కోళ్లను ఫ్రీగా ఇస్తున్న పౌల్ట్రీ నిర్వాహకులు
సాక్షి, మద్నూర్: చికెన్ అమ్మకాలపై కరోనా ఎఫెక్ట్ చూపించింది. కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పౌల్ట్రీఫామ్‌లలోనే కోళ్లు నిలిచిపోతున్నాయి. వాటిని పోషించలేక చాలామంది పౌల్ట్రీ యజమానులు ఫ్రీగానే ఇచ్చేస్తున్నారు. వైరస్‌ను అంతగా పట్టించుకోని కొందరు వాటిని తీసుకెళ్లి విందులు చేసుకుంటున్నారు. కరోనా భయం మారుమూల గ్రామాలకూ వ్యాపించింది. చికెన్‌తో ఈ వ్యాధి వ్యాపిస్తుందన్న వదంతులతో జనం చికెన్ తినడం మానేస్తున్నారు. దీంతో కోళ్ల అమ్మకాలు తగ్గిపోయి, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలపాలవుతోంది. (భారత్‌లో రెండో మరణం)
కోళ్లను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని పౌల్ట్రీ నిర్వాహకుడు సిద్దిరాములు కోళ్లను గ్రామస్తులకు ఉచితంగా అందించారు. కరోనా భయంతో చికెన్ అమ్మకాలు తగ్గాయని, దీంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు కోళ్లు కొనుగోలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. తమ పౌల్ట్రీలో రూ. 3.50 లక్షల విలువ చేసే కోళ్లున్నాయని, వాటిని గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. (కరోనా నెగటివ్ ఐతే.. అంతకన్నా విషాదం ఉండదు!)
Comments
Please login to add a commentAdd a comment