చెల్లెలి హాస్టల్ కష్టాలు చూసి...‘జోలో’ స్నేహా చౌదరి సక్సెస్ స్టోరీ
టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ప్రత్యామ్నాయాల అన్వేషణ, క్లిష్ట సమస్యల పరిష్కారం ఇలాంటి విషయాల్లో మహిళలు ముందుంటారు. రంగం ఏదైనా సరే.. బుర్రలో ఆలోచన వచ్చిందంటే.. దానివైపు దృష్టి పెట్టారంటే.. ‘తగ్గెదేలే’ అన్నట్టు దూసుకుపోతారు. అలాంటి వారిలో కోజికోడ్‌కు చెందిన స్నేహా చౌదరి ముందు వరసలో ఉంటారు. ఇంతకీ స్నేహ సక్సెస్ జర్నీ ఏంటి? తెలుసుకుందాం రండి!
స్నేహ బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్ పట్టాను, కోజికోడ్‌లో ఐఐఎం పూర్తి చేశారు. డెలాయిట్, ఒరాకిల్ వంటి ప్రముఖ గ్లోబల్ కంపెనీలలో స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ కన్సల్టెంట్‌గా 10 సంవత్సరాల అనుభవం ఉంది. కానీ వీటికి భిన్నంగా, ప్రత్యేకంగా నిలవాలని భావించారు. వృత్తి జీవితంలో ఎదురైన సవాళ్లతోపాటు, వ్యాపార కుటుంబం నుండి వచ్చిన స్నేహ తానే ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. జోలో స్టే (ZoloStay) అనే సంస్థను స్థాపించారు. అయితే దీని వెనుక పెద్ద కథేఉంది. స్నేహ సోదరి ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లినపుడు వర్కింగ్ విమెన్ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ వసతులు వెతుక్కోవడంలో కొన్ని సవాళ్లు ఎదురైనాయి. వాటి తీరుపై ఒక అవగాహన వచ్చింది. వీటితోపాటు ఆల్‌లైన్ ద్వారా ఆయా సేవలను చేరుకోవడం ఎలా అనే దానిపై ఎదురైన ఇబ్బందులే దీనికి నాంది పలికాయి.
‘‘నిజాయితీగా ఉండటం అనేది సాధికారతకు కీలకమైన అంశం. ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల్లో తప్పులను ఎత్తి చూపడం కంటే వారితో మాట్లాడుతూ, దాన్నుంచి నేర్చుకోవాలి. సహోద్యోగులతో అభిప్రాయాలను పంచుకోవడం అంటే వృత్తిపరమైన అభివృద్ధిని మెరుగుపరచే మార్గాల అన్వేషణే’’- స్నేహ చౌదరి .
అలా మహిళలకు ఫుడ్ అండ్ వసతికి సంబంధించిన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ జో స్టేస్‌ను ప్రారంభించారు. రుచికరమైన , ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, సరసమైన ధరలో, సౌకర్యవంతైన సరసమైన వసతిని అందించే లక్ష్యంతో, ఇషా చౌల్క్దహరి, డా. నిఖిల్ సిక్రి, అఖిల్ సిక్రి భాగస్వామ్యంతో 2015లో జోలో స్టేకు శ్రీకారం చుట్టారు. 40 మంది మహిళల సమక్షంలో అధికారికంగా ప్రారంభమై, అంచెలంచెలుగా విస్తరించి కో-లివింగ్ స్పేస్ బ్రాండ్‌గా ఖ్యాతి గడించింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా గురుగ్రామ్, హైదరాబాద్, కోటా, చెన్నై, ముంబైతో సహా భారతదేశంలోని 10+ నగరాల్లో విశేష సేవలందిస్తోంది. రూ.800 కోట్లకు పైగా టర్నోవర్‌తో ప్రస్తుతం జోస్టేస్ అతిపెద్ద కో-లివింగ్ స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది.
అటు స్నేహ కూడా దేశంలోని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరిగా అవతరించారు. అలాగే డెవిల్ ఈజ్ ఇన్ డిటైల్ మాటకు నిలువెత్తు సాక్ష్యంగా edtech స్టార్టప్‌ను కూడా స్థాపించారు. దృఢ సంకల్పం , కృషి ఉంటే సాధించలేదని ఏమీలేదు అంటారు స్నేహ. అంతేకాదు కమ్యూనిటీ క్రియేషన్ ఆలోచనను ప్రోత్సహిస్తూ వీరి హాస్టల్స్‌లో ఉండే వారి మధ్య ,జోలో ప్రీమియర్ లీగ్ ద్వారా చెస్,క్యారమ్ ఛాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తుంది. ఇంకా పుట్టినరోజులు, పండుగలు ,ఇంటిరీయర్ డెకరేషన్, హౌస్ కీపింగ్, రిపేర్లు, మెయింటెనెన్స్, ఫుడ్ సర్వీస్, వైఫై, DTH వంటి సర్వీసులు కూడా అందిస్తుంది. లాక్-ఇన్లు, డిపాజిట్లు, బ్రోకరేజీలు లాంటి సమస్యలేవీ జోలో ఉండవు. అంతా ఆన్లైనే.
‘జోలో దియా’ ఆవిష్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 'మహిళల్లో పెట్టుబడి పెట్టండి: ప్రగతిని వేగవంతం చేయండి',థీమ్ ఆధారంగా పూర్తిగా మహిళలచే నిర్వహించే ఒక పీజీ జోలోదియాను స్టార్ట్ చేసింది. మహిళలు తమ కలలు , ఆకాంక్షలను నిర్భయంగా కొనసాగిస్తూ, సాధికారత సాగిస్తారనే తమ నమ్మకానికి జోలో దియా నిదర్శనంగా నిలుస్తోందని జోలోస్టేస్ సహ వ్యవస్థాపకురాలు స్నేహా చౌదరి పేర్కొన్నారు.
2015లో కేవలం నెలకు రూ. 5000 ప్రారంభమై బెంగళూరు, హైదరాబాద్, అత్యంత ఖరీదైన ఏరియాలో కార్ పార్కింగ్, రూఫ్‌టాప్ రెస్టారెంట్ ,జిమ్ లాంటి సౌకర్యాలతో ఉండే ప్రైవేట్ గదులు నెలకు రూ. 36వేలకు చార్జ్ చేసే స్థాయికి చేరింది.