Horses
-
ఒక్కో గుర్రానిది ఒక్కో ప్రత్యేకత.. దేనికదే మేటి (ఫొటోలు)
-
అశ్వాలు ఆందోళన తగ్గిస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయట పడేందుకు వివిధ రకాల చికిత్సా పద్ధతులను పాటించే ఉంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు మరో కొత్త తరహాలో సాంత్వన అందించవచ్చని సైకాలజిస్ట్ నిమ్రా మీర్జా చెబుతున్నారు. దాని పేరు ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’... అంటే గుర్రాలతో స్నేహం చేయడం, వాటితో సహవాసం వల్ల కూడా మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీనికి గుర్తింపు ఉండగా, మన దేశంలో బెంగళూరు, చెన్నైల్లో ఈ పద్ధతి వచ్చేసింది. ఇక తెలంగాణలో తొలిసారి ఈ థెరపీని నిమ్రా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన నిమ్రా ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. ఈ థెరపీలోనూ లోతైన అధ్యయనం చేశారు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ (ఈఎఫ్‌టీ)లో కూడా పట్టా పొందిన ఆమె హార్స్ రైడర్‌గా పలు పోటీల్లో పాల్గొన్నారు. తొలిసారి రానున్న ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నగరంలో జరిగింది. అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ)లో నిమ్రా మీర్జా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హార్స్ రైడింగ్‌కు సంబంధించి ప్రాథమికాంశాలు, గుర్రాల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ మంచి రైడర్‌గా మారేందుకు అవసరమైన సూచనలతో పాటు థెరపీకి సంబంధించిన పలు అంశాలను నిమ్రా వివరించారు. ‘హార్స్ రైడింగ్ అంటే చాలా మంది ఒక ఆటగా మాత్రమే చూస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను కరిగించి శారీరకంగా మంచి ఫలితాలు అందించడం రైడింగ్‌లో సహజంగా కనిపించే ప్రయోజనం. కానీ రైడింగ్‌తో పాటు గుర్రాలను మచ్చిక చేసుకోవడం ద్వారా మానసిక సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వారిపై, కొన్ని రకాల మానసిక వ్యాధులతో బాధడుతున్నవారిపై కూడా ఈ థెరపీ బాగా పని చేస్తుంది. ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వారు సైతం ఈ ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీతో కోలుకున్న అనుభవం నా ముందుంది. కొత్తగా వచ్చిన ఈ చికిత్స ఎక్కువ మందికి చేరాలనేదే మా ప్రయత్నం’అని నిమ్రా వివరించారు. మున్ముందు కూడా హెచ్పీఆర్సీ కేంద్రంగా ఈ చికిత్స అందిస్తామని ఆమె వెల్లడించారు. -
అశ్వాలేవీ..? లొట్టిపిట్టలెక్కడ
దేశంలో మొత్తంగా పశు సంపద కొంతమేర పెరిగినా.. ఒంటెలు, గుర్రాల వంటి జంతువుల సంఖ్యలో 9 శాతం క్షీణత నమోదైంది. 2.90 లక్షల గుర్రాలు తగ్గిపోగా.. 1.50 లక్షల ఒంటెలు కనుమరుగయ్యాయి. గాడిదలు, పందుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంకర జాతి పశువుల సంఖ్య 26.9 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 6.60 లక్షల గ్రామాలు.. 89 వేల పట్టణాల్లోని 27 కోట్లకు పైగా గృహాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన 20వ పశుగణన నివేదిక ఈ విషయాల్ని తేటతెల్లం చేసింది. పశుగణన ఏం తేల్చిందంటే.. ► 2012 – 2019 మధ్య మొత్తం పశువుల జనాభాలో 4.6 శాతం పెరుగుదల నమోదైంది. ► దేశంలో ఒంటెలు 84 శాతం రాజస్థాన్‌లో ఉండగా.. 11 శాతం గుజరాత్లో ఉన్నాయి. ► 2012 నుంచి 2019 సంవత్సరం నాటికి దేశంలో ఒంటెల జనాభా 4 లక్షల నుంచి 2.5 లక్షలకు తగ్గింది. ► ఇక 2012 నుంచి 2019 మధ్య గుర్రాల సంఖ్య 6.3 లక్షల నుంచి 3.4 లక్షలకు తగ్గింది. ► ఇతర దేశాలకు చెందిన, సంకర జాతి పశువుల జనాభా 2012తో పోలిస్తే 2019లో 26.9 శాతం పెరిగింది. ► 2012తో పోలిస్తే దేశీయ (దేశవాళీ) పశువులలో 6 శాతం క్షీణత ఉంది. ► గత గణనతో పోలిస్తే.. 2019లో దేశంలో మొత్తం పౌల్ట్రీ 851.81 మిలియన్లకు చేరటం ద్వారా 16.8 శాతం వృద్ధి నమోదు చేసింది. ► 2012తో పోలిస్తే 2019 నాటికి దేశంలో పెరటి కోళ్ల పెంపకం 48.8 శాతం పెరిగి.. 317.07 మిలియన్లకు చేరింది. తగ్గుదలకు కారణాలివీ.. ► ఒంటెలు, గుర్రాల సంఖ్య తగ్గిపోవడానికి వ్యవసాయ రంగంలో వాటి వినియోగం తగ్గటమే కారణమని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ► గతంలో రవాణాకు ఒంటెలను వినియోగించే వారు. ఇది క్రమంగా తగ్గుతోంది. ► రాజస్థాన్‌లో మేత భూములు తగ్గడంతో వాటి పెంపకం కష్టంగా మారింది. ► ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గుర్రాల పోషణకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది. దీంతో వీటి పెంపకం ఆర్థికంగా సాధ్యం కావడం లేదు. ► దేశీయ గుర్రపు జాతులను ఎక్కువగా పోలీస్ సేవలు లేదా వినోదాల కోసమే ఉపయోగిస్తున్నారు. – గుర్రాల పెంపకానికి పేరొందిన గుజరాత్లో తప్ప ఇతర రాష్ట్రాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ► అయితే ఒంటె జాతిని రక్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెను రాష్ట్ర జంతువుగా ప్రకటించి పలు రక్షణ చర్యలు చేపట్టింది. అలాగే గుజరాత్ ప్రభుత్వం వాటి రక్షణకు చర్యలు తీసుకుంది. కచ్ ప్రాంతంలో ఒంటె పాల సేకరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దేశంలో పశు జనాభా ఇలా.. (మిలియన్లలో) ఏపీలో 15.79 శాతం వృద్ధి రాష్ట్రంలో పశు సంపదలో 15.79 శాతం వృద్ధి నమోదైంది. 2012 పశుగణనలో 2.94 కోట్ల పశు సంపద ఉండగా.. 2019 నాటికి 3.40 కోట్లకు పెరిగింది. పౌల్ట్రీ రంగంలోనూ భారీగా వృద్ధి నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 80.6 మిలియన్ పౌల్ట్రీ జనాభా ఉంటే.. 2019 గణన నాటికి 107.9 మిలియన్లకు చేరింది. అంటే 33.85 శాతం వృద్ధి నమోదైంది. గొర్రెల జనాభాలోనూ 30 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 13.6 మిలియన్లు గొర్రెలు ఉండగా.. 2019 నాటికి 17.60 మిలియన్లకు పెరిగాయి. అయితే గేదెల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012లో 6.50 మిలియన్లు గేదెలుంటే.. 2019 నాటికి 6.20 మిలియన్లకు తగ్గాయి. – సాక్షి, అమరావతి -
Viral Video: విమానంని ఆకాశంలోకి లాకెళ్లిన గుర్రాలు
-
విషం పెట్టి ఆ గుర్రాలను చంపేశారు!
పత్తికొండ (కర్నూలు): పంటలు నాశనం చేస్తున్నాయని కర్ణాటక ప్రాంత రైతులు గుర్రాలకు విషం పెట్టి చంపేసినట్లు తేలింది. మండల పరిధిలోని పందికోన అటవీ ప్రాంతంలో ఏడు గుర్రాల కళేబరాలు బుధవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు దూదేకొండ గ్రామానికి చెందిన మల్లికార్జునను అదుపులోకి తీసుకుని కర్ణాటక పోలీసు స్టేషన్, ఆ గ్రామసర్పంచ్‌ను విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. సీఐ ఆదినారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంఘటన స్థలం పరిశీలన మేరకు కళేబరాలను ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి పడేసినట్లుగా తెలిసిందన్నారు. ఈకోణంలో దూదేకొండ మల్లికార్జునను విచారించాం. రాయచూరు జిల్లాలోని కంపిలి కొట్టాలలో గత కొన్ని నెలల కింద పొలాల్లో పడి గుర్రాలు తమ పంటలను పాడుచేస్తుండటంతో అక్కడి ప్రాంత రైతులు గుర్రాలకు విషాహారాన్ని ఇచ్చినట్లు తెలిసింది. దూదేకొండకు చెందిన మల్లికార్జున తరచూ ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గుర్రాలను స్వామి గుర్రాలుగా దర్గాలకు ఇస్తుంటారు. ఆ విషయం తెలియని దూదేకొండ వాసి గుర్రాలను ఎప్పటిలాగానే వాహనంలో ఇక్కడికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మూడు గుర్రాలు మృత్యువాత పడ్డాయి. మిగిలిన నాలుగు సైతం పత్తికొండకు చేరేలోగా మృతి చెందాయ. దీంతో వాటిని పందికోన అటవీప్రాంతానికి తెచ్చి పడేశారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూశాయి. పంచాయతీ సిబ్బంది సాయంతో గుర్రాలను పూడ్చిపెట్టినట్లు సీఐ తెలిపారు. చదవండి: (మద్యం మత్తులో యువతి కారుతో బీభత్సం.. సెకన్ల వ్యవధిలోనే) -
పెనుభారమైన గుర్రాల పోషణ
-
అశ్వాలే అతడి నేస్తాలు..
