దీని ధర కోటి రూపాయలు మాత్రమే!! | rajasthan man buys a horse for Rs 1.11 crore | Sakshi
Sakshi News home page

దీని ధర కోటి రూపాయలు మాత్రమే!!

Published Thu, Sep 1 2016 1:26 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

దీని ధర కోటి  రూపాయలు మాత్రమే!!

దీని ధర కోటి రూపాయలు మాత్రమే!!

విలాసవంతమైన జీవితం అనుభవించేవారు అంతకంటే అందమైన, లగ్జరీ కారు కావాలని కోరుకుంటారు.  లక్షల ఖరీదు చేసే ఏ ఆడినో, ఏ బిఎండబ్ల్యూ కారునో  సొంతం చేసుకోవాలనుకుంటారు కదా...కానీ ఓ వ్యాపార వేత్త   ఓ అరుదైన అశ్వరాజు మీద మోజు పడ్డాడు.  రాజస్థాన్‌కు చెందిన నారాయణ్‌ సిన్హా  ప్రభాత్‌ అనే గుర్రాన్ని  కొనుకున్నాడు. దాని ఖరీదు  ఎంతో తెలిస్తే మనం నోరెళ్ల బెట్టాల్సిందే.  కోటి పదకొండు లక్షలు వెచ్చించి మరీ ఆ గుర్రాన్ని సొంతం చేసుకున్నాడు.   అంతేకాదు  అంతకంటే  విలాసవంతమైన మరెన్నో  సౌకర్యాలు కల్పించాడు. అతి ఖరీదైన కారు ఎస్ యూవీ గ్రాండ్ చిరోకి సుమారు 94 లక్షల కంటే,  ఎక్కువ ధర పలికింది ఈ ప్రభాత్.  అన్నట్టు మహారాణా ప్రతాప్‌ ఉపయోగించిన అశ్వం చేతక్‌ కూడా మార్వారి జాతిదేనట.

రాజస్థాన్‌లో ప్రాపర్టీ అండ్‌ మైనింగ్‌ వ్యాపారం చేసే నారాయణ్‌ సిన్హా   ప్రఖ్యాత మార్వాడి జాతి కి చెందిన ప్రభాత్ ను  (మగ గుర్రం) భవార్‌సిన్హ్‌ రాథోడ్‌ నుంచి ఒక కోటి 11 లక్షల రూపాయలకు కోనుగోలు చేశాడు. అంతటితో ఆయన ముచ్చట తీరలేదు. దాన్ని చూసుకునేందుకు ముగ్గురు ఉద్యోగులు. వైద్య సేవలు అందించడానికి ఓ డాక్టర్‌. స్నానం చేయడానికి ప్రత్యేక స్విమ్మింగ్‌ పూల్‌. ఇలాంటి 
ఖరీదైన సౌకర్యాలతో పాటు,  ప్రత్యేక ఆహారం నియమావళి ఏర్పాటు చేశాడు.  మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్, పాలు,  దేశీ నెయ్యి నుండి మొదలుకొని ఆహార పదార్థాలన్నీ ప్రత్యేక మైనవే. దీంతోపాటూ ఖరీదైన  షాంపూలతో స్నానం, మసాజ్ తప్పనిసరి. ఇంతటి విశేషమైన గుర్రానికి శిక్షణ ఇస్తోంది మాత్రం ఫ్రాన్స్ చెందిన ఓ మహిళ. 
 ప్రభాత్ అంటే తనకు  చాలా ఇష్టంమనీ,  అది కేవలంగుర్రం మాత్రమే కాదు  తనకు మంచి స్నేహితుడని నారాయణ సిన్హా చెప్పారు.  తన గుండె లో   ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు  మార్వారిజాతి గుర్రాలు  చాలా తెలివైనవనీ, మంచి బలిష్టంగా,  సామర్థ్యంతో ఉంటాయని గుర్రం నిపుణుడు డాక్టర్ అజిత్ రావు తెలిపారు. జైపూర్ చెందిన కన్హయ్య,జోధ్పూర్ గాంగౌర్  కు పుట్టిన ప్రభాత్  ఎన్నో ప్రదర్శనలలో విలువైన బహుమతులు గెల్చుకుందని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement