
గుర్రాలపై గంజాయి తరలింపు
► రూ.10 లక్షల సరుకు స్వాధీనం
► నలుగురి అరెస్ట్
కొత్తకోట(రావికమతం): కొత్తకోట పోలీసులు దాడిచేసి రూ.పది లక్షల విలువైన గంజాయి, మూడు గుర్రాలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్ చేశారు. కొత్తకోట ఎస్‌ఐ శిరీష్‌కుమార్ కథన ం మేరకు కళ్యాణపులోవ అటవీ ప్రాంతం మీదుగా గుర్రాలపై గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ట్రైనీ ఎస్‌ఐ సురేష్ సిబ్బందితో మాటు వేసి, గంజాయిని తరలిస్తున్నవారిపై దాడిచేశారు.
ఈ దాడిలో టి.అర్జాపురం గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి పడాల రమణ, అదే గ్రామానికి చెందిన మర్రా రాజిబాబు, జెడ్.బెన్నవరానికి చెందిన యాదగిరి మారయ్య, చింతపల్లి మండలం మలసాలబందకు చెందిన వంతల అప్పారావు అనే కూలీలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 వేల నగదు, 130 కిలోల గంజాయి, మూడు గుర్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.