breaking news
Pawan Kalyan Padala
-
కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
గత సీజన్లో జరిగిన నామినేషన్స్ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో (Bigg Boss Telugu 9) రిపీట్ కాబోతున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి నామినేట్ చేయనున్నారు. అయితే కాస్త డిఫరెంట్‌గా ఈ ప్రక్రియ జరగనుంది. కత్తితో పొడిచి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎలిమినేట్ అయినవాళ్లు ఒక కత్తితో వారే స్వయంగా నామినేట్ చేస్తారు. వాళ్లు ఎవరికైతే మరో కత్తిస్తారో.. వారు ఇంకొకర్ని నామినేట్ చేయాలన్నమాట!సంజనాకు క్లాస్ పీకిన ప్రియఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో మనీష్, శ్రీజ, ప్రియ, ఫ్లోరా.. హౌస్‌లో అడుగుపెట్టారు. బాడీ షేమింగ్ చేసిన సంజనాను ప్రియ నామినేట్ చేస్తూ ఆమెకు కత్తి గుచ్చింది. క్లాస్ అనే పదం వాడటం కూడా తప్పేనని క్లాస్ పీకింది. మనీష్.. కల్యాణ్‌కు కత్తి గుచ్చాడు. సర్ప్రైజ్ ఏంటంటే శ్రీజ కూడా కల్యాణ్‌నే నామినేట్ చేసిందట! ఇక ఇమ్మాన్యుయేల్.. తనూజను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.నామినేషన్స్‌లో ఎనిమిదిమందిసోషల్ మీడియాలో వైరలవుతున్న లీక్స్ ప్రకారం ఎనిమిదోవారం మాధురి, తనూజ, గౌరవ్, రీతూ, రాము, సంజనా, డిమాన్ పవన్, కల్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయినవారిలో కొద్దిమంది బిగ్‌బాస్ ట్రోఫీ కోసం మీతో పోటీపడి, మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారంటూ రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో శ్రీజ పేరు ముందునుంచి వినిపిస్తున్నదే! మరి తనతో పాటు ఇంకెవరైనా హౌస్‌లో అడుగుపెడతారా? చూడాలి! చదవండి: అక్కడ ఫోకస్ చేయడం వల్లే రమ్య ఎలిమినేట్.. సంపాదన ఎంతంటే? -
కల్యాణ్‌ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్‌బాస్‌కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్‌కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్‌గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్‌పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్‌లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్‌బిన్‌లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్‌బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్‌లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్‌పై సీఎం ప్రశంసలు -
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్‌లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్‌పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్‌లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్‌గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్‌కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్‌ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్‌కు పిలిచారు. టైఫాయిడ్‌తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్‌బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్‌బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు!
నామినేషన్స్ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్‌పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్‌పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్ 21వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నామినేషన్స్ లొల్లితనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్ చేసే పవర్‌ను కల్యాణ్‌కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్రెడీ తనూజను నామినేట్ చేసింది. నాకు ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదు అని కల్యాణ్ వివరణ ఇచ్చాడు.తనూజను ఎప్పుడో వదిలేశా!అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్‌గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్ ఇచ్చిన ఆన్సర్‌కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్ గేమ్ ఆడితే తర్వాతి వారం నామినేట్ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్.ఇమ్మాన్యుయేల్‌పై రంకెలేసిన తనూజమరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్‌పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్‌తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్‌లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్ చేయాలని బలంగా డిసైడ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.దొంగలుగా హౌస్మేట్స్బిగ్బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ టీమ్ లీడర్స్‌ను ప్రకటించాడు. గేమ్స్ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్‌లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్ అవుతారన్నాడు. మొదటి గేమ్‌లో మాధురి టీమ్ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్ పూల్‌లో ముంచేశారు.చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్‌బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్‌కార్డ్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్‌కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్‌తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్‌ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్‌ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్‌కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్‌రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు దివ్వెల మాధురి (Madhuri Divvala). ఒకరు నాకెదురొచ్చినా వారికే రిస్క్.. నేను వారికి ఎదురెళ్లినా వారికే రిస్క్ అంటూ హౌస్‌మేట్స్‌కు వార్నింగ్ ఇస్తూనే ఇంట్లో అడుగుపెట్టింది. అంతేగాకుండా ఇకపై తన పేరు దివ్వెల కాదు దువ్వాడ మాధురి అని ప్రకటించింది. హౌస్‌లో అడుగుపెట్టి ఒక పూటయిందో, లేదో.. అప్పుడే గొడవలు మొదలుపెట్టేసింది.కెప్టెన్‌తో గొడవకిచెన్లో పని చేస్తున్న మాధురిని కూర్చోమన్నాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూర్చోమంటూ గౌరవంతో కుర్చీ ఆమెవైపుకు జరిపాడు. అందులోనూ పెడార్థం వెతికింది మాధురి. నేను వెళ్లాలి.. కూర్చోకపోతే ఊరుకోరా? అని అడిగింది. అప్పటికీ కల్యాణ్ ఎంతో ఓపికగా.. ఈరోజు వంట చాలా లేట్ అయింది.. రేపటినుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని సుతిమెత్తగా హెచ్చరించాడు. ఎవర్నీ లెక్క చేయని మాధురినేను అరగంట కూర్చున్నాను. అప్పుడు లేట్ అవుతుందని తెలియదా? అప్పుడేం చేశారు? అని తిరిగి కెప్టెన్‌నే తప్పుపట్టింది మాధురి. మీరిలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అని వార్నింగ్ ఇచ్చాడు కల్యాణ్. దీంతో దివ్య మధ్యలో కలగజేసుకుని వంట ఆలస్యమవుతుందని అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె వినిపించుకుంటేగా! అస్సలు లెక్కచేయలేదు. నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందన్న కల్యాణ్ మాటల్ని మాత్రం బలంగా పట్టుకుంది. ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్?అందుకు కల్యాణ్.. నేను గౌరవంతో కూర్చోమని చెప్పాను.. అందుకామె వెటకారంగా మాట్లాడటం అవసరమా? అని వాదించాడు. ఏయ్.. వాయిస్ ఎందుకు లేస్తుంది? ఎందుకు అరుస్తున్నావ్? అని మాధురి కల్యాణ్‌పై కోప్పడింది. అందరిపై అరిచేసిన మాధురి చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. అనాల్సిన మాటలన్నీ అనేసి లాస్ట్‌లో ఏడవడం దేనికని కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. ఫైర్ బ్రాండ్ అనుకున్న మాధురి అప్పుడే కన్నీటి కుళాయి తిప్పడం.. చూసేవారికి కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది. చదవండి: ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా -
వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్‌గా కల్యాణ్.. గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్ కల్యాణ్. అతడిని సేఫ్ జోన్లో పడేయడంతో పాటు కెప్టెన్ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్ 10వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..పూల్ టాస్క్కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్ జోన్లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్ జోన్లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్ జోన్‌కు పంపించేందుకు బిగ్‌బాస్ చివరి ఛాన్స్‌గా పూల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్ బాగా ఆడాడు. ఈ గేమ్‌లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.కల్యాణ్‌ను గెలిపించిన శ్రీజసేఫ్ జోన్లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలన్నది డిసైడ్ చేయమని డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్ ఉంది.. కల్యాణ్‌కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్ కల్యాణ్‌కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్‌గా నిలిచాడు.కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజకెప్టెన్సీ బ్యాండ్ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్ ప్లేయర్ అన్న దివ్యతో బ్యాండ్ కట్టించుకుని కాలర్ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్ అవ్వాల్సిన తను.. డేంజర్ జోన్‌కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్‌ను కెప్టెన్ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.చదవండి: కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్ అవార్డ్: స్టార్ డైరెక్టర్ -
బంధాల్లో చిక్కుకుపోయిన భరణి.. కొత్త కెప్టెన్ అతడే!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) బంధాల షోగా మారిపోయింది. మీరంతా రిలేషన్స్ పెట్టుకోవడానికి హౌస్‌కి రాలేదు, గేమ్ ఆడటానికి వచ్చారని నాగ్ చురకలంటించినా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. గతవారం తనూజ ఫేవరెట్ వస్తువులను భరణితో.. భరణికి ముఖ్యమైన వస్తువులను తనూజతో పగలగొట్టించి.. ఈ రిలేషన్స్‌కు ఫుల్స్టాప్ పెట్టమని డైరెక్ట్‌గా చెప్పారు. అబ్బే, తలకెక్కితే కదా!కనుక్కోండి చూద్దాంఈ బంధాల మధ్యలో ఎక్కువ నలిగిపోతుంది భరణియే (Bharani Shankar)! దానివల్ల ఇప్పుడేకంగా కెప్టెన్సీ కూడా చేజారింది. సేఫ్ జోన్లో ఉన్న ఇమ్మాన్యుయేల్, రాము, భరణి, దివ్య, పవన్ కల్యాణ్, తనూజ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. వీళ్లందరి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. తమ తలపై ఉన్న బల్బును ఎవరు ఆఫ్ చేశారో కరెక్ట్‌గా చెప్తే వాళ్లు ఎలిమినేట్!కెప్టెన్‌గా కల్యాణ్అలా దివ్య మొదటగా రామును తీసేసింది. కల్యాణ్ వంతు వచ్చేసరికి.. భరణి పేరు గెస్ చేశాడు. ఆయన తనూజ, దివ్యను ఎలాగో తీయడు. ఇమ్మాన్యుయేల్‌పై కొంత అనుబంధం ఉంది. కాబట్టి నన్ను తీసేయాలనుకున్నాడు అని కరెక్ట్‌గా గెస్ చేశాడు. అలా ఈ కనుక్కోండి చూద్దాం ఆటలో గెలిచి పవన్ కల్యాణ్ ఐదో కెప్టెన్‌గా నిలిచాడు. చదవండి: కమల్ హాసన్‌పై తిరగబడ్డ నటి.. తెలుగు బిగ్‌బాస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ -
సంజనా శాడిజం.. చచ్చినా, బతికినా తనతోనే.. ఇమ్మూ లవ్‌స్టోరీ
దొంగతనంతో రోత పుట్టిస్తోంది సంజనా. ఒకటీరెండు కాదు ఏకంగా 8 గుడ్లు తినేసింది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో చక్రం తిప్పడంతో కల్యాణ్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. అందుకు కర్త, కర్మ, క్రియ రీతూ అని తెలిసి మోసపోయానంటూ ఏడ్చాడు. ఇక ఇమ్మూ తన లవ్‌స్టోరీ చెప్పాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాది శాడిజం: హరీశ్సంజనా.. అందరి గుడ్లు దొంగిలించి గుటుక్కుమని మింగేసింది. దాదాపు 8 గుడ్లు తినేయడంతో హరీశ్.. ఇది సైకోయిజం, శాడిజం.. మా అమ్మ ఇలా చేస్తే బయటకు పంపేవాడ్ని అని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). తనకు కల్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ అని శ్రీజ క్లారిటీతో ఉంది. పవన్.. బయటకు ఏమీ చెప్పకపోయినా తనకు రీతూ ఫస్ట్ ప్రియారిటీ అని అందరికీ తెలిసిందే! దీంతో బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో ఫస్ట్ బెల్ అందుకున్న డిమాన్ పవన్.. కల్యాణ్‌ను ఎలిమినేట్ చేశాడు. అది కల్యాణ్ జీర్ణించుకోలేకపోయాడు.నాలుగో కెప్టెన్తర్వాత శ్రీజ (Srija Dammu).. ఇమ్మూను ఎలిమినేట్ చేసింది. అనంతరం భరణి చేతికి గంట వెళ్లింది. రీతూకు సపోర్ట్ చేయమని ఓరకంగా బ్లాక్మెయిల్ చేసింది తనూజ. కానీ అప్పటికే రాముకి మాటిచ్చిన భరణి.. నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తర్వాతెప్పుడైనా సాయం చేస్తాను, కానీ, ఇప్పుడు కాదంటూ రీతూను ఎలిమినేట్ చేశాడు. అలా రాము రాథోడ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. అంతా అయిపోయాక కల్యాణ్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది రీతూ. మోసపోయానని బాధనన్ను గేమ్‌లో తీసేయమన్నావా? అని కల్యాణ్ సూటిగా అడగ్గా అవునని తలాడించింది రీతూ (Rithu Chowdary). దీంతో చేయ్ తీయ్ అంటూ సీరియస్ అయ్యాడు. రీతూ, పవన్ సర్ది చెప్పాలని ప్రయత్నించినా అసలు లెక్కచేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అన్నావ్.. ఫస్ట్ తీసేయమని ఎలా చెప్పావ్? అని మనసులో బాధను బయటపెట్టాడు. నేను చెప్పేది విను అంటూ రీతూ వెంటపడ్డా సరే.. ఓడిపోయినందుకు కాదు, మోసపోయినందుకు బాధపడుతున్నా అని క్లాస్ పీకాడు కల్యాణ్. ఆ మాటతో బోరుమని ఏడ్చింది రీతూ.చూడకుండానే లవ్తర్వాత రాంబో ఇన్ లవ్ వెబ్‌సిరీస్ హీరోహీరోయిన్ హౌస్లోపలకు వచ్చారు. తమ ప్రేమకథల్ని చెప్పమన్నారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. నేను స్టాండప్ షోలు చేస్తున్నప్పుడు నాకు ఓ అమ్మాయి పెద్ద మెసేజ్ చేసింది. నా నెంబర్ ఇవ్వమని అడిగింది. అలా రోజూ మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు షోలు లేవు, ఫేమస్ అవలేదు. తన ముఖం చూడకుండానే ప్రేమించాను. అప్పుడు తను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చచ్చినా, బతికినా దీనితోనే కలిసుండాలనుకున్నాను. అంత మంచి అమ్మాయి. కానీ, తర్వాత షూటింగ్స్‌లో బిజీ ఉండి సరిగ్గా తనకు టైమ్ ఇచ్చేవాడ్ని కాదు. తనకోసం కప్పు గెలుస్తా..చిరాకుపడేవాడ్ని, తిట్టేవాడ్ని. బిగ్‌బాస్‌కు వచ్చాకే తన విషయంలో చాలా రియలైజ్ అయ్యా.. రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నాను. నా అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తనకు ఇవ్వలేదు. అయినా నాకోసం ఉండిపోయింది. ఈ నవంబర్‌కు పీజీ చేసేందుకు ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కు వస్తున్నానని వెళ్లకుండా ఆగిపోయింది. నాకోసం ఎందుకింత చేస్తుంది? తనకోసం గెలవాలి, కప్పు తన చేతిలో పెట్టాలనే ఆడుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.చదవండి: అమ్మోరు తల్లి సీక్వెల్.. మహాశక్తిగా నయనతార -
తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్.. అతడే కొత్త కెప్టెన్!
షోలో కనిపించట్లేదు, కేవలం ఓదార్పులు తప్ప ఇంకేమీ లేదు అని మాటలు పడ్డ కల్యాణ్ గ్రాఫ్ ఈ ఒక్క ఎపిసోడ్‌తో ఎక్కడికో వెళ్లనుంది. కసిగా గేమ్ ఆడుతున్నాడు. తనను తాను నిరూపించుకుంటున్నాడు. అటు సంజనా మాత్రం తన గేమే కాదు, టీమ్ గేమ్‌ను సైతం చెడగొట్టేసింది. మరి హౌస్‌లో ఏం జరిగిందో అక్టోబర్ 2 ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రెడ్ టీమ్ బీభత్సంకెప్టెన్సీ కంటెండర్, మటన్, లగ్జరీ అంటూ కొన్ని కార్డులను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). వాటిని గేమ్స్ ఆడి గెలుచుకోవాలన్నాడు. మొదట బాల్స్ గేమ్‌లో కల్యాణ్ (రెడ్ టీమ్) బాగా ఆడి గెలిచి కంటెండర్‌షిప్ సాధించాడు. నెక్స్ట్ హిప్పో గేమ్‌లో రెడ్ టీమ్ ప్లేయర్స్ ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ బీభత్సంగా ఆడారు. ఈ గేమ్‌లో సంజనా.. తన ఎల్లో టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్‌కు సహకరించింది. ఇదేంటని ఎల్లో టీమ్ లీడర్ సుమన్ శెట్టి ప్రశ్నించగా.. అన్నా, మనం ఎలాగో గెలవం.. రెడ్ టీమ్‌కు సపోర్ట్ చేద్దాం.. నువ్వు కూడా చేయ్ అని ఉచిత సలహా ఇచ్చింది. అందుకు సుమన్ ఒప్పుకోలేదు. సంజనాపై సుమన్ అసహనంఈ గేమ్‌లో రెడ్ టీమ్ గెలవగా ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు కంటెండర్ షిప్ కార్డ్ అందింది. మరో గేమ్‌లో రెడ్ టీమ్ గెలిచి కిక్ ఔట్ కార్డు సాధించారు. దీని ద్వారా గ్రీన్ టీమ్(భరణి, దివ్య, శ్రీజ)ను ఆటలో లేకుండా ఎలిమినేట్ చేశారు. మరోవైపు సంజనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన సుమన్.. ఆమె నోట్లో నేరు పెట్టలేను. పెద్దాయన పెద్దాయన అంటూ నన్ను తొక్కేస్తోందంటూ డిమాన్ పవన్, రీతూల దగ్గర తన ఫ్రస్టేషన్ వెళ్లగక్కాడు.బోరున ఏడ్చేసిన తనూజతర్వాత బిగ్‌బాస్ కంటెండర్లుగా అర్హత సాధించిన కల్యాణ్, ఇమ్మాన్యుయేల్‌కు పెద్ద బాధ్యత అప్పగించాడు. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీపడే మూడు జంటల్ని ఎంచుకోమన్నాడు. అలా వీరు.. తనూజ-సుమన్, ఫ్లోరా-రీతూ, సంజన-రామును మూడు జంటలుగా విభజించారు. వీళ్లకు గార్డెన్ ఏరియాలో ఓ గేమ్ పెట్టారు. అందులో తనూజ (Thanuja Puttaswamy) ఫౌల్ చేయడంతో గేమ్ నుంచి తీసేశారు. దీంతో తను బాత్రూమ్లోకి వెళ్లి మరీ బోరున ఏడ్చేసింది. డోర్ తీయమని బతిమాలిన రీతూ.. తను కూడా లోపలకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.ఆ నలుగురే కెప్టెన్సీ కంటెండర్స్తర్వాత గేమ్స్‌లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్సయ్యారు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము కెప్టెన్సీ కోసం పోటీపడగా వీరిలో రాము కెప్టెన్ అయినట్లు లీక్స్ వస్తున్నాయి. ఇక ఈరోజు హరీశ్ కళ్లలో భయం, బాధ కనిపించింది. ఇప్పటికే ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడంటూ అతడిపై నింద పడింది. దానివల్ల ఒంటరిగా కుమిలిపోతున్న హరీశ్.. ఓ గేమ్‌లో దివ్యను ముందుకు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆమె చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి.. సరిగా పట్టుకోండి అని కావాలనే చీదరించుకుంది. తను జాగ్రత్తగా డీల్ చేసినా ఇలాంటి కామెంట్లు రావడంతో ఆయన వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పాడు.చదవండి: కొత్త ప్రయాణం అంటూ ఫోటో షేర్ చేసిన సమంత -
బలవంతంగా ఆర్మీకి.. మాతో కలిసి భోజనం కూడా చేయడు: పవన్ పేరెంట్స్
పవన్ కల్యాణ్ పడాల.. అగ్నిపరీక్షలో ఇతడిని చూసి విన్నింగ్ మెటీరియల్ అనుకున్నారంతా! ఫోకస్ అంతా ఆటపైనే ఉండేది. ఆలోచనంతా గెలుపుపైనే ఉండేది. ఇలాంటి వ్యక్తి బిగ్‌బాస్ షోలో అడుగుపెడితే అసలైన మజా ఉంటుంది, అవతలి కంటెస్టెంట్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని భ్రమింపజేశాడు. కానీ, బిగ్‌బాస్‌కు వచ్చీరావడంతోనే తన ఫోకస్, ఆలోచనలన్నీ పక్కనపెట్టేశాడు. ట్రాక్ తప్పిన పవన్అసలు లక్ష్యాన్ని గాలికొదిలేసి రీతూ, తనూజలను ఓరచూపులు చూడటం, అమ్మాయిలు ఏడిస్తూ వారిని హత్తుకుని ఓదార్చడం తప్ప ఏమీ చేయట్లేదు. ఇది చూసిన బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ప్రియులకు నీరసమొచ్చేసింది. ఆర్మీ జాబ్‌కు బ్రేక్ తీసుకుని మరీ బిగ్‌బాస్‌కు వచ్చిన పవన్ ట్రాక్ తప్పడం ఒకింత ఆశ్చర్యమనే చెప్పవచ్చు. అయితే పవన్.. పేరెంట్స్ కోసమే బలవంతంగా ఆర్మీకి వెళ్లాడు. ఇష్టం లేకుండా సైన్యంలో చేర్పించారని తల్లిదండ్రులతో ఏడాదిన్నరపాటు మాట్లాడనేలేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేక..ఈ విషయం గురించి పవన్ (Pawan Kalyan Padala) తండ్రి మాట్లాడుతూ.. నేను, నా భార్య కొన్నేళ్లక్రితం తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాం. చావు అంచులవరకు వెళ్లొచ్చాం. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. ఆ సమయంలో వాడిని వాళ్ల అత్త దగ్గరకు పంపించాం. అక్కడ నాలుగైదేళ్లున్నాడు. అక్కడినుంచి హాస్టల్లో చేర్పించాం. చదువైపోగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరను, ఇంటికొచ్చేస్తా.. అన్నాడు. అలాగైతే నా ఇంటికి రావొద్దని చెప్పాను. బలవంతంగా ఉద్యోగానికి..ఆరోజు వచ్చేయ్‌రా అనుంటే ఈ పరిస్థితిలో ఉండేవాడా? మా బాబాయ్, అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తారు. అలా నా కొడుకుని కూడా అదే రంగంలో చూడాలనుకున్నాను. బలవంతంగా ఆర్మీకి పంపించామని 14 నెలలు మాతో మాట్లాడలేదు. మేము ఫోన్ చేసినా కట్ చేసేవాడు. నెల రోజులపాటు సెలవులకు ఇంటికి వచ్చినా సరే బయట ఫ్రెండ్స్‌తో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. మాతో కూర్చుని పావుగంటైనా మాట్లాడేవాడు కాదు.. కనీసం మాతో కలిసి భోజనం కూడా చేయడు.నా డబ్బుతోనే పెళ్లి చేస్తానేను తిరగడానికి వచ్చాను, మీతో ఊసులాడటానికి కాదంటాడు. వాడికెలా ఉండాలో తెలీదు. వాడు స్నానం చేయడానికి వెళ్తే కూడా బాత్రూమ్లో నేనే నీళ్లు పెట్టేవాడిని. నేను ఒకప్పుడు డ్రైవర్‌ను. ఒంట్లో ఓపిక లేకపోవడం వల్ల కిరాణ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నా. కల్యాణ్ డబ్బు ఇస్తానంటాడు.. కానీ నేను తీసుకోను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే వాడి పెళ్లి చేస్తాను. అదే భయంగా ఉందిఅగ్నిపరీక్షకు అప్లై చేసిన విషయం చెప్పలేదు. సెలక్ట్ అయ్యాక చెప్పాడు. మా ఇష్టాన్ని తను కాదనలేదు కాబట్టి తన ఇష్టాన్ని మేమూ అంగీకరించాం. బిగ్‌బాస్ షోలో కల్యాణ్ ఆట గురించి ఎవరైనా చెప్తుంటే ఆ క్షణం ఆనందంగా ఉంటుంది, కానీ మనసుకు నచ్చదు. ఆ షో నుంచి వచ్చాక ఉద్యోగానికి వెళ్తాడా? లీవ్ గురించి అక్కడేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్నదే భయంగా ఉంది అని పవన్ తండ్రి చెప్పుకొచ్చాడు.చదవండి: హౌస్‌మేట్స్‌ను వెర్రిపప్పలను చేసిన బిగ్‌బాస్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు


