కలిశారు. ఎన్సీపీతో పాటు, జేడీయూ ఏకైక ఏమ్మెల్యే ఛోటు వసావాతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు. -
'హార్థిక్ వెనుక విదేశీ హస్తం'!
అహ్మదాబాద్: పటేళ్లకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న యువ కెరటం హార్థిక్ పటేల్ కస్టడీని అహ్మదాబాద్ కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. దీంతో ఆయన నవంబర్ 3 వరకు పోలీసుల అదుపులో ఉండనున్నారు. మరో వారం రోజులపాటు తమ కస్టడీలో ఉంచేందుకు అనుమతించాలంటూ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించగా రెండు రోజులు అనుమతించారు. అంతకుముందు వారం రోజుల గడువుతో హార్థిక్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆ గడువు అయిపోవడంతో కోర్టు ముందు ప్రవేశపెట్టి మరో వారం గడువు కోరారు. హార్ధిక్ పటేల్ తమకు విచారణకు సహకరించడం లేదని, మొత్తం 452 గ్రూపులు వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తున్నారని గుర్తించామని కోర్టుకు తెలిపారు. ఆగస్టు 25న నిర్వహించిన ర్యాలీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేయాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. వీరి ఆందోళనకు విదేశీ హస్తం కూడా ఉందని, అక్కడి నుంచి వీరికి నిధులు సమకూరుతున్నాయనే అనుమానం కూడా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించడం అత్యవసరం అని తాము భావిస్తున్నామని క్రైం బ్రాంచ్ కోర్టుకు వివరించింది. దేశద్రోహం, సమాజంలో అలజడులు సృష్టించడం వంటి తీవ్ర ఆరోపణలతో గతవారం హార్థిక్ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. పటేళ్లకు రిజర్వేషన్లకోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్.. దేశద్రోహి అని నిరూపించేలా ప్రాథమిక ఆధారాలున్నాయని గుజరాత్ హైకోర్టు కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీసులను చంపాలనటం దేశద్రోహం కిందకే వస్తుందని.. అందువల్ల సూరత్ పోలీసులు హార్దిక్ పటేల్‌పై నమోదు చేసిన కేసు కొట్టేసేది లేదని జస్టిస్ జేబీ పార్దివాలా అంతకుముందు తీర్పునిచ్చిన విషయం విధితమే.