సైకిల్‌పై ఎమ్మెల్యే...
చండీగఢ్: పక్క గల్లీకి వెళ్లాలంటే బైక్‌ను ఆశ్రయించే వాళ్లున్న ప్రస్తుత సమాజంలో ఓ ఎమ్మెల్యే ఏకంగా 110 కి.మీ దూరాన్ని సైకిల్ తొక్కుకుంటూ వచ్చేశారు. ఔరా అనిపించినా ఇది నిజం. పవన్ కుమార్ సైనీ బీజేపీ ఎమ్మెల్యే. చండీగఢ్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు పది మంది పార్టీ కార్యకర్తలతో కలసి తొక్కర తొక్కు హైలెస్సా అనుకుంటూ సరదాగా వచ్చేశారు. సైనీ లాడ్వా నుంచి సైకిల్‌పై 8 గంటల్లో చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
‘సైకిల్ తొక్కండి. ఆరోగ్యంగా ఉండండి. పర్యావరణానికి మేలు చేయండి’ అనే సందేశాన్ని ఆచరించి మరీ చూపారు. సైకిల్‌పై అసెంబ్లీకి వచ్చిన సైనీని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా, తాను ఎమ్మెల్యేనని చెప్పడంతో అనుమతిచ్చారు. తక్కువ దూరాలకు ఇప్పటికీ సైకిల్ వాడతానని ఇదే తన ఆరోగ్య రహస్యమని ఆయన చెప్పారు. ఇవే కాదండోయ్ అక్కడి యువత, చిన్నారులకి సైతం సైక్లింగ్ చేయమని సలహానిస్తున్నారు.