breaking news
Pawan Sadineni
-
నారావారబ్బాయి కూడా భయపెడుతున్నాడు
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో అందరికంటే బిజీగా ఉన్న హీరో నారా రోహిత్. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలను రిలీజ్ చేసిన రోహిత్ మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జ్యో అచ్యుతానంద సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రోహిత్, శంకర, అప్పట్లో ఒకడుండే వాడు, పండగలా వచ్చాడు, కథలో రాజకుమారి సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే తాజాగా మరో సినిమాకు ఓకె చెప్పాడు నారా రోహిత్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న రోహిత్, ఈ సారి మరో కొత్త జానర్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. భీముడు పేరుతో హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరా రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకుడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
సినిమా రివ్యూ: ప్రేమ ఇష్క్ కాదల్
టాలీవుడ్లో చిన్న చిత్రాలు ఆకట్టుకుంటున్న నేపథ్యంలో పబ్లిసిటి, మీడియా ప్రమోషన్ ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన చిత్రం ప్రేమ ఇష్క్ కాదల్. ఈ చిత్రాన్ని డి సురేష్‌బాబు సమర్పించడంతో మరింత క్రేజ్ పెంచడం, మ్యూజిక్ కూడా ఆడియెన్స్ ను చేరుకోవడం లాంటి అంశాలు ఫీల్ గుడ్ మూవీ అనేంతగా ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం విడుదలకు ముందే మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాల్లో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం అంచనాలను చేరుకుందా అనేది ఓసారి పరిశీలిద్దాం. రణధీర్ అలియాస్ రాండీ (హర్షవర్ధన్ రాణే)-సరయు (వితికా షేరూ), రాయల్ రాజు(విష్టువర్ధన్)-సమీరా రీతూ శర్మ, అర్జున్ (హరీష్ వర్మ)-శాంతి(శ్రీముఖి) అనే మూడు జంటలకు సంబంధించిన మూడు ప్రేమ కథల చిత్రంగా ప్రేమ ఇష్క్ కాదల్ తెరకెక్కింది. ఓ కాఫీ షాప్ యజమాని అయిన ర్యాండీకి మ్యూజిక్ అంటే ప్రాణం. తన కాఫీ షాప్‌కు వచ్చే కస్టమర్లను తన పాటలతో ఆలరిస్తూ ఉంటాడు. ర్యాండీ చేత తన కాలేజిలో పాట పాడించాలనుకున్న సరయూ అతని వెంట పడుతుంది. ఆ క్రమంలో ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటారు. రాయల్ రాజు ఓ సినిమా అసిస్టెంట్ డెరైక్టర్.. అతను షూటింగ్‌కు వచ్చిన సమీరా అనే క్యాస్టూమ్ డిజైనర్‌తో కలిగిన పరిచయం ఇద్దరిని దగ్గరయ్యేలా చేస్తోంది. అర్జున్ అనే రేడియో జాకీ ఓ ప్లేబాయ్.. ఎప్పుడూ అమ్మాయిలే జీవితంగా భావించే అర్జున్ చెన్నై నుంచి వచ్చిన ఓ సాఫ్వేర్ ఇంజినీర్ శాంతిని చూసి ఇష్టపడుతాడు. ఇలా మూడు జంట మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి? మూడు జంటల మధ్య చోటుచేసుకున్న అపార్ధాలు, అభిప్రాయ విభేదాలు ఎలా పరిష్కరించుకున్నారు? మూడు జంటల ప్రేమ కథలకు ముగింపేమిటో తెలుసుకోవాలంటే ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో మూడు జంటలుగా నటించిన అందరూ దాదాపు కొత్తవారే అయినప్పటికి వ్యక్తిగతంగా చక్కటి ప్రతిభను కనబరిచారు. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేకూర్చారు. సంగీతకారుడిగా హర్షవర్ధన్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న రాయల్ రాజులో విష్టువర్ధన్, అర్జున్ హరీష్‌లు తమ వంతు న్యాయం చేశారు. నూతన హీరోయిన్లు ముగ్గురు కూడా మెచ్యూరిటి ఉన్న స్టార్లుగా కనిపించారు. స్టార్ యాక్టర్‌గా సత్యం రాజేశ్, ఇతర కమెడియన్లు తమ మార్కును ప్రదర్శించలేకపోయారు. ఈ చిత్రానికి కెమెరా, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం చాలా రిచ్‌గా కనిపించడానికి కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫి, శ్రవణ్ సంగీతం కీలకపాత్రను పోషించాయి. బెక్కం వేణుగోపాల్ నిర్మాణ విలువలు అప్రిషియేట్ చేసే రేంజ్లో ఉన్నాయి. కొత్త తారల ప్రతిభ, మంచి ఫోటోగ్రఫి, ఇంపైన సంగీతం లాంటి అంశాలను సానుకూలంగా మలుచుకుని చిత్రాన్ని హిట్ గా మలుచుకోవడంలో దర్శకుడు పవన్ సాదినేని తడబాటుకు గురైనట్టు కనిపించింది. తొలి భాగం చాలా నెమ్మదించడం, ప్రేక్షుకుడికి ఆసక్తిని కలిగించే అంశాలు లేక పోవడం బోర్ కొట్టించదనే చెప్పవచ్చు. ఎడిటింగ్ పరంగా కూడా క్రిస్ప్‌గా లేకపోవడం, స్క్రీన్‌ప్లే పేలవంగా ఉండటం ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. నేటి యూత్‌లో ఎలాంటి ట్రెండ్ ఉందో అనే విషయాన్ని కథగా ఎంచుకోవడం బాగానే ఉంది. అయితే అలాంటి కథను యూత్ ను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ఇక మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కోసమే ఈ చిత్రం తీశారనే భావన కలగడం ఈ చిత్ర విజయావకాశాలపై ప్రభావం చూపడం ఖాయం. ఏది ఏమైనా రొమాంటిక్ కామెడీగా రూపొందించే క్రమంలో పూర్తి స్థాయిలో వినోదాన్ని, ఫీల్‌గుడ్ ఎలిమెంట్స్ ను మిస్ అవడం ప్రేక్షకుడ్ని నిరాశకు గురిచేసే అంశంగా చెప్పవచ్చు. మల్టిప్లెక్స్, బి, సీ గ్రేడ్ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడంపైనే చిత్రం విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.