జగిత్యాలఅగ్రికల్చర్: జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..అంటూ గుర్రంపై చిరంజీవి ఓ సినిమాలో వెళ్లడం చూస్తుంటే భళే మజాగా ఉంటుంది. అట్లాంటిది అశ్వాల మీద స్వారీ చేయాలనే కోరికతో జగిత్యాల ప్రాంతంలోని కొందరు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వాటిని కొనుగోలు చేసి సరదా తీర్చుకుంటున్నారు. దీనికితోడు ఇటీవల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు గుర్రాలపై వెళ్లి పనులు చేసుకోవాలనే నిర్ణయానికి బలం చేకూర్చాయి. అశ్వాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. గుర్రాలను పెంచుతున్న ముగ్గురు రైతులు జగిత్యాల ప్రాంతంలో ముగ్గురు రైతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుర్రాలు కొనుగోలు చేసి వాటిని పెంచుతున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన అరుణ్ క్రాంతి అంతర్గాం సమీపంలో డెయిరీ ఫాం, చేపలఫాం, కోళ్ల ఫాం, వ్యవసాయం కూడా చేస్తున్నాడు. గుర్రాన్ని లక్షకు గుజరాత్ నుంచి కొనుగోలు చేసి దానిపై తిరుగుతూ సరదా తీర్చుకుంటున్నాడు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మారిశెట్టి రవి అనే రైతు రెండు గుర్రాలను రూ.50 వేలకు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేశారు. ఆ గుర్రాలపై రోజు పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. జగిత్యాల మండలం పెరుకపల్లికి చెందిన బెజ్జంకి హంసయ్య అనే రైతు రెండేళ్లక్రితం చిన్న వయసులో ఉన్న గుర్రాలను రూ.25 వేలకు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి వాటిని పెంచుతూ మురిసిపోతున్నాడు. ప్రత్యేకంగా గుర్రాల పెంపకం గుర్రాలను కొనుగోలు చేసిన రైతులు అరుణ్ క్రాంతి, మారిశెట్టి రవి వాటిని ప్రత్యేకంగా పెంచుతూ ప్రాణంగా చూసుకుంటున్నారు. గుర్రాలకు ప్రతీ రోజు స్నానం చేయించడంతో పాటు పల్లిపిండి, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన దాణాను రోజు ఇస్తారు. దాణాకు నెలకు ఒక్కో రైతు కనీసం రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు ప్రతీరోజు పచ్చి మేత ఆహారంగా ఇస్తున్నారు. గుర్రాల శరీర కండ పరిపుష్టికి రోజు కొద్దిదూరమైనా పరుగెత్తిస్తుంటారు. తారు రోడ్డు, కంకర రోడ్లు ఉండడంతో గుర్రాల కాళ్ల డెక్కలు దెబ్బ తినకుండా, గుర్రాల కాళ్లకు నాడెలు కొట్టిస్తున్నారు. ఎక్కువగా మట్టి రోడ్లపై నడిచేలా శిక్షణ ఇస్తున్నారు. గుర్రాలకు ఏదైనా అనారోగ్యం వస్తే సమీపంలోని పశువైద్యుల వద్ద చికిత్స చేయిస్తున్నారు. గుర్రాల పేడను పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. -
చైనాకు ఇస్కాన్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య చైనాకు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్నెస్(ఇస్కాన్) కూడా చైనా కంపెనీతో చేసుకున్న కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండువందల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కురుక్షేత్రలో కృష్ణార్జున దేవాలయానికి అవసరమైన గుర్రాలను చైనానుంచి కాకుండా ఇండోనేషియా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. కృష్ణార్జున మందిరానికి అవసరమైన 4గుర్రాలను చైనానుంచి కొనుగోలుకు చర్చలు దాదాపు ఖరారయ్యాయి. కానీ దేశంలో చైనా వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆలోచనను విరమించుకుంది. ఈ పరిణామాన్నిఇస్కాన్ అధ్యక్షుడు గోపాల్ దాస్ ధృవీకరించారు. నాలుగు గుర్రాల కోసం చైనా కంపెనీతో చర్చలు జరిపామనీ, అయితే చైనా వ్యతిరేకత కారణంగా ఆర్డర్ ఇవ్వకూడదని నిర్ణయించామని తెలిపారు. ఇండోనేషియాలోని ఒక సంస్థతో చర్చలు జరుగుతున్నామని త్వరలోనే ఖరారు చేయనున్నామని వెల్లడించారు. గోపాల్ దాస్ అందించిన సమాచారం ప్రకారం 34 అడుగులఎత్తు 41 మీటర్ల పొడవుతో పాలరాయితో నాలుగు గుర్రాలను రూపొందించనున్నారు. ఒక్కోదానికి 80-90లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఆలయ సముదాయం నిర్మాణం 2018లో ప్రారంభం కాగా 2022 లో పూర్తి కానుంది. ఆరు ఎకరాలలో 23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులు, 165 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను కలిగి ఉంటుంది. అన్ని గ్రంథాలతో లైబ్రరీ, గోవింద రెస్టారెంట్, 75 గదుల గెస్ట్ హౌస్, ఆర్ట్ గ్యాలరీ, ఆధ్యాత్మిక గిప్ట్స్ షాప్, సూపర్ మార్కెట్, కేఫ్ సౌకర్యాలను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. 60 శాతం నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకుంది. -
శ్రీవారి గుడిలో మూడు గుర్రాలకు అనారోగ్యం
సాక్షి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్య క్షేత్రంలో శ్రీవారి సేవల్లో పాలుపంచుకునే మూడు అశ్వాలు ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. మేత తిన్న కొద్ది సమయానికే అవి కుప్పకూలిపోయాయి. దీన్ని గమనించిన ఆలయ అధికారులు పశువైద్యాధికారుల సాయంతో చికిత్సనందించారు. అయితే అందులో ’అశ్వ’ అనే గుర్రం చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతిచెందింది. మరో అశ్వం ఇంకా చికిత్స పొందుతోంది. మూడో అశ్వం పూర్తిగా కోలుకుంది. స్వామికి సేవలందించే అశ్వాలకు ఇలా జరగడంపై పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా మోర్చ జాతీయ కార్యదర్శి శరణాల మాలతీరాణి చినవెంకన్న సేవకోసం 20 నెలల క్రితం అశ్వ, శ్వేత అనే రెండు (తెల్లరంగు)మగ అశ్వాలను ఆలయానికి బహూకరించారు. అలాగే ద్వారకాతిరుమలకు చెందిన దేవస్థానం ఉద్యోగి శోభనగిరి 18 నెలల క్రితం యోగిని అనే ఆడ అశ్వాన్ని ఆలయానికి బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఆలయ అధికారులు వాటిని శ్రీవారి తిరువీధి సేవలకు, అలాగే ధనుర్మాస, కనుమ, బ్రహ్మోత్సవాలకు వినియోగిస్తున్నారు. శేషాచలకొండపైన గోసంరక్షణశాలలోనే ఈ అశ్వాలను అధికారులు సంరక్షిస్తున్నారు. అరగకపోవడం వల్లే.. ఒకేసారి ఈ మూడు అశ్వాలు అస్వస్థతకు గురి కావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అవి తిన్న ఆహారంలో ఏమైనా విషపు గుళికలు కలిశాయా.. అన్న సందేహాలు కలిగాయి. అయితే మృతిచెందిన అశ్వానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ జి.నాగేంద్ర మాట్లాడుతూ తిన్న మేత అరగకపోవడం వల్లే అశ్వాలు అస్వస్థతకు గురయ్యాయని, ఊపిరందక ఒక అశ్వం మృత్యువాత పడిందని తెలిపారు. అయితే అవి తిన్న మేతలో సాలీళ్లు ఉండటం వల్లే ఇలా జరిగుండొచ్చని చెప్పారు. వైభవాన్ని చాటే అశ్వాలు.. ఆలయానికి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ అశ్వాలు శ్రీవారి ఉత్సవాల వైభవాన్ని చాటాయి. స్వామి వాహనానికి ముందు గజ లక్ష్మి (ఏనుగు)తో కలసి ఈ అశ్వాలు నడుస్తూ కనువిందు చేసేవి. ఒక అశ్వం మృతిచెందడం, మరో అశ్వం ఇంకా చికిత్స పొందుతుండటం పట్ల భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
'88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ'
ముంబై: మహారాష్ట్ర పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని అనుసరించబోతున్నారు. శివాజీపార్క్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం మౌంటెడ్ పోలీస్ యూనిట్‌ను విధుల్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. మహానగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా 1932లో మౌంటెడ్ పోలీస్ యూనిట్ సేవలను రద్దు అయినట్లు మంత్రి వెల్లడించారు. నేటి ముంబై పోలీసులు అధునాతన జీపులు, మోటర్ సైకిళ్లు వాడుతున్నారు. గుంపుగా ఉన్న ప్రాంతాల్లో క్రైమ్ పెట్రోల్ చేయడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలా చేయడం ఇదే తొలిసారని మంత్రి మీడియాతో పేర్కొన్నారు. గస్తీ విషయంలో గుర్రంపై ఉన్న పోలీస్.. రోడ్ మీద విధుల్లో ఉన్న 30మంది పోలీస్‌లతో సమానమన్నారు. ఒక సబ్ఇన్స్పెక్టర్ క్రింద ప్రస్తుతం 13 గుర్రాలతో కూడిన యూనిట్ ఉండగా.. వచ్చే ఆరునెలల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ క్రింద 32 మంది కానిస్టేబుల్స్‌తో కూడిన 30 గుర్రాల యూనిట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వీటి కోసం అంధేరీలో 2.5ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. చదవండి: పౌర నిరసనలు : ‘పోలీసులే దొంగలయ్యారు’ -
