ముంబై: మహారాష్ట్ర పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని అనుసరించబోతున్నారు. శివాజీపార్క్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం మౌంటెడ్ పోలీస్ యూనిట్‌ను విధుల్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. మహానగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా 1932లో మౌంటెడ్ పోలీస్ యూనిట్ సేవలను రద్దు అయినట్లు మంత్రి వెల్లడించారు. నేటి ముంబై పోలీసులు అధునాతన జీపులు, మోటర్ సైకిళ్లు వాడుతున్నారు.
గుంపుగా ఉన్న ప్రాంతాల్లో క్రైమ్ పెట్రోల్ చేయడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలా చేయడం ఇదే తొలిసారని మంత్రి మీడియాతో పేర్కొన్నారు. గస్తీ విషయంలో గుర్రంపై ఉన్న పోలీస్.. రోడ్ మీద విధుల్లో ఉన్న 30మంది పోలీస్‌లతో సమానమన్నారు. ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్ క్రింద ప్రస్తుతం 13 గుర్రాలతో కూడిన యూనిట్ ఉండగా.. వచ్చే ఆరునెలల్లో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ క్రింద 32 మంది కానిస్టేబుల్స్‌తో కూడిన 30 గుర్రాల యూనిట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వీటి కోసం అంధేరీలో 2.5ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment