Paultripham
-
కరోనా ఎఫెక్ట్: రూ. 3.50 లక్షల విలువ గల కోళ్లు ఫ్రీ
సాక్షి, మద్నూర్: చికెన్ అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్ చూపించింది. కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పౌల్ట్రీఫామ్‌లలోనే కోళ్లు నిలిచిపోతున్నాయి. వాటిని పోషించలేక చాలామంది పౌల్ట్రీ యజమానులు ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు. వైరస్‌ను అంతగా పట్టించుకోని కొందరు వాటిని తీసుకెళ్లి విందులు చేసుకుంటున్నారు. కరోనా భయం మారుమూల గ్రామాలకూ వ్యాపించింది. చికెన్‌తో ఈ వ్యాధి వ్యాపిస్తుందన్న వదంతులతో జనం చికెన్ తినడం మానేస్తున్నారు. దీంతో కోళ్ల అమ్మకాలు తగ్గిపోయి, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలపాలవుతోంది. (భారత్‌లో రెండో మరణం) కోళ్లను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని పౌల్ట్రీ నిర్వాహకుడు సిద్దిరాములు కోళ్లను గ్రామస్తులకు ఉచితంగా అందించారు. కరోనా భయంతో చికెన్ అమ్మకాలు తగ్గాయని, దీంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు కోళ్లు కొనుగోలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. తమ పౌల్ట్రీలో రూ. 3.50 లక్షల విలువ చేసే కోళ్లున్నాయని, వాటిని గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. (కరోనా నెగటివ్ ఐతే.. అంతకన్నా విషాదం ఉండదు!) -
అంచెలంచెలుగా ఎదిగాడు
కష్టాలు శాశ్వతం కావని నమ్మకంతో ముందుకెళ్లాడు. ఇంటర్ ఫెయిలైనా డోంట్‌కేర్ అని.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వస్త్రవ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆదాయం అంతంతే ఉండడంతో పౌల్ట్రీఫాంలో గుమాస్తాగా చేరి.. యజమాని స్థాయికి ఎదిగాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లాడు. తాను ఉపాధి పొందడమే కాకుండా పలువురికి జీవనోపాధి చూపుతున్నాడు నుస్తులాపూర్‌కు చెందిన బుదారపు శ్రీనివాస్. అమానకొండూర్: మా అమ్మనాన్నలకు మేము ఐదుగురు సంతానం. నేను అందరికంటే చిన్నవాడిని. మా నాన్న లక్ష్మయ్య నిత్యం సైకిల్‌పై బట్టల మూట పెట్టుకొని గ్రామాలకు వెళ్లి అమ్మివస్తేనే మా కుటుంబం గడిచేది. 1985లో పదోతరగతి పాసైన తర్వాత నాన్నకు తోడుగా నేను కూడా వస్త్ర వ్యాపారం చేశాను. ఈక్రమంలో ఇంటర్లో ఫెయిల్ అయ్యాను. తర్వాత చదువును వదిలేసిన. బట్టల వ్యాపారంలో పెద్దగా ఆదాయం లేకపోవడంతో పౌల్ట్రీఫాంలో గుమాస్తాగా చేరిన. ఇక్కడే ఫాం ఎలా నిర్వహించాలోఅవగాహనకు వచ్చిన. తర్వాత తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ చిన్న పౌల్ట్రీఫాంను లీజుకు తీసుకున్న. అందులో వచ్చిన ఆదాయంతో పర్లపల్లి శివారులో స్థలం కొని సొంతంగా పౌల్ట్రీఫాం ప్రారంభించిన. ఐదు వేల కోడి పిల్లలతో.. ఐదు వేల కోడి పిల్లలతో ప్రారంభించిన ఫాంలో నేడు 50 వేల కోళ్లు పెంచుతున్న. నా భార్య ప్రేమలత కూడా ఫాం నిర్వహణలో సహాయం చేస్తుంటుంది. ప్రస్తుతం ఫాంలో 25 మంది కూలీలు రోజు పనికి వస్తుంటారు. వీరికి నెలకు రూ.లక్ష వరకు వేతనం చెల్లిస్తున్న. వ్యవసాయంలోనూ ఆదర్శం ప్రకృతి సహకరించక పౌల్ట్రీఫాంలో ఒకవేళ నష్టాలు వస్తే పరిస్థితి తారుమారు కావద్దనే ముందుచూపుతో ఎనిమిదెకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టిన. వరి, కూరగాయాలు సాగుచేస్తున్న. మరో 20 మంది కూలీలకు నిత్యం ఉపాధి కల్పించిన. ఫెయిల్యూర్‌తో బాధపడొద్దు చదువులోనైన, జీవితంలోనైన ఒక్కసారి ఫెయిల్ అయితేనే బాధపడి కూర్చోవద్దు. మనవంతుగా ప్రయత్నిస్తూనే ఉండాలి. సాధించాలనే తపనతో ముందుకెళ్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాం. – బుదారపు శ్రీనివాస్ -
రేవ్ పార్టీ గుట్టురట్టు
పట్టుబడిన 14 మంది యువకులు, 12 మంది యువతులు శామీర్‌పేట: పౌల్ట్రీఫాంలో గుట్టుగా జరుగుతున్న రేవ్‌పార్టీని పోలీసులు రట్టు చేశారు. శనివారం అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న 12 మంది యువతులతో పాటు 14 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ బాబ్జీ కథనం ప్రకారం.. తుర్కపల్లి నివాసి చిన్నరాజిరెడ్డికి చెందిన వినియోగంలో లేని పౌల్ట్రీఫాంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ హాలులోని రెండు గదుల్లో 12 మంది యువతులు మత్తులో అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్నారు. వారిపై 14 మంది యువకులు నోట్లు వెదజల్లుతున్నారు. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. రూ. 2.98 లక్షల నగదు, రెండు ఇన్నోవాలు, ఒక టవేరా వాహనంతోపాటు ఓ ఇండికా కారు, 19 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతుల్లో ముగ్గురు ముంబై, ఒకరు కోల్‌కతా, మిగిలిన వారు నగరానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. యువకులంతా నగర శివారులోని పలు ప్రాంతాలకు చెందిన వారే.