Patrick farhart
-
టీమిండియాకు పాట్రిక్ బైబై
మాంచెస్టర్: వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే భారత్ ప్రస్థానం ముగియడంతో జట్టుతో ఫిజియో పాట్రిక్ పయనం సైతం ఆగిపోయింది. 2015లో భారత జట్టు ఫిజియోగా పాట్రిక్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం 2019 వరల్డ్‌కప్ వరకు మాత్రమే ఆయన కొనసాగాలి. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్‌కప్‌తోనే ఆయన పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ఫిజియోగా తాను తప్పుకొంటున్నట్లు పాట్రిక్ గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘గత నాలుగేళ్లుగా భారత జట్టుతో నా ప్రయాణం అద్భుతంగా సాగింది. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. టీమిండియా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలి’అని అందులో ఆయన పేర్కొన్నాడు. -
‘ప్రపంచకప్‌తో నా కెరీర్ ముగిసినట్లే’
మాంచెస్టర్: టీమిండియా ఫిట్నెస్ ట్రైనర్ పాట్రిక్ ఫర్హత్ పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా పాట్రిక్ ఫర్హత్ భావోద్వేగమైన ట్వీట్‌ను పంచుకున్నారు. తన పదవీ కాలం ముగియనున్న దశలో భారత్ ప్రపంచకప్ టోర్నీ నుంచి వైదొలగడం నిరాశపరించిందన్నారు. 2015 నుంచి పాట్రిక్ ఫర్హత్ భారత క్రికెట్ టీం వెన్నంటే ఉంటూ శంకర్ బసుతోపాటు ఫిట్నెస్ ట్రైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆయన పదవీకాలం పూర్తి కానుంది. దీంతో తన అనుభూతులను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం నిరాశ కలిగించిదని, ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ బాధపడ్డారు. ఏదేమైనా 4 సంవత్సరాలుగా టీమిండియాతో కలిసి పని చేసే అవకాశాన్నిచ్చినందుకు బీసీసీఐకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆటగాళ్లందరూ మంచి విజయాలు సాధించాలని పాట్రిక్ ఆకాంక్షించారు. మరోవైపు పాట్రిక్ అందించిన సేవలకు భారతీయ క్రికెటటర్లు కృతజ్ఞతలు తెలిపారు. ‘మాకోసం మీరు పడ్డ శ్రమ మర్చిపోలేనిది’ అంటూ ఆల్‌రౌండర్ ఆటగాడు ధవళ్ కులకర్ణి, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ ట్రైనర్ పాట్రిక్ సేవలను కొనియాడారు. -
భారత జట్టు ఫిజియోగా ఫర్హర్ట్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కొత్త ఫిజియోగా ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్రిక్ ఫర్హర్ట్ ఎంపికయ్యారు. ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నితిన్ పటేల్ స్థానంలో ఫర్హర్ట్ను బీసీసీఐ నియమించింది. వచ్చే నెలలో జరిగే భారత్, శ్రీలంక టెస్టు సిరీస్‌నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. ఫిజియోగా దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ప్యాట్రిక్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు పని చేశాడు. టీమ్ మసాయర్గా అరుణ్ కనడేను ఎంపిక చేయగా, ఇటీవల జింబాబ్వే సిరీస్ నుంచే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణుడిగా శంకర్ బసు కూడా జట్టుతో చేరాడు. ఈ ముగ్గురికి బోర్డు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చింది.