మెక్సికోకు తప్పిన భారీ హరికేన్ ముప్పు
మెక్సికో: మెక్సికో పసిఫిక్ తీర ప్రాతంలో ఏర్పడిన 'ప్యాట్రీసియా' హరికేన్ ఉత్తర ప్రాంతానికి చేరే సమయానికి బలహీన పడడంతో భారీ ముప్పు తప్పింది. శుక్రవారం గంటకు 325 కిలోమీటర్ల వేగంతో ఉన్న హరికేన్ పర్వతాలను తాకుతూ బలహీనపడడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ముందుగానే హరికేన్ ప్రమాదాన్ని అంచనావేసిన మెక్సికో ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. హరికేన్ ప్రభావానికి తీరప్రాంతంలో మత్స్యకారుల గ్రామాలలోని కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి.
2013లో ఫిలిప్పైన్స్‌లో ఏర్పడిన హయాన్ హరికేన్ గంటకు 315 కిలోమీటర్ల వేగంతో పెను విధ్వంసం సృష్టించి 7,350 మంది మృతికి కారణమైంది. ప్యాట్రీసియా హరికేన్ అంతకన్నా భలమైనదిగా ఏర్పడినప్పటికీ తీరం దాటే సమయానికి క్రమేణా బలహీన పడడంతో మెక్సికోకు పెనుముప్పు తప్పింది.