
అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఠాకోర్ వర్గం నాయకుడు అల్పేశ్ ఠాకోర్ మద్దతు లభించింది. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల్లో కలిసిరావాలని పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హర్దిక్ పటేల్‌తో పాటు, అల్పేశ్, జిగ్నేష్ మేవానీలను శుక్రవారం కాంగ్రెస్ ఆహ్వానించిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటు చేసుకుంది.
గుజరాత్ ఓబీసీ ఏక్తా మంచ్‌కు కన్వీనర్‌గా ఉన్న ఠాకోర్‌కు బీసీ వర్గాల్లో మంచి పట్టుంది. గుజరాత్ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జ్ అశోక్ గెహ్లోట్, గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్‌సిన్హ్ సోలంకితో కలిసి ఆయన రాహుల్‌ను కలిశారు. ఎన్సీపీతో పాటు, జేడీయూ ఏకైక ఏమ్మెల్యే ఛోటు వసావాతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment