నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!
కొన్ని చీరలు మన భారతీయ హస్తకళా నైపుణ్యానికి ప్రతీకలుగా ఉంటాయి. కాలాలు మారుతున్న వాటి ఉనికి ప్రకాశవంతంగా నిలిచే ఉంటుంది. ఎన్నో వెరైటీ డిజైన్లు వచ్చినా.. పురాతన హస్తకళతో కూడిన చీరలే అగ్రస్థానంలో అలరారుతుంటాయి. తరతరాలు ఆ చీరలను ఆదరిస్తున్నే ఉంటారు. అలాంటి చీరల కళా నైపుణ్యానికి సెలబ్రిటీలు, ప్రముఖులు దాసోహం అంటూ వాటిని ప్రోత్సహిస్తూ భవిష్యత్తు తరాలు తెలసుకునేలా.. ఆ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు కూడా. అలాంటి 900 ఏళ్ల నాటి హస్తకళా నైపుణ్యానికి పేరుగాంచిని పటోలా చీరల విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీకి సైతం ఈ చీరలంటే మహా ఇష్టం. ఆ మక్కువతోనే ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించిన చిన్న కుమారుడు అనంత్-రాధికల వివాహంలో ఈ చీరలనే అతిధులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతలా కట్టిపడేసేలా ఆ పటోల చీరల్లో ప్రత్యేకత ఏముందంటే..?ఎక్కడ నుంచి వచ్చాయంటే..ఈ పటోలా చీరలు గుజరాత్‌లోని పటాన్ ప్రాంతం నుంచి వచ్చాయి. ఈ చీరలు శక్తిమంతమైన రంగుల కలయికతో క్లిష్టమైన డిజైనలతో ఉంటాయి. ఈ చీరల తయారీ అనేది శ్రమతో కూడిన హస్తకళ అని చెప్పాచ్చు. అంబానీల ఇంట జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత నుంచి వీటి అమ్మకాలు బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చాలామంది మగువలు ఏరికోరి ఈ పటోలా చీరలను తెప్పించుకుని మరీ కొంటున్నారు. ప్రత్యేకతలు..పటోలా చీర తయారీ అంత ఈజీ కాదు. తొందరగా అయ్యిపోయే పనికూడా కాదు. ప్రతిభాగానికి దాదాపు పది నుంచి పన్నెండు మంది కళాకారుల బృందంతో సుమారు ఆరు నెలల శ్రమ ఫలితం ఈ చీరలు. చక్కటి పట్టు దారాలతో నేసిన చీరలివి. భారతదేశ గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించేలా చక్కటి మనికతో ఉంటాయి. వీటి సరిగ్గా వాడితే శతాబ్దం వరకు చెక్కు చెదరవట. అయితే ఈ పటోలా చీరలను మాములు పద్ధతిలో వాష్ చేయకూడదు. వీటిని డ్రై-క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి..పటోలా చీరల కీర్తీ సరిహద్దులు దాటి..జర్మనీ, యూఎస్ఏ, రష్యా వంటి దేశాల అభిమానం కూడా సంపాదించుకుది. బనారసీ చీరల తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న సాంప్రదాయ వస్త్రాలలో ఇవి ఒకటి. అయితే వీటి ధరలు ప్రారంభ ధర రూ. 10 వేల నుంచి మొదలై దాదాపు ఏడు లక్షలుదాక పలికే లగ్జీరియస్ చీరలు కూడా ఉన్నాయి. (చదవండి: ప్రమాణ స్వీకారంలో కసవు చీరలో మెరిసిన ప్రియాంక.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?)