patrol police
-
'88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ'
ముంబై: మహారాష్ట్ర పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని అనుసరించబోతున్నారు. శివాజీపార్క్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం మౌంటెడ్ పోలీస్ యూనిట్‌ను విధుల్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. మహానగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా 1932లో మౌంటెడ్ పోలీస్ యూనిట్ సేవలను రద్దు అయినట్లు మంత్రి వెల్లడించారు. నేటి ముంబై పోలీసులు అధునాతన జీపులు, మోటర్ సైకిళ్లు వాడుతున్నారు. గుంపుగా ఉన్న ప్రాంతాల్లో క్రైమ్ పెట్రోల్ చేయడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలా చేయడం ఇదే తొలిసారని మంత్రి మీడియాతో పేర్కొన్నారు. గస్తీ విషయంలో గుర్రంపై ఉన్న పోలీస్.. రోడ్ మీద విధుల్లో ఉన్న 30మంది పోలీస్‌లతో సమానమన్నారు. ఒక సబ్ఇన్స్పెక్టర్ క్రింద ప్రస్తుతం 13 గుర్రాలతో కూడిన యూనిట్ ఉండగా.. వచ్చే ఆరునెలల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ క్రింద 32 మంది కానిస్టేబుల్స్‌తో కూడిన 30 గుర్రాల యూనిట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వీటి కోసం అంధేరీలో 2.5ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. చదవండి: పౌర నిరసనలు : ‘పోలీసులే దొంగలయ్యారు’ -
చోరీసొత్తును వదిలేసి పరారయ్యారు..
పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసిన ముగ్గురు దొంగలు తాము దొంగతనం చేసిన సొత్తును వదిలేసి పరారయ్యారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 5 గంటల మేడ్చల్ క్రైం పోలీసులు మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై నుండి మేడ్చల్ పట్టణంలోకి పెట్రోలింగ్ చేస్తూ వస్తుండగా కట్టపై నుండి ముగ్గురు దొంగలు ద్విచక్రవాహనంపై దేవాలయాల్లో దొంగతనం చేసిన సొత్తును మూట కట్టుకుని వెళుతున్నారు. దొంగలు ఎదురుగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి వాహనానికి కొద్ది దూరంలో మూట ను, బైక్ ను పడేసి.. పరార్ అయ్యారు. పోలీసులు అనుమానంతో ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేసినా వారు దొరకలేదు. మూటను విప్పి చూడగా అందులో దేవుళ్ళకు అలంకరించే వెండి ఆభరణాలు, హుండీలో దొంగతనం చేసిన కొంత నగదు లభించింది. దొంగలు మూడు, నాలుగు ఆలయాల్లో దొంగతనం చేసిన సొత్తును వదిలివేసి వెళ్ళారని సీఐ తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల బట్టి త్వరలోనే దొంగలను అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు
రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 12 గంటల సమయంలో గొడవ పడుతున్న నలుగురు యువకులను పెట్రోలింగ్ పోలీసులు మందలించి పంపించేశారు. గంట తర్వాత తిరిగి వారు అక్కడకు చేరుకోగా, రాకేశ్ అనే వ్యక్తిపై మిగిలిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.