నారావారబ్బాయి కూడా భయపెడుతున్నాడు | Nara Rohit New Movie Bheemudu | Sakshi
Sakshi News home page

నారావారబ్బాయి కూడా భయపెడుతున్నాడు

Published Thu, Oct 13 2016 12:12 PM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM

నారావారబ్బాయి కూడా భయపెడుతున్నాడు - Sakshi

నారావారబ్బాయి కూడా భయపెడుతున్నాడు

టాలీవుడ్ యంగ్ జనరేషన్లో అందరికంటే బిజీగా ఉన్న హీరో నారా రోహిత్. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలను రిలీజ్ చేసిన రోహిత్ మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జ్యో అచ్యుతానంద సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రోహిత్, శంకర, అప్పట్లో ఒకడుండే వాడు, పండగలా వచ్చాడు, కథలో రాజకుమారి సినిమాలను లైన్లో పెట్టాడు.

ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే తాజాగా మరో సినిమాకు ఓకె చెప్పాడు నారా రోహిత్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న రోహిత్, ఈ సారి మరో కొత్త జానర్లో సినిమాకు రెడీ అవుతున్నాడు. భీముడు పేరుతో హార్రర్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దసరా రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకుడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement