Patroling vehicles
-
పుల్వామాలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రమూక..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాల పెట్రోలింగ్ పార్టీపై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలపై దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు పరారయ్యారు. పెట్రోలింగ్ పార్టీపై దాడులకు తెగబడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకునేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం జల్లెడపడుతోంది. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ట్రక్ డ్రైవర్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టిన కొద్దిసేపటికే పుల్వామా ఉగ్ర దాడి చోటుచేసుకోవడం గమనార్హం. అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్బెహరా పట్టణంలో ఉగ్రవాదులు ట్రక్ డ్రైవర్‌ను దారుణంగా హతమార్చారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను ఆగస్ట్ 5న రద్దు చేసిన అనంతరం కశ్మీర్లో కశ్మీరీయేతర వ్యక్తిపై ఉగ్రవాదులు ఈ తరహా దాడి జరపడం ఇది నాలుగోసారి. బాధిత ట్రక్ డ్రైవర్‌ను జమ్ముకు చెందిన నారాయణ్ దత్‌గా గుర్తించారు. ఇక జమ్ము కశ్మీర్లో క్షేత్రస్ధాయి పరిస్ధితులను పర్యవేక్షించేందుకు యూరప్ ఎంపీల బృందం కశ్మీర్లో పర్యటిస్తోంది. -
‘పోలీస్ స్టేషన్‌కో టీ స్టాల్ ఏర్పాటు చేయండి’
న్యూఢిల్లీ : తమ సమస్యలు చెప్పుకోడానికి పోలీస్ స్టేషన్‌కి వచ్చే జనాలతో కాస్తా మర్యాదగా మాట్లాడుతూ వారికి ధైర్యం కలిగించలేరా అంటూ కేంద్ర హోం మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. దివాళి సందర్భంగా రాజధానిలో పెట్రోలింగ్ విధుల నిర్వహించే పోలీస్ అధికారులకు మోటర్ సైకిల్లను అందించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరారు. ‘ఎవరో ఒక బాధితుడు లేది బాధితురాలు తమ సమస్య గురించి చెప్పడానికి పోలీస్ స్టేషన్‌కి వస్తారు. అలాంటి వారితో కాస్తా మంచిగా, మర్యాదగా మాట్లాడలేమా..? వారికి కొన్ని మంచి నీళ్లు ఇవ్వలేమా అంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసులు ప్రజలతో స్నేహంగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలకాల్సిందిగా కోరారు. అంతేకాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక టీ కొట్టును ఏర్పాటు చేయాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. అందుకు కావాల్సిన నిధులను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని తెలిపారు. పోలీస్‌లు ప్రజలకు రోల్ మోడల్‌గా ఎందుకు ఉండకూడదంటూ ఆయన ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చే సాధరణ ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని కోరారు. ఇకమీదట ప్రతి పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వివరాలను తెప్పించుకుంటాను.. ఏవైనా మార్పులు వచ్చాయా లేదా అనేది పరిశీలిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. -
నగర మహిళపై పెరిగిన నేరాల సంఖ్య
న్యూఢిల్లీ: నగర మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. పోలీసులందించిన వివరాల ప్రకారం 2013తో పోలిస్తే 2014లో 31.6 శాతం మేర పెరిగాయి. 2013లో 12,410 కేసులు నమోదు కాగా 2014, డిసెంబర్ 15నాటికి ఈ సంఖ్య 14,687కి చేరుకుంది. 2013లో నమోదైన అత్యాచారాల సంఖ్య 1,571 కాగా మరుసటి సంవత్సరం అది 2,069కి చేరుకుంది. అత్యాచార కేసు నిందితుల్లో 420 మంది బాధితురాలి ఇరుగుపొరుగువారే. మరో 920 మంది స్నేహితులు, 283 మంది బంధువులు, 66 మంది సహోద్యోగులు ఉన్నారు. కొత్త వాళ్లు 84 మంది మాత్రమే. 586 అత్యాచార కేసులకు సంబంధించి నిందితులందరికీ బాధిత మహిళలతో సంబంధాలు ఉన్నాయి. ఇదిలాఉంచితే 2013లో 879 లైంగిక వేధింపు కేసులు నమోదు కాగా 2014కు వచ్చేసరికి ఆ సంఖ్య 1,282కు చేరుకుంది. ఇక వరకట్న వేధింపు కేసులు 2013లో 137 కాగా మరుసటి సంవత్సరం ఇది 147కు చేరుకుంది. పెట్రోలింగ్ వాహనాలను రంగంలోకి దించాం నగరంలో మహిళలపై నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో కమిషనర్ భీంసేన్ బస్సిని మీడియా ప్రశ్నించగా ‘859 పెట్రోలింగ్ వాహనాలను రంగంలోకి దించాం. విధులు ముగించుకుని రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి చేరుకునే మహిళల కోసం పెట్రోలింగ్ విధులను నిర్వర్తించే సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చాం. ద్విచక్ర వాహనాలపై గస్తీని పెంచడంతోపాటు అత్యవసర స్పందన బృందాన్ని కూడా రంగంలోకి దించాం. ఉదయం, సాయంత్రం సమయాల్లో బాలికల పాఠశాలలు, కళాశాలల వద్ద పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. దీంతోపాటు నగర మహిళల్లో ఆసక్తిఉన్నవారికి ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. గత ఏడాది మొత్తం 15,583 మందికి ఈ తరహా శిక్షణ ఇచ్చాం’అని అన్నారు.