చల్‌చల్ గుర్రం.. తండాకో అశ్వం
కొన్ని సినిమాల్లో హీరోల పాత్ర గొప్పగా పండాలంటే.. కచ్చితంగా గుర్రాల సీన్ ఉండాల్సిందే. పాత కాలంలో ఏమో గానీ.. ఆ మధ్యన మగధీరతో మొదలైన గుర్రపు స్వారీల హవా బాహుబలితో శిఖరాగ్రానికి చేరింది. అసలు విషయానికి వస్తే.. సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ కావడానికి ఉపయోగపడే గుర్రాలు విశాఖ మన్యంలోని మారుమూల తండాల్లో దౌడు తీస్తున్నాయి. ఇక్కడి గిరిజనులకు రవాణా సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడి గిరిజనుల జీవనంలో అశ్వాలు ఓ భాగమయ్యాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొండకోనల్లో విసిరేసినట్టుండే తండాల్లోని గిరి పుత్రులకు గుర్రాలే అసలైన నేస్తాలు. రోడ్లు లేని గ్రామాలు, అరణ్యాల నడుమ సుదూరంగా ఉండే గూడేల్ని చేరుకునేందుకు.. వర్షాకాలంలో గెడ్డలు, వాగులు దాటేందుకు గుర్రాలే సిసలైన వాహనాలు. కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని చోటనుంచి అటవీ ఉత్పత్తుల్ని బాహ్య ప్రపంచానికి తరలించాలన్నా.. నిత్యావసర సరుకుల్ని తండాలకు తెచ్చుకోవాలన్నా ఈ ప్రాంత గిరిజనులు అశ్వాల్నే ఆశ్రయిస్తున్నారు. గూడేల్లోని గిరిపుత్రులు మండల కేంద్రాలకు.. అరకు, పాడేరు నియోజకవర్గ కేంద్రాలకు కాలి నడకన వెళ్లాలంటే కనీసం 12 నుంచి 25 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి, దిగాల్సి ఉంటుంది. తండాకు ఓ గుర్రం ఉంటే చాలు.. గిరిజనులు ఏడాది పొడవునా పండించే రాజ్మా చిక్కుళ్లు, రాగులు, జొన్నలు, కాఫీ, మిరియాలు, కొండ చీపుర్లు తదితర ఉత్పత్తులను వారపు సంతల్లో అమ్ముకునేందుకు.. సంతలో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు విశాఖ మన్యంలోని గూడేల ప్రజలు గుర్రాలపైనే వస్తారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవల కోసం మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు గుర్రాలనే వినియోగిస్తుంటారు. మారుమూల తండాలు, ఆవాస ప్రాంతాల్లో 10 నుంచి 15 కుటుంబాల వరకు నివసిస్తుంటాయి. వారిలో ఏ ఒక్క కుటుంబానికి గుర్రమున్నా అందరూ వినియోగించుకుంటారు. అంతా కలిసి దాన్ని పోషిస్తారు. వీటికి గడ్డి, ధాన్యం, దాణా, ఉలవలు ఆహారంగా పెడతారు. వాటిని ప్రాణ సమానంగా చూసుకుంటారు. మాడుగుల సంతలో.. మాడుగుల మండల కేంద్రంలోని వడ్డాది ప్రాంతంలో ప్రతి దసరా రోజున గుర్రాల సంత జరుగుతుంటుంది. ఒక్కో అశ్వం ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. నర్సీపట్నం సమీపంలోని కేడీ పేటలోనూ గుర్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అధికారిక విధులూ నిర్వర్తిస్తాయ్ - ఇక్కడి గుర్రాలను అడపాదడపా అధికారిక విధులకు సైతం వినియోగిస్తుంటారు - ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారులను తరలించేందుకు గుర్రాలే కీలకం - అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన సందర్భాల్లో మృతదేహాలను తరలించేందుకు సైతం గుర్రాలనే వాడుతుంటారు. వినియోగం ఎక్కడెక్కడంటే.. - జి.మాడుగుల మండలం కిల్లంకోట, లువ్వాసింగి - గెమ్మెలి పంచాయతీల పరిధిలోని తండాలు - చింతపల్లి మండలం బలపం పంచాయతీ - కోరుకొండ పంచాయతీ పరిధిలోని సుమారు 70 పల్లెలు - జీకే వీధి మండలం గాలికొండ, అమ్మవారి దారకొండ, జర్రెల, దుప్పిలవాడ, సప్పర్ల, ఎర్రచెరువుల - మొండిగెడ్డ, దారకొండ పంచాయతీల పరిధిలోని 150 తండాలు - పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని 45 నివాస ప్రాంతాలు - గిన్నెలకోట పంచాయతీలోని 18 నివాస ప్రాంతాలు - జామిగుడ పంచాయతీలోని 19 తండాలు - ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీలోని 18 పల్లెలు - బుంగాపుట్టు పంచాయతీలోని 24 నివాస ప్రాంతాలు - రంగబయలు పంచాయతీలోని 22 తండాలు టీచర్‌కూ కొనిచ్చారు జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో చుట్టుపక్కల తండాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 60 వరకు ఉంది. రోడ్డు మార్గం సరిగ్గా లేక.. ఉపాధ్యాయులు సక్రమంగా రాక విద్యార్థుల డ్రాప్ అవుట్స్ శాతం పెరిగింది. మూడు నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు గంపరాయి వెంకటరమణ ఇబ్బందులు పడుతూనే క్రమం తప్పకుండా స్కూలుకు వచ్చేవారు. దీంతో గిరిజనులంతా కలిసి ఆయనకు ఓ గుర్రాన్ని కొనిచ్చారు. ఆయన దానిపైనే వస్తూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. గుర్రం లేకుంటే మాకు జీవనం లేదు మేం పండించిన పంటలను అమ్ముకునేందుకు చింతపల్లి దరి లంబసింగిలో ప్రతి గురువారం సంతకు వస్తుంటాం. గుర్రంపై బరువు వేసి.. మేం నడుచుకుంటూ వస్తాం. గుర్రం లేకుంటే మాకు జీవనమే లేదు. – గూడా బాబూరావు, చీడిమెట్ట గ్రామం, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం మా పిల్లలకు అవే నేస్తాలు మా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గుర్రాలే దిక్కు. అందుకే వాటిని మేం ప్రాణంగా చూసుకుంటాం. మా పిల్లలకు అవే నేస్తాలు.. మా గుర్రాన్ని మా పిల్లలు రాజు అని పిలవగానే పరుగెత్తుకు వస్తుంది. – ఎండ్రపల్లి సూరిబాబు, సుర్తిపల్లి, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం -
ఏమో గుర్రం ఎగరావచ్చు
ఎక్కడైనా గుర్రం ఎగురుతుందా? రెక్కలుంటే తప్పకుండా ఎగురుతుంది. గుర్రానికి రెక్కలుంటాయా? ఎందుకుండవూ?! ఈ జగత్తులో గుర్రాలకు రెక్కలుండకపోవచ్చు గాని, రెండు జగత్తుల్లో మాత్రం గుర్రాలకు రెక్కలుంటాయి. ఒకటి కలల జగత్తు, మరొకటి కళా జగత్తు. కళా జగత్తు ఒక రంగుల ప్రపంచం. ఇందులోకి అడుగుపెట్టే వారి కలలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. కొందరి కలలు వారు జీవించి ఉండగానే నెరవేరుతాయి. అలాంటి కళాకారులు అదృష్టవంతులు. ఇంకొందరికి పాపం మరణించిన తర్వాతే గుర్తింపు దొరుకుతుంది. నిరంతర సాధన, నైపుణ్యం, అనితర సాధ్యమైన ఊహాశక్తికి తోడు కొంచెం అదృష్టం కూడా ఉంటే కళా జగత్తులో ఎవరైనా జెండా ఎగరేయవచ్చు. ఏమో గుర్రం ఎగరా వచ్చుననే ఆశతోనే కొత్త కొత్త కళాకారులు కోటి కలలతో ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా కళారంగంపై ఒక సింహావలోకనం... జీవితాంతం అతడు దేశ దిమ్మరిలాగానే గడిపాడు. ఎక్కడా స్థిరంగా ఎక్కువ కాలం జీవించలేదు. పొట్ట కూటి కోసం రకరకాల ఉద్యోగాలు చేశాడు. మొదట ఆర్ట్ డీలర్‌గా పనిచేశాడు. ఆ పని మొహం మొత్తేయడంతో మత బోధకుడిగా కొన్నాళ్లు పనిచేశాడు. ఆ ఉద్యోగం ఊడిపోవడంతో ఉపాధి కోసం బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. అద్భుతమైన కళా సృజన చేసిన కాలంలో కటిక దారిద్య్రాన్ని చవి చూశాడు. అతడి బొమ్మలు అంతగా అమ్ముడయ్యేవి కాదు. ఒకటీ అరా అమ్ముడైనా పొట్ట నింపుకోవడానికి తగిన ధర కూడా వచ్చేది కాదు. మానసికంగా కుంగిపోయాడు. చివరి దశలో మతిభ్రమించి మానసిక రోగిగా మారాడు. మతి చలించిన స్థితిలో ఒకసారి మద్యం మత్తులో మునిగి చెవి కోసేసుకున్నాడు. కోసేసిన చెవికి కట్టు కట్టించుకున్న తర్వాత తన అవతారాన్నే కాన్వాస్‌పైకి ఎక్కించాడు. మతి భ్రమించిన స్థితిలోనే 37 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణం తర్వాత గాని కళా ప్రపంచం అతడి ఘనతను గుర్తించలేదు. మరణానంతరం ప్రఖ్యాతుడైన ఆ కళాకారుడు విన్సెంట్ వాంగో. వాంగో చిత్రాల్లో ఒకటైన ‘పోర్రై్టట్ ఆఫ్ డాక్టర్ గాషెట్’కు 1990లో జరిగిన వేలంలో ఏకంగా 82.5 మిలియన్ డాలర్ల (రూ.536.29 కోట్లు) ధర పలికింది. ద్రవ్యోల్బణాన్ని లెక్కల్లోకి తీసుకుంటే, ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన పెయింటింగ్స్‌లో అప్పటికీ ఇప్పటికీ ఇదే రికార్డు. తన కుంచెతో చిత్రకళను సుసంపన్నం చేసినప్పటికీ వాంగో ఒక నిరుపేద. విలాసాలకు కొదువలేని రాచ కుటుంబంలో పుట్టాడు. అంతమాత్రాన కళా పోషణతోనే సరిపెట్టుకోలేదు. స్వయంగా కళా సాధన చేపట్టాడు. రంగుల కలలకు రూపునిచ్చేందుకు కుంచె చేతపట్టాడు. వాస్తవిక చిత్రాలను చిత్రించడంలో పాశ్చాత్య శైలిని ఆకళింపు చేసుకుని, ఆ శైలిలో దేశీయ చిత్రాలను చిత్రించాడు. దేవతలు, దేవుళ్ల బొమ్మలను, పురాణాల్లోని సన్నివేశాలను తైలవర్ణాలతో అద్భుతంగా చిత్రించాడు. ఒక లిథోగ్రాఫ్ ప్రెస్ నెలకొల్పి, తన చిత్రాలకు నకళ్లను వేలాదిగా ముద్రించాడు. అతడు చిత్రించిన దేవతల బొమ్మల నకళ్లు ఆ రోజుల్లో ఇంటింటా పూజలందుకున్నాయి. భారతీయ చిత్రకళారంగంలో ఒక వెలుగు వెలిగిన ఆయన పేరు రాజా రవివర్మ. ఘనత వహించిన ట్రావెన్కోర్ రాచవంశానికి చెందిన రాజా రవివర్మ తొలి గురువు మన తెలుగు కళాకారుడే. ఆయన పేరు రామస్వామి నాయుడు. రాజా రవివర్మకు కళా ప్రస్థానంలో పెద్దల ప్రోత్సాహం దొరికింది. మెలకువలు నేర్పే గురువులు దొరికారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం సహా పలువురు సంస్థానాధీశుల నుంచి సన్మాన సత్కారాలూ దక్కాయి. నిజ జీవితంలోనే కాదు, చిత్రకళా రంగంలోనూ రాజా రవివర్మ ఒక రారాజు. వెండితెర వెలుగులను తలదన్నే విపణి రాజు పేద కథలు అన్ని రంగాల్లోనూ ఉంటాయి. ఈ కథలెలా ఉన్నా, వెండితెర వెలుగులను తలదన్నే విపణి చిత్రకళా రంగానిది. సినీరంగంతో పోలిస్తే చిత్రకళా రంగానికి ఉన్న మార్కెట్ చాలా ఎక్కువ. ఇటీవలి లెక్కలనే తీసుకుంటే 2016 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్ మార్కెట్ వార్షిక టర్నోవర్ 4500 కోట్ల డాలర్లు (రూ.2.92 లక్షల కోట్లు). ఈ లెక్కలను ద యూరోపియన్ ఫైనార్ట్ ఫెయిర్ (టీఈఎఫ్ఏఎఫ్) వెల్లడించింది. ఇక అదే ఏడాది నాటికి ప్రపంచ సినీ పరిశ్రమ మార్కెట్ వార్షిక టర్నోవర్ 3860 కోట్ల డాలర్లు (రూ.2.50 లక్షల కోట్లు) మాత్రమేనని మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. ఆర్ట్ మార్కెట్లో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఆ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ట్ మార్కెట్ టర్నోవర్ సినీ పరిశ్రమ టర్నోవర్‌ను మించి ఉంటే, భారత్‌లో మాత్రం సినీ పరిశ్రమదే అగ్రస్థానం. భారత సినీ పరిశ్రమ వార్షిక టర్నోవర్ 2016 నాటికి రూ.13,800 కోట్లు అయితే, ఆర్ట్ మార్కెట్ టర్నోవర్ రూ.1460 కోట్లు మాత్రమే. కళపై అధ్యయనం చేసేవారు, కళను ప్రోత్సహించేవారు మన దేశంలో తక్కువగా ఉండటమే ఈ పరిస్థితికి కారణం. అలాగే కళను కెరీర్‌గా ఎంచుకున్నా, ఈ రంగంలో నిలదొక్కుకోవడం వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం కావడంతో చాలామంది కళాకారులు ఉపాధి కోసం ఇతరేతర వృత్తి ఉద్యోగాల్లో ఉంటూ అమెచ్యూర్ ఆర్టిస్టులుగానే మిగిలి పోతున్నారు. కళ కూడా వ్యాపారమే కళ కూడా వ్యాపారమే. కళతో ఏమాత్రం సంబంధం లేని దళారులు, కళపై పెద్ద పరిజ్ఞానం లేని వ్యాపారులు కళాఖండాల మీద పెట్టుబడులు పెడుతుంటారు. పాతసామాన్లు అమ్మే దుకాణాలు మొదలుకొని బడా బడా వేలంశాలల నుంచి కళాఖండాలు కొనుగోలు చేస్తుంటారు. వాటి ధరకు రెక్కలు రాగానే అమ్మేసి, లాభాలు సంపాదిస్తారు. స్టాక్ మార్కెట్లో నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉంటాయేమో గాని, ఆర్ట్ మార్కెట్లో నష్టాలు వాటిల్లే అవకాశాలు దాదాపు ఉండవు. గుడ్డిగా నకిలీ కళాఖండాలు కొని మోసపోయిన వారు కొద్దిమంది అక్కడక్కడా ఉండొచ్చు గాని, ఆర్ట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు నష్టపోయే సందర్భాలు చాలా అరుదు. ఆర్ట్ మార్కెట్లో అదృష్టం కలిసొస్తే వచ్చే లాభాలు ఎలా ఉంటాయో ఒక చిన్న ఉదాహరణ. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆడమ్స్టౌన్ చిన్న పట్టణం. ఫిలడెల్ఫియాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు ఒకరు ఆడమ్స్టౌన్లో పని ఉండి వచ్చాడు. అక్కడ పాతసామాన్లు అమ్మే ఒక దుకాణంలో కనిపించిన పెయింటింగ్ ఫ్రేమ్ అతడిని ఆకట్టుకుంది. దానిని అతడు కేవలం 4 డాలర్లకు (రూ.260) కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి గోడకు తగిలించబోయే ముందు కాన్వాస్‌పై చిన్న చిరుగు గమనించాడు. దాని కోసం పెయింటింగ్‌ను ఇటూ అటూ తిప్పి చూస్తున్నప్పుడు బలహీనంగా ఉన్న ఫ్రేమ్ ఊడొచ్చేసింది. ఫ్రేమ్‌కు, కాన్వాస్‌కు మధ్య భద్రపరచి ఉంచిన పాత కాగితం ఒకటి బయటపడింది. అది అమెరికా వ్యవస్థాపకులు 1776లో రూపొందించిన ‘డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్’ తొలి ప్రతుల్లో ఒకటి.. అధికారికంగా దానిని 500 ప్రతులు మాత్రమే ముద్రించారు. ఆ ప్రతిని అమ్మితే 24 లక్షల డాలర్లు (రూ.15.60 కోట్లు) వచ్చాయి. ఇలాంటిదే ఇంకో ఉదంతం. బ్రిటన్‌లో ఒక మతబోధకుడు పాతసామాన్ల దుకాణంలో కంటికి నదరుగా కనిపించిన పెయింటింగ్‌ను 400 పౌండ్లకు (సుమారు రూ.36,500) కొన్నాడు. ఆ పెయింటింగ్ వేసినది 17వ శతాబ్ది నాటి మేటి చిత్రకారుల్లో ఒకరైన సర్ ఆంథోనీ వాన్ డీక్. మతబోధకుడి వద్ద ఉన్న ఆ పెయింటింగ్‌ను ఒక కళాభిమాని 4 లక్షల పౌండ్లు (రూ.3.65 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో మరే వ్యాపారంలోనైనా ఈ స్థాయిలో లాభాలు వస్తాయంటారా? అనాది కళ ‘ఆదియందు అక్షరమున్నది’ అని బైబిల్ ఉవాచ. చిత్రకళ అక్షరానికంటే ముందే ఉనికిలో ఉండేది. చాలాచోట్ల ఆదిమానవులు నివసించిన గుహలలో వారు తీర్చిదిద్దిన చిత్రాలు బయటపడ్డాయి. వాటిపై పరిశోధనలు సాగించిన చరిత్రకారులు అవి క్రీస్తుపూర్వం 25000 ఏళ్ల నాటి చరిత్రపూర్వ యుగానికి చెందినవని తేల్చారు. అంతేకాదు, వాటిని తీర్చిదిద్దిన కళాకారుల్లో దాదాపు డెబ్బయి శాతం మంది మహిళలేనని వేలిముద్రల ఆనవాళ్ల ఆధారంగా నిగ్గుతేల్చారు. లోహయుగం మొదలైన తర్వాత అప్పటి మనుషులు శిల్పకళలో కూడా తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవడం ప్రారంభించారు. ఇంగ్లాండ్‌లోని శిలాతోరణం, ఈజిప్టులోని పిరమిడ్లు పురాతన మానవుల శిల్పకళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. క్రమంగా నాగరికతలు వెలిశాక శిల్పకళ మరింతగా మెరుగులు దిద్దుకుంది. మన దేశంలోని పురాతన ఆలయాలతో పాటు వివిధ నాగరికతలు విలసిల్లిన ప్రాంతాల్లోని పురాతన కట్టడాలు అప్పటి కళాకారుల శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా నేటికీ నిలిచి ఉన్నాయి. అద్భుతమైన నైపుణ్యంతో నాటి కళాకారులు తీర్చిదిద్దిన పురాతన శిల్పాలు ఇప్పటికీ మ్యూజియంలలో దర్శనమిస్తాయి. వాటిని తీర్చిదిద్దిన కళాకారులెవరో, వారి పేర్లేమిటో ఎవరికీ తెలియదు. వారంతా అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయారు. అప్పటికి కళపై కాసుల ప్రభావం ఉండేది కాదు. కళాకారులకు ప్రచార సాధనాల ఆసరా ఉండేది కాదు. గ్యాలరీలు, మ్యూజియంలు చాలామంది కళాకారులే కాదు, చాలా కళాఖండాలు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల, మరికొన్ని మనుషుల మూర్ఖత్వం వల్ల. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినప్పుడల్లా సైనికుల దాష్టీకాలకు ఎన్నో విలువైన కళాఖండాలు నాశనమయ్యాయి. మరెన్నో దోపిడీకి గురయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ సైనికులు చాలా చోట్ల కళాఖండాలను కొల్లగొట్టారు. మన సమకాలీన చరిత్రనే తీసుకుంటే అఫ్ఘానిస్తాన్‌లో బొమియాన్ బుద్ధ విగ్రహాలను తాలిబన్లు ధ్వంసం చేసి పారేశారు. తాలిబన్లు బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన అన్వేషణలో బుద్ధుని జీవిత ఘట్టాలతో కూడిన వెయ్యేళ్ల నాటి తైలవర్ణ చిత్రాలు బయటపడ్డాయి. ప్రపంచంలోనే ఇవి అత్యంత పురాతనమైన ఆయిల్ పెయింటింగ్స్. విలువైన కళాఖండాలను భావి తరాల కోసం పదిలపరచే ఉద్దేశంతో ఆధునిక యుగారంభంలో మ్యూజియంలు పుట్టుకొచ్చాయి. వివిధ మాధ్యమాల్లో చిత్రించిన విలువైన చిత్రాలు, శిల్పాలు వంటి కళాఖండాలను భద్రపరచిన మ్యూజియంలు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెలిశాయి. సమకాలీన కళాకారులు తమ కళాఖండాలను ప్రదర్శించుకోవడానికి, విక్రయించుకోవడానికి వీలుగా గ్యాలరీలు వెలిశాయి. వీటికి తోడు అత్యంత అమూల్యమైన కళాఖండాల విక్రయాల కోసం వేలంశాలలు కూడా ఉన్నాయి. మ్యూజియంలు, గ్యాలరీలతో పోలిస్తే వేలంశాలల సంఖ్య చాలా తక్కువ. ఇలాంటి వేలంశాలల్లో క్రిస్టీస్, సోత్బీ వేలంశాలలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. సెలిబ్రిటీలు, లెజెండ్లు ప్రపంచంలో రాచరిక వ్యవస్థ మొదలైన తర్వాత కళాకారులకు రాజాశ్రయం లభించేది. రాజుల అండతో కళాకారులు అద్భుతమైన కళాఖండాలను సృష్టించారు. రాజాశ్రయం పొందిన కళాకారులు సైతం చాలా శతాబ్దాల పాటు అనామకంగానే మిగిలిపోయారు. కళారంగంలో తొలిసారిగా సెలిబ్రిటీ స్థాయిని ఆస్వాదించిన కళాకారుడు జాట్టో డి బండోనె. పదమూడో శతాబ్దికి చెందిన జాట్టో ఫ్లారెన్స్ రాజ్యంలో ఒక వెలుగు వెలిగాడు. చిత్రకారుడిగా, వాస్తుశిల్పిగా జాట్టో సృష్టించిన కళాఖండాలు అతడికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. జాట్టో తర్వాతే యూరోప్‌లోని మిగిలిన కళాకారులకు కూడా క్రమంగా సెలిబ్రిటీ స్థాయి లభించసాగింది. అయితే, పదిహేనో శతాబ్దికి చెందిన ఇటాలియన్ కళాకారుడు లియొనార్డో దవించిని తొలి లెజెండ్‌గా చెప్పుకోవచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దవించి వేసిన చిత్రాల్లో పదిహేను మాత్రమే మిగిలి ఉన్నాయి. దవించి సమకాలికులైన మైకేల్ ఏంజిలో, రాఫెల్‌లతో పాటు ఆ తర్వాతి కాలాలకు చెందిన విన్సెంట్ వాంగో, రెంబ్రాంట్, పికాసో వంటి వాళ్లను కళారంగంలో లెజెండ్స్‌గా చెప్పుకోవచ్చు. వివిధ కాలాల్లో వివిధ శైలుల్లో వీరు చిత్రించిన చిత్రాలు, మలచిన శిల్పాలు కళా రంగాన్ని సుసంపన్నం చేశాయి. భారతీయ కళాకారుల్లోనైతే, రాజా రవివర్మ, ఎం.ఎఫ్.హుస్సేన్, తయ్యబ్ మెహతా, ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా, ఎస్.హెచ్.రజా, అమృతా షేర్గిల్, జామిని రాయ్, అబనీంద్రనాథ్ టాగోర్, నందలాల్ బోస్, చిత్తప్రసాద్, సతీష్ గుజ్రాల్, జతిన్ దాస్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందారు. మన తెలుగు కళాకారుల్లో దామెర్ల రామారావు, అడవి బాపిరాజు, కొండపల్లి శేషగిరిరావు, పి.టి.రెడ్డి, వడ్డాది పాపయ్య, ఎస్వీ రామారావు తదితరులు విశేషంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. కుంచె పట్టిన ప్రముఖులు చిత్రకారులుగా ప్రఖ్యాతులైన వారు సరే, ఇతరేతర రంగాల్లో ప్రముఖులుగా గుర్తింపు పొందిన వారిలోనూ కొందరు కుంచె పట్టిన దాఖలాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. సాహితీవేత్తగా నోబెల్ బహుమతి అందుకున్న కవీంద్రుడు రవీంద్రనాథ్ టాగోర్ చిత్రకళలోనూ తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ రాజకీయాల్లో, పాలనా వ్యవహారాల నుంచి ఏమాత్రం తీరిక చిక్కినా కుంచెకు పనిచెప్పేవారు. ఒక పెయింటింగ్ వేస్తుండగానే గుండెపోటు వచ్చి ఆయన తుదిశ్వాస విడిచారు. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో జిమ్మీ కార్టర్, జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా చిత్రకారులే. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జార్జ్ డబ్ల్యూ బుష్ 2014లో తన చిత్రాలతో ప్రదర్శనను కూడా నిర్వహించారు. బ్రిటిష్ ప్రధానిగా చరిత్ర ప్రసిద్ధుడైన విన్స్టన్ చర్చిల్ తీరిక వేళల్లో మంచి లాండ్స్కేప్ చిత్రాలు చిత్రించేవారు. బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కూడా మంచి చిత్రకారుడు. జర్మన్ నియంత హిట్లర్, స్పానిష్ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో కూడా చిత్రకారులే. హాలీవుడ్లో తారగా వెలుగొందిన మార్లిన్ మన్రో చక్కని చిత్రాలు చిత్రించేది. అప్పటి అమెరికన్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీకి పుట్టిన రోజు కానుకగా ఆమె పంపిన ఎర్రగులాబీ పెయింటింగ్‌కు 2005లో జరిగిన వేలంలో 78 వేల డాలర్లు (రూ.50.66 లక్షలు) ధర పలికింది. హాలీవుడ్ నటుడు, రాక్ ఎన్ రోల్ స్టార్ జేమ్స్ డీన్ చేయి తిరిగిన చిత్రకారుడు మాత్రమే కాదు, గొప్ప శిల్పి కూడా. జేమ్స్ డీన్ బయోపిక్‌లో నటించిన జేమ్స్ ఫ్రాంకో కూడా చిత్రకారుడే కావడం విశేషం. హాలీవుడ్ నటుడు, గాయకుడు ఫ్రాంక్ సినత్రా చక్కని పెయింటింగ్స్ వేసేవాడు. హాలీవుడ్ కండల వీరుడు సిల్వస్టర్ స్టాలిన్ చిత్రకళలో చేయి తిరిగినవాడే. హాలీవుడ్ నటి లూసీ లియు ‘యు లింగ్’ అనే కుంచెపేరుతో చిత్రించిన తన పెయింటింగ్స్‌తో వీలు చిక్కినప్పుడల్లా ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తోంది. పెయింటింగ్స్ మీద వచ్చిన ఆదాయాన్ని ఆమె ‘యూనిసెఫ్’కు విరాళంగా ఇస్తోంది. హాలీవుడ్ ప్రముఖుల్లో ఇలాంటి చిత్రకారులు ఇంకా చాలామందే ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖుల్లో శ్రీదేవి, సల్మాన్ ఖాన్లకు చిత్రకళలో మంచి నైపుణ్యం ఉంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరిక వేళల్లో పెయింటింగ్స్ వేస్తుంటారు. – పన్యాల జగన్నాథదాసు -
వేమయ్యా.. వస్తావయ్యా..!
కడప కార్పొరేషన్ : సంక్రాంతి పండుగ వస్తుందంటే పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, తలపాగా చుట్టి, నుదుట ఎర్రటి బొట్టుతో గుర్రాలపై వచ్చే వేమయ్యలు, గంగిరెద్దులవారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు... వడ్లు, బియ్యం, బట్టలు ఇచ్చి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటే మంచి జరుగుతుందని పెద్దలు భావిస్తారు. పూర్వం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. ఇటీవలి కాలంలో వేమయ్యల రాక తగ్గిపోయింది. గంగిరెద్దులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయంతే. ఈ ఆధునిక యుగంలో కూడా కొన్ని కుటుంబాలు అదే వృత్తిగా జీవిస్తున్నాయి. నాలుగైదు రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తున్న తరుణంలో కడపలో ఆర్టీసీ బస్టాండు వద్ద వేమయ్యలు సందడి చేశారు. కదిరికి చెందిన వీరయ్య, రామయ్య వేమయ్యల వేషధారణలో గ్రామాలు తిరుగుతూ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఆ చిత్రాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
జీవిత చరమాంకంలో సర్ప్రైజ్ గిఫ్ట్..
వారసత్వంగా వచ్చిన గుర్రాల పెంపకం అంటే యూకేలోని బ్రాంటన్కు చెందిన పాట్రిక్ సాండర్స్(87)కి ఎంతో మక్కువ. తన జీవన విధానంలోనే గుర్రాలు కూడా ఓ భాగంగా మారాయి. ఎన్నో ఏళ్లుగా గుర్రాల స్వారీని ఎంతో మందికి నేర్పించాడు. అయితే జీవిత చరమాంకంలో ‘నార్త్ దేవాన్ హాస్పయిస్ కేర్’ (మరణానికి అంచున ఉన్న రోగులను అక్కున చేర్చుకుని సేవలందించే సంస్థ)లో చేరాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ నర్సులతో ఎప్పుడూ గుర్రాల గురించే మాట్లాడేవాడు. దీంతో అక్కడి సిబ్బంది పాట్రిక్కి అతని చివరి రోజుల్లో మరచిపోలేని సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. ఓ గుర్రపు శాల నుంచి విక్టర్ అనే గుర్రాన్ని పాట్రిక్ వద్దకు తెచ్చారు. గుర్రాన్ని తీసుకువచ్చిన రోజు పాట్రిక్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, బెడ్‌పై నుంచి కూడా అడుగు కింద పెట్టలేక పోయాడు. దీంతో అక్కడి స్టాఫ్ ఎలాగైనా పాట్రిక్కి చివరి రోజుల్లో అతని కోరిక నెరవేర్చాలని ఏకంగా బెడ్నే బయటకు తీసుకు వచ్చారు. ‘రోగుల జీవితాన్ని అయితే పెంచలేము.. కానీ జీవితంలో మిగిలిన రోజులను ఆనందంతో నింపడానికి మా వంతు ప్రయత్నిస్తాము’ అని కేర్‌లో పనిచేస్తున్న నర్స్ కాథీ వతిహామ్ చెప్పారు. పాట్రిక్ బెడ్పైనుంచే గుర్రాన్ని చూసి పట్టలేని సంతోషంతో తన చేతులతోనే వాటికి ఆహారాన్ని తినిపించాడు. ఇది జరిగిన మూడు రోజులకే పాట్రిక్ మృతి చెందాడు. ‘నాన్న చివరి రోజుల్లో గుర్రానికి ఆహారం పెట్టడం నేను ఎన్నటికీ మరిచిపోను’ అంటూ పాట్రిక్ కూతురు జేన్ సంతోషం వ్యక్తం చేశారు. -
ఖాకీ సైన్యంలో అశ్వికా దళం
-
హైదరాబాద్ టెకీల నిరసన
హైదరాబాద్: నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌కు వెళ్లే రోడ్డును తవ్వడానికి జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని మహానగర టెకీలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు తవ్వకానికి వ్యతిరేకంగా టెకీలు ఆన్లైన్లో క్యాంపైన్ కూడా నిర్వహించారు. క్యాంపైన్‌కు మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. కార్యాలయాలకు వాహనాలకు బదులు గుర్రాలపై వెళ్తూ వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రస్తుతం ఉన్న తారు రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలోపు ప్రస్తుతం ఉన్న తారు రోడ్డుకు ఎలాంటి ఢోకా ఉండబోదని కొందరు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు రోడ్డును తవ్వాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. రోడ్డు తవ్వకం వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో పనిచేసే ఉద్యోగులకు ప్రయాణ సమయం రెండు నుంచి మూడు గంటల పాటు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో గుంతలో నిండిన రోడ్లు చాలానే ఉన్నాయని ముందు వాటిని సరిచేయాలని వ్యాఖ్యానిస్తున్నారు. -
దీని ధర కోటి రూపాయలు మాత్రమే!!
విలాసవంతమైన జీవితం అనుభవించేవారు అంతకంటే అందమైన, లగ్జరీ కారు కావాలని కోరుకుంటారు. లక్షల ఖరీదు చేసే ఏ ఆడినో, ఏ బిఎండబ్ల్యూ కారునో సొంతం చేసుకోవాలనుకుంటారు కదా...కానీ ఓ వ్యాపార వేత్త ఓ అరుదైన అశ్వరాజు మీద మోజు పడ్డాడు. రాజస్థాన్‌కు చెందిన నారాయణ్ సిన్హా ప్రభాత్ అనే గుర్రాన్ని కొనుకున్నాడు. దాని ఖరీదు ఎంతో తెలిస్తే మనం నోరెళ్ల బెట్టాల్సిందే. కోటి పదకొండు లక్షలు వెచ్చించి మరీ ఆ గుర్రాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు అంతకంటే విలాసవంతమైన మరెన్నో సౌకర్యాలు కల్పించాడు. అతి ఖరీదైన కారు ఎస్ యూవీ గ్రాండ్ చిరోకి సుమారు 94 లక్షల కంటే, ఎక్కువ ధర పలికింది ఈ ప్రభాత్. అన్నట్టు మహారాణా ప్రతాప్ ఉపయోగించిన అశ్వం చేతక్ కూడా మార్వారి జాతిదేనట. రాజస్థాన్‌లో ప్రాపర్టీ అండ్ మైనింగ్ వ్యాపారం చేసే నారాయణ్ సిన్హా ప్రఖ్యాత మార్వాడి జాతి కి చెందిన ప్రభాత్ ను (మగ గుర్రం) భవార్సిన్హ్ రాథోడ్ నుంచి ఒక కోటి 11 లక్షల రూపాయలకు కోనుగోలు చేశాడు. అంతటితో ఆయన ముచ్చట తీరలేదు. దాన్ని చూసుకునేందుకు ముగ్గురు ఉద్యోగులు. వైద్య సేవలు అందించడానికి ఓ డాక్టర్. స్నానం చేయడానికి ప్రత్యేక స్విమ్మింగ్ పూల్. ఇలాంటి ఖరీదైన సౌకర్యాలతో పాటు, ప్రత్యేక ఆహారం నియమావళి ఏర్పాటు చేశాడు. మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్, పాలు, దేశీ నెయ్యి నుండి మొదలుకొని ఆహార పదార్థాలన్నీ ప్రత్యేక మైనవే. దీంతోపాటూ ఖరీదైన షాంపూలతో స్నానం, మసాజ్ తప్పనిసరి. ఇంతటి విశేషమైన గుర్రానికి శిక్షణ ఇస్తోంది మాత్రం ఫ్రాన్స్ చెందిన ఓ మహిళ. ప్రభాత్ అంటే తనకు చాలా ఇష్టంమనీ, అది కేవలంగుర్రం మాత్రమే కాదు తనకు మంచి స్నేహితుడని నారాయణ సిన్హా చెప్పారు. తన గుండె లో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు మార్వారిజాతి గుర్రాలు చాలా తెలివైనవనీ, మంచి బలిష్టంగా, సామర్థ్యంతో ఉంటాయని గుర్రం నిపుణుడు డాక్టర్ అజిత్ రావు తెలిపారు. జైపూర్ చెందిన కన్హయ్య,జోధ్‌పూర్ గాంగౌర్ కు పుట్టిన ప్రభాత్ ఎన్నో ప్రదర్శనలలో విలువైన బహుమతులు గెల్చుకుందని ఆయన తెలిపారు. -
గుర్రాలపై గంజాయి తరలింపు
► రూ.10 లక్షల సరుకు స్వాధీనం ► నలుగురి అరెస్ట్ కొత్తకోట(రావికమతం): కొత్తకోట పోలీసులు దాడిచేసి రూ.పది లక్షల విలువైన గంజాయి, మూడు గుర్రాలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్ చేశారు. కొత్తకోట ఎస్ఐ శిరీష్‌కుమార్ కథన ం మేరకు కళ్యాణపులోవ అటవీ ప్రాంతం మీదుగా గుర్రాలపై గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ట్రైనీ ఎస్ఐ సురేష్ సిబ్బందితో మాటు వేసి, గంజాయిని తరలిస్తున్నవారిపై దాడిచేశారు. ఈ దాడిలో టి.అర్జాపురం గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి పడాల రమణ, అదే గ్రామానికి చెందిన మర్రా రాజిబాబు, జెడ్.బెన్నవరానికి చెందిన యాదగిరి మారయ్య, చింతపల్లి మండలం మలసాలబందకు చెందిన వంతల అప్పారావు అనే కూలీలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 వేల నగదు, 130 కిలోల గంజాయి, మూడు గుర్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
కోళ్ల పందెం కాదు.. గుర్రాల పందెం!
బీజింగ్: సంక్రాంతి వచ్చిందంటే మన దగ్గర కోడి పందాలు సందడి చేస్తాయి. కోడిపుంజులు ఒక దానితో ఒకటి తలపడుతుంటే ఏది నెగ్గుతుందా అని చిన్నాపెద్దా అంతా చేరి ఆ పోరును ఆసక్తిగా చూస్తారు. చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కూడా ఇలాంటి పోటీలే నిర్వహిస్తారు. అయితే వారు మాత్రం ఆ పందేలను గుర్రాలతో నిర్వహిస్తారు. గుర్రపు పందెం అంటే గుర్రాల మధ్య రన్నింగ్ రేస్ అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే. అచ్చం కోడిపుంజుల మాదిరిగానే రెండు గుర్రాలు పోట్లాడుకుంటాయి. కోడి పుంజులు ఒక దానికి ఒకటి ఎదురుపడగానే పోట్లాడుకుంటూనే ఉంటాయి. మరి గుర్రాలు ఎందుకు అలా పోట్లాడుకుంటాయి అనుమానం వస్తుంది కదూ. దీనికోసం ఓ టెక్నిక్ వాడుతారు. ఓ ఆడగుర్రాన్ని ముందుగా రింగ్‌లోకి వదిలిన తర్వాత.. రెండు మగ గుర్రాలను వదులుతారు. ఆ ఆడగుర్రాన్ని ఇంప్రెస్ చేయడానికి రెండు మగగుర్రాలు కోడిపుంజుల మాదిరిగా పోట్లాడుకుంటాయి. మగ గుర్రాలను ఉత్సాహపరుస్తూ ఆడగుర్రం రింగ్ చుట్టూ తిరగుతుంది. పోటీలను చూసేవారు గుర్రాలపై జోరుగా బెట్టింగ్ లు నిర్వహిస్తారు. దక్షిణ చైనాలోని మియావో ప్రాంతంలో 500 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని పెద్ద ఉత్సవంలా నిర్వహిస్తున్నారు. దీనిపై జంతుప్రేమికుల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నా నిర్వాహకులు మాత్రం తమ పూర్వీకుల సాంప్రదాయాన్ని కొనసాగిస్తామంటున్నారు. -
గుర్రాలకు మనుషుల ఎమోషన్స్ తెలుసు
న్యూయార్క్: గుర్రాలకు కూడా మనుషుల హావభావాలను గుర్తించే సామర్థ్యం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మనుషుల్లోని ఆనందం, కోపాన్ని అవి పసిగట్టగలవని, అందుకు అనుకూలంగా ప్రవర్తించగలవని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ తెలిపింది. కోపంతో ఉన్న మనుషులను చూస్తే అవి ప్రతికూలంగా స్పందిస్తాయని కూడా అధ్యయనకారులు తెలిపారు. దాదాపు 28 దేశీయ గుర్రాలను తమ పరిశోధనకోసం తీసుకున్న అధ్యయనకారులు తమ చేతుల్లో కోపం, సంతోషంతో ఉన్న వ్యక్తుల ఫొటోలను పట్టుకొని వాటికి చూపించారు. వాటిని ఆ గుర్రాలు ఎడమ కంటితో చూడటం మొదలుపెట్టాయి. ఎడమ కన్ను అనేది జంతువుల్లో కుడి పక్కన ఉన్న మెదడు నియంత్రణ ద్వారా పనిచేస్తుంది. అయితే, నెగటివ్ షేడ్స్‌ను దానిలో ప్రతిబింబింప చేయడంలో కీలక పాత్ర పోషించేది కూడా కుడి మెదడే కావడం విశేషం. ఈ నేపథ్యంలో కోపంతో ఉన్న మనుషులను గుర్రాలు గుర్తించి వారి విషయంలో నెగిటివ్‌గా స్పందిస్తాయని ఈ ఫొటోల ఆధారంగా అధ్యయనకారులు అంచనా వేశారు. ఇది ఏ జంతువులకు లేకుండా ఒక్క గుర్రానికి మాత్రమే ఉన్న అదనపు సామర్థ్యం అని కూడా వారు తెలిపారు. -
అశ్వాలకు అరటిపళ్లే ఇష్టం
పరిపరి శోధన మానవమాత్రుల ఇష్టాయిష్టాల గురించి శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. అయితే, మూగజీవాల అభి‘రుచు’లపై పెద్దగా శ్రద్ధపెట్టలేదు. ఆ లోటును తీరుద్దామనుకున్నారో ఏమో! ఇంగ్లాండ్‌కు చెందిన డెబోరా గుడ్విన్ అనే శాస్త్రవేత్త అశ్వరాజాల అభి‘రుచు’లపై శ్రద్ధగా పరిశోధన సాగించాడు. ఈ పరిశోధనలో అతగాడు చాలా కొత్త సంగతులనే కనిపెట్టాడు. అశ్వాలకు క్యారట్ల కంటే అరటిపళ్లే ఎక్కువ ఇష్టమని లోకానికి వెల్లడించాడు. అంతేకాదు, అశ్వరాజాలు ఇష్టపడే ఆహార పరిమళాలు వరుసగా మెంతులు, అరటిపళ్లు, చెర్రీలు, దనియాలు, క్యారట్లు, పిప్పరమింట్ వాసనలేనని నిగ్గు తేల్చాడు. ఇంతకీ ఈ పరిశోధన వల్ల ఉపయోగం ఏముందని అనుకుంటున్నారా? గుడ్విన్ దొరవారు ఫలశ్రుతిని కూడా సెలవిచ్చారు. గుర్రాల కోసం ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేసే కంపెనీలు తన పరిశోధనను దృష్టిలో ఉంచుకుని, అశ్వరాజాలు ఇష్టపడే పరిమళాలతో ఉత్పత్తులను రూపొందిస్తే లాభపడగలవని ఢంకా బజాయించి చెబుతున్నాడు. -
గుర్రాల జ్ఞాపకశక్తి గొప్పదా?
జంతు ప్రపంచం ప్రపంచంలో దాదాపు 160 జాతుల గుర్రాలు ఉన్నాయి. అన్నింట్లోకీ అరేబియన్ గుర్రాన్ని ఉత్తమ జాతిగా పేర్కొంటారు! ఐదేళ్ల వయసు వచ్చేవరకూ గుర్రాన్ని గుర్రం అనరు. మగది అయితే కాల్ట్ అని, ఆడది అయితే ఫిల్లీ అనీ అంటారు! భూమ్మీద నివసించే జీవులన్నింటిలోకీ గుర్రం కళ్లే పెద్దగా ఉంటాయి. వీటి నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దానివల్ల ఒకేసారి రెండు కళ్లతో రెండు దృశ్యాలను చూడగలవు ఇవి. అంతేకాదు... చిక్కని చీకటిలో సైతం కొన్నిమైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా స్పష్టంగా గుర్తించగలిగే శక్తి వీటి కళ్లకు ఉంది! వీటి చెవులు కదులుతూ ఉంటాయి. గుండ్రంగా తిరుగుతాయి కూడా. ఆ కదలికను బట్టి వీటి దృష్టి దేనిమీద ఉందో చెప్పేయవచ్చు. ఎందుకంటే... కన్ను ఎటువైపు చూస్తోందో, చెవి కూడా అటువైపే తిరుగుతుంది! వీటి ఎత్తును ‘హ్యాండ్స్’లో కొలుస్తారు. ఒక హ్యాండ్ నాలుగు అంగుళాలతో సమానం! మగ గుర్రాలకు 40 నుంచి 44 దంతాలు ఉంటే... ఆడగుర్రాలకు 36 ఉంటాయి. ఈ దంతాలను బట్టే వీటి వయసును లెక్కిస్తారు. అయితే అది కూడా తొమ్మిదేళ్లు నిండేవరకే. ఆ తర్వాత వీటి వయసును దంతాల ద్వారా కనుక్కోవడం కష్టమంటారు జీవశాస్త్రవేత్తలు! ఇవి రోజుకు కేవలం గంటనుంచి మూడు గంటల సేపు నిద్రపోతాయి. అయితే ఇంతసేపూ పడుకోవు. కాసేపు నిలబడి కూడా నిద్రపోతుంటాయి! దాదాపు జీవులన్నీ కూడా శ్వాసనాళాల్లో సమస్య ఉంటే నోటితో శ్వాసను తీసుకుంటూ ఉంటాయి. కానీ గుర్రాలు అలా చేయలేవు. అంతేకాదు... ఇవి త్రేన్చలేవు. వాంతి చేసుకోలేవు! తెల్లగుర్రాలను చూసి భలే ఉన్నాయే అనుకుంటాం మనం. అయితే నిజానికి ఇవి పుట్టినప్పుడు తెల్లగా ఉండవు. గ్రే కలర్లో ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ తెల్లగా మారతాయి! వీటి జ్ఞాపకశక్తి అత్యద్భుతమైనదని పరిశోధనలు తేల్చాయి. ఒక్కసారి మనం ప్రేమగా సాకితే, గుర్రాలు మనలను జీవితంలో మర్చిపోవట. పైగా ఎంతమందిలో ఉన్నా కూడా మనల్ని గుర్తు పట్టేస్తాయట. అలాగే స్థలాలు కూడా. కొంతకాలం వీటిని ఓ ప్రదేశంలో తిప్పి, తర్వాత దూరంగా తీసుకెళ్లి వదిలేస్తే... ఇవి తిరిగి పాత ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోగలవట! -
పెళ్లి ముస్తాబుతో దర్పంగా నడుస్తున్న ‘గుర్రాలు’
గోల్కొండ కోట దర్వాజాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆ వీధి రెండు వైపులా ప్రజలు నిలబడి పెళ్లి ఊరేగింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో బారాత్ వచ్చేసింది... అందమైన అలంకారం.. ముత్యాల హారాలు.. ఖరీదైన వస్త్రాలు.. పెళ్లి ముస్తాబుతో దర్పంగా నడుస్తున్న ‘గుర్రాలు’! ఇది 1592 సమయంలో మాట. అప్పట్లో. 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గోల్కొండ పట్టణం 30 వేల జనాభాతో కిటకిటలాడుతుండేది. కానీ మనుషుల కంటే గుర్రాల సంఖ్యే అధికం. రాచఠీవీకి దర్పంగా నిలిచే గుర్రాలను పెంచుకోవటం అప్పట్లో సర్వసాధారణం. గుర్రం లేని ఇళ్లంటే చిన్నచూపే. ఇక శుభకార్యాలు జరిగితే గుర్రాలను అందంగా తీర్చిదిద్దేవారు. వాటికి స్నానం చేయించి, ముత్యాలతో ఘనంగా అలంకరించేవారు. మామూలు గుర్రాల కంటే మధ్య ఆసియా ప్రాంతం నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న వాటిని పెంచుకోవటం ఓ గొప్ప గౌరవంగా భావించేవారు. అలాంటి మేలు జాతి గుర్రాలపై ఊరేగటమంటే పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ముఖ్యంగా పెళ్లికొడుకులను అలాంటి గుర్రాలపై మాత్రమే వేదిక వద్దకు తీసుకువచ్చేవారు. గోల్కొండ పరిధి విస్తరించి వెలుపల నగరం రూపుదిద్దుకున్న తర్వాత కూడా ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వచ్చింది. కుతుబ్‌షాహీల జమానా ముగిసి అసఫ్‌జాహీల హయాం మొదలైన తర్వాత ఈ సంప్రదాయం సాధారణ ఇళ్లకూ పాకింది. గుర్రాల సందడి లేకుండా శుభకార్యం జరిగేది కాదు. మేలు జాతి గుర్రం అప్పట్లో స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అలా మొదలైన సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా పెళ్లి వేడుకల్లో గుర్రాలను వినియోగిస్తున్నారు. బారాత్‌లో గుర్రం లేకుండా పెళ్లి కుమారుడి కుటుంబం ముందుకు సాగదు. తరతరాల వృత్తి... శతాబ్దాలు దొర్లిన తర్వాత కూడా గుర్రాల ప్రాధాన్యం కొనసాగుతూనే ఉంది. అయితే సొంతంగా ప్రతి ఇంటా గుర్రాల పెంపకం అంతరించినా... పెళ్లింట మాత్రం వాటి సందడి ఉండాలని కోరుకునే కుటుంబాలకు కొదవ లేదు. పెళ్లి రోజు మాత్రం గుర్రాలను తీసుకొచ్చి ఎదుర్కోళ్లు, ఊరేగింపు ఢనిర్వహిస్తున్నారు. ఇలాంటి అవసరాలను తీర్చేందుకు పాతనగరంలో కొన్ని కుటుంబాలు సిద్ధంగా ఉంటాయి. మేలు జాతి గుర్రాలు, అందమైన ్ఢబగ్గీలను వీరు సరఫరా చేస్తున్నారు. పురానాపూల్, జుమ్మేరాత్ బజార్లలో 30 వరకు ఇలాంటి కుటుంబాలున్నాయి. మూడునాలుగు తరాలుగా ఈ కుటుంబాలు గుర్రాల మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కుతుబ్‌షాహీల కాలంలో గుర్రాలను పెంచే వ్యాపకంలో ఉన్నవారు కాలక్రమంలో గుర్రాలు, బగ్గీలను అద్దెకిచ్చి అదే వృత్తిగా మలచుకున్నారు. క్యాబ్ అద్దెకు తీసుకుంటే కిలోమీటర్ల వారీగా వసూలు చేసిన త రహాలోనే గుర్రాలకు, బగ్గీలకూ ధర ఉంది. నగరంలోని 15 కి.మీ. పరిధిలో గుర్రపు బగ్గీలను తిప్పితే రూ.6 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎదుర్కోళ్లలో భాగంగా పెళ్లి కుమారుడిని వివాహవేదిక వద్దకు తీసుకురావటానికి గుర్రాన్ని పంపితే రూ.3 వేల వరకు వసూలు చేస్తారు. ఇక గుర్రాలకు తోడుగా అదనపు ఆకర్షణగా కొందరు ఒంటెలనూ బారాత్‌లలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం కొన్ని కుటుంబాలు ఒంటెలనూ పెంచుతున్నాయి. -
రేసు గుర్రం
రెక్కల గుర్రంపై యువరాజు.. ఒకప్పటి ఫిమేల్ ఫాంటసీ. యుద్ధాలలో గుర్రాలపై దూసుకొచ్చే వీరులు.. జానపద కథల్లో తరచూ తారసపడే పాత్రలు. కాలం మారడంతో గుర్రాల మీది యువరాజులు పోయి, జాకీలు వచ్చారు. గుర్రాలను రణరంగం బదులు రేసుకోర్సుల్లో పరుగులు తీయిస్తున్నారు. నవాబుల కాలం నాటి మలక్‌పేట మార్కెట్లో నుంచి తిన్నగా ఒకటిన్నర కిలోమీటరు దూరం వెళితే.. రాచరికపు ఆనవాళ్లు కనిపించడమే కాదు, గుర్రాల డెక్కల చప్పుడూ వినిపిస్తుంది. తేరిపార చూస్తే ‘హైదరాబాద్ రేస్‌కోర్స్’ అనే బోర్డుంటుంది. లోపలకు వెళ్లి చూస్తే.. పద్నాలుగు, పదిహేనేళ్ల కుర్రాళ్లు గుర్రాలకు సేవ చేస్తూ కనిపిస్తారు. బాలకార్మికులేమీ కాదు గానీ, వారే రేపటి జాకీలు. వారిని హార్స్ జాకీలుగా తీర్చిదిద్దే అప్రెంటిస్ జాకీ ట్రయినింగ్ స్కూల్ అది. హైదరాబాదీలదే హవా దేశంలో ప్రస్తుతం 250 మంది జాకీలు ఉన్నారు. వారిలో దాదాపు 50 మంది హైదరాబాదీలే. వారిలోనూ చాలామంది అప్రెంటిస్ జాకీ ట్రైనింగ్ స్కూల్ పూర్వవిద్యార్థులే. స్కూల్లో ఏం చేస్తారు..? ఉదయం 5.30 గంటల నుంచి శిక్షణ మొదలవుతుంది. గుర్రాలను శుభ్రం చేసి, దాణాపెట్టి.. దాని బాగోగులు చూసుకోవాలి. తర్వాత రేసింగ్ ప్రాక్టీస్, రేసింగ్ నిబంధనలపై తరగతులుంటాయి. తర్వాత మళ్లీ ప్రాక్టీస్. వారంలో ఆరురోజులు ఇదే షెడ్యూల్. వీటిపై రిటెన్, ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ప్రిన్సిపాల్ వీరేందర్ ఖాజా, వైస్ ప్రిన్సిపాల్ బజరంగ్ సింగ్‌లు స్కూలు వ్యవహారాలు చూసుకుంటారు. దేశంలో ఏకైక స్కూల్ హార్స్ జాకీల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన స్కూల్ మన దేశంలో ఇదొక్కటే. 1986లో ప్రారంభమైన ఈ స్కూల్ నుంచి వందలాది మంది జాకీలు తయారయ్యారు. విద్యార్థులకు భోజన, వసతులు ఉచితం. హైదరాబాద్ రేస్ క్లబ్ వాటన్నింటినీ చూసుకుంటుంది. ఈ స్కూల్లో మూడేళ్ల కోర్సుకు.. రాత, శరీర దారుఢ్య పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. మూడేళ్లకోసారి మాత్రమే ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇస్తారు. జాకీలే కీలకం పందెం రాయుళ్లే కాదు, ప్రేక్షకులు సైతం గుర్రాలపైనే దృష్టి పెడతారు. సంరక్షణ కోసం నెత్తిపై పెట్టుకున్న హెల్మెట్‌లో జాకీ ముఖం కవరైపోతుంది. గుర్రాన్ని నడిపించే జాకీని ఎవరూ గుర్తించరు. ఎంతో కష్టమైనా, అండర్రేటెడ్ జాబ్ హార్స్ జాకీలది. ఒకప్పుడు ఆదరణ తక్కువగా ఉన్నా, ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ యువతరం ముందుకొస్తుండటంతో హార్స్ జాకీయింగ్పై క్రేజ్ పెరుగుతోంది. రెండున్నర శతాబ్దాల చరిత్ర దేశంలో గుర్రపు పందాలకు రెండున్నర శతాబ్దాల చరిత్ర. ప్రస్తుతం భారత్‌లో అరడజను రేస్ టర్ఫ్లున్నాయి. ఏడాది పొడవునా ఏదో ఒక టర్ఫ్‌లో పందేలు జరుగుతూనే ఉంటాయి. జాకీకి గుర్రాన్ని ముందుకు ఉరికించడమే కాదు, దానిని అదుపుచేయడమూ తెలిసుండాలి. గుర్రం, జాకీల్లో ఏ ఒకరు తడబడినా పరిస్థితి తారుమారవుతుంది. ‘అశ్వహృదయం’ అర్థమైతే తప్ప జాకీలుగా రాణించలేరు. మనం పదేపదే మాట్లాడుతుంటే.. మన భాష, భావం గుర్రాలకు అర్థమవుతుందని చాలామంది జాకీలు నమ్ముతారు. రేసుల్లో కూడా వెయిట్ లిఫ్టింగ్ మాదిరిగానే జాకీల బరువునే కొలమానంగా పోటీలు నిర్వహిస్తారు. 40 నుంచి 70 కేజీల వరకు వివిధ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. జాకీలకు ప్రత్యేకంగా ఉద్యోగాలేవీ ఉండవు. పందేలలో గుర్రాలను పెట్టే యజమానులే జాకీలను హైర్ చేసుకుంటారు. గుర్రాన్ని బట్టి వారికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కాంట్రాక్టు ఉంటుంది. అంతేకాదు, గెలిచిన గుర్రానికి అందే ప్రైజ్ మనీలో ఏడున్నర శాతం జాకీకే చెందుతుంది. గెలిచిన రేసులను బట్టి జాకీలకు పాపులారిటీ పెరుగుతుంది. పీసీ చవాన్, శ్రీనాథ్, సూరజ్ నర్రెడులు మన దేశంలో ఫేమస్ జాకీలు. గుండెధైర్యం, ఏకాగ్రత, శారీరక దారుఢ్యం ఉంటే ఎవరైనా జాకీలుగా రాణించవచ్చు. గుర్రాల మధ్యే పెరిగా.. మాది బీహార్ అయినా, మా నాన్న ఇక్కడే పనిచేస్తారు. చిన్నప్పటి నుంచి గుర్రాల మధ్యే పెరగడంతో జాకీయింగ్పై ఆసక్తి పెరిగింది. పెద్ద జాకీగా ఎదిగి బాగా డబ్బు సంపాదించడమే నా లక్ష్యం. -రోహిత్ కుమార్, బీహార్ పీసీ చవాన్ ఆదర్శం మాది ఊటీ. సమ్మర్ రేసులన్నీ ఊటీ రేస్ కోర్సులో జరుగుతాయి. రేసులు చూసి ఆసక్తి పెరిగింది. మొదట్లో ఎత్తయిన గుర్రాలను చూసి కాస్త భయమేసినా, తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటే చాలని అర్థమైంది. జాకీ పీసీ చవాన్ నాకు ఆదర్శం. ఎప్పటికైనా ఆయనలా టాప్ రేంజ్‌కి ఎదగాలన్నదే నా కోరిక. - రాహుల్ హుటి, ఊటీ టాప్ జాకీ కావడమే లక్ష్యం నాకు తల్లిదండ్రులు లేరు. మా అంకుల్ వద్ద పెరిగాను. ముంబై రేస్ కోర్స్ దగ్గర ఉండేవాళ్లం. రోజూ రేసులు చూసి చూసి ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లో ఈ స్కూల్ ఉందని తెలిసి, ఇక్కడ చేరాను. దేశంలోనే టాప్ జాకీని కావడమే నా లక్ష్యం. - రఫీక్ షేక్, ముంబై - జాయ్ -
ఇల్లు దాటాక స్వేచ్ఛ విలువ తెలిసింది!
లైఫ్ బుక్: వాణీకపూర్ మా నాన్నకు జంతువుల హక్కులకు సంబంధించి ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది. దీంతో మా ఫామ్‌హౌజ్‌లో ఎటు చూసిన బాతులు, శునకాలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు ఉండేవి. బుజ్జికుక్కపిల్లలు బయట ఎక్కడైనా దీనస్థితిలో కనిపించినా, మురికిగా కనిపించినా ఇంటికి తెచ్చేదాన్ని. వాటిని శుభ్రంగా ఉంచేదాన్ని. నాకు అలా జంతువులన్నీ ఫ్రెండ్స్‌గా మారిపోయాయి. మనుషులతో కంటే వాటితో ఆడుకున్నదే ఎక్కువ. చిన్నప్పుడు చాలా నియమనింబంధనల మధ్య పెరిగాను. కొంత కాలానికి నాకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఢిల్లీలో టూరిజం కోర్సు చేసినప్పుడుగానీ నాకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు నేను మొదటి సారిగా హాస్టల్లో ఉన్నాను. స్వేచ్ఛ విలువ ఏమిటో అప్పుడు తెలిసింది. అయినప్పటికీ, పబ్‌లకు, డిస్కోలకు వెళ్లడం కంటే ఇంట్లో జరిగే విందులనే బాగా ఇష్టపడతాను. నాలో ఆధునిక భావాలు ఉన్నప్పటికీ... నా హృదయం మాత్రం పాత ప్రపంచంలోనే ఉంది! కొన్నిసార్లు అడగకుండానే అదృష్టం ఆప్యాయంగా పలకరిస్తుంది. మోడల్ కావాలనేది నా కోరిక. అయితే నా కోరికకు నా బరువు ప్రతిబంధకంగా కనిపించేది. అయినప్పటికీ ఏదో ఆశ. 75 కిలోల బరువుతో ఢిల్లీలోని ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీకి ఇంటర్వ్యూకు వెళ్లాను. ఎంపికవుతానని పొరపాటున కూడా అనుకోలేదు. అదేం అదృష్టమోగానీ ఎంపికయ్యాను. ఆ తరువాత చాలా బరువు తగ్గాను. ‘ఇది జరగాలి’ ‘అది జరగాలి’ అనే కోరికలు ఏమీ లేవు. జరగాల్సి ఉంటే కచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో సినిమాల్లో నటించాలనే ఊహే రాదు. నేను కూడా సినిమాల్లోకి రావాలనే ఎప్పుడు అనుకోలేదు. కానీ విధి ఇలా నిర్ణయించింది! -
వర్ణం: గుర్రప్పందాలే కానీ కాదు !
సంక్రాంతి వస్తే కోడిపందాలు ఆడటమో, చూడటమో చాలా మందికి మోజు. మరి కోడిపందాలకు, గుర్రప్పందాలకు మీకు తేడా తెలుసా? ఎందుకు తెలియదు... అవి పోట్లాడి గెలుస్తాయి. ఇవి పరుగెత్తి గెలుస్తాయి. అయితే ఈ ఫొటోలో మీరు చూస్తున్నవి గుర్రప్పందాలే. కానీ మీరనుకునేవి కాదు. 500 సంవత్సరాలుగా చైనాలో ఉన్న ఓ సంప్రదాయం. అచ్చం కోడిపందాల్లాగే మగ గుర్రాలు ఒకదాంతో ఒకటి మల్లయుద్ధానికి దిగుతాయి. గెలుపోటములు కూడా కోడిపందాల్లాగే ఉంటాయి. పన్నెండు జంతువుల పేర్ల మీద సంవత్సరాలు లెక్కించే చైనీయులకు ఈసారి ‘గుర్రపు సంవత్సరం’. చైనాలోని ఓ మారుమూల గ్రామంలోని దృశ్యమిది. కాఫీ అరబికా ! చక్కటి ఫొటో ఒక బ్రెజిలియన్ కార్మికుడు కాఫీ గింజలను చెరుగుతుండగా తీసినది. ఇవి కాఫీ గింజలే గాని మనం వాడుతున్నవి కాదట. వీటిపేరు కాఫీ అరబికా. ఇథియోపియా లో వెయ్యేళ్ల క్రితం నుంచి సాగుచేస్తున్న ఈ కాఫీ గింజలు మిగతా వాటికంటే భిన్నమైన రుచిని ఇస్తాయి. ఎందుకంటే వీటిలో ఇతర కాఫీ గింజల్లో ఉండే కెఫైన్లో కేవలం సగమే ఉంటుందట. దానివల్ల వీటితో చేసే కాఫీ మరింత రుచిగా ఉంటుంది. ఇవి ఇపుడు పలుదేశాల్లో పండిస్తున్నారు. పొరబడ్డారా ! ఫొటోలో టవర్ నిజం కాదేమో అనుకున్నారా. నిజమే. కానీ ఇది ‘ఈఫిల్ టవర్’ అని అనుకుంటే మీరు పొరబడినట్టే. చైనాలోని ప్రాచీన సుజోవు నగరంలో ఏర్పాటుచేసిన టవర్ ఇది. దీనికి ఫ్రెంచి డిజైనర్ పాట్రిక్ విద్యుత్ వెలుగులతో అందం తెప్పించారు. దీనికోసం 2200 కోట్లు ఖర్చుపెట్టడం విశేషం. దీనిని డాంగ్ వు టవర్ అని పిలుస్తారు చైనీయులు.