లక్ష మందితో జనగామ జనగర్జన
జనగామ : జనగామ జిల్లా సాధనే లక్ష్యంగా ప్రజ లను మరితం చైతన్యవంతం చేస్తూ, ప్రభుత్వా న్ని మేలుకొలిపే విధంగా జనగామలో జనగర్జన సభ నిర్వహిస్తామని జేఏసీ చైర్మను ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని జూబ్లీగార్డెనులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి జిల్లా ఉద్యమం వరకు ప్రాణాలర్పించిన ఉద్యమకారులను స్మరిస్తూ మైదానానికి అమరుల ప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. 20వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. లక్ష మంది జనంతో నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు ఆరు రోజులపాటు నిర్వహించే కార్యాచరణ రూపొం దించామన్నారు. మానవహారాలు, బైక్ ర్యాలీలు, ఇంటిట ప్రచారం, డప్పుచాటింపు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని అన్నారు. మండల, గ్రామ స్థాయి జేఏసీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాలను భాగస్వాములను చేసుకోవాలని సూచించారు. 14న జనగామలో పది వేల మందితో మానవహారం, 16న పట్టణం నుంచి రెండు రూట్లలో 400 బైక్‌లతో గ్రామ గ్రామాన పర్యటిస్తామన్నారు. ప్రజలనుంచి అభ్యంతరాలు స్వీకరించిన ఆయా గ్రామాల జేఏసీలు బైక్‌ర్యాలీగా వచ్చిన ప్రతినిధులకు వాటిని అప్పగించాలని సూచించారు. అదేరోజు అన్ని గ్రామాల్లో ఇంటిటికీ బొట్టు పెట్టి జనగర్జన సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నా రు. 19న డప్పు చాటింపుతో ప్రచారం చేస్తామన్నారు.
నెహ్రూ పార్కు మీదుగా భారీ ర్యాలీ
జనగర్జన సభ ప్రారంభానికి ముందు కళాకారుల నృత్యాలు, వేషధారణలతో భారీ ర్యాలీ, ప్రదర్శనగా అమరవీరుల ప్రాంగణం వద్దకు చేరుకుంటామన్నారు. జనగామకు మద్దతుగా వచ్చిన అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు అ న్ని వర్గాల వారికి ఆహ్వానం పంపిస్తామన్నారు. సీతారాంపురం, కడవెండి, బైరానుపల్లి మీదుగా వచ్చే అమరుల జ్యోతి ర్యాలీ 10 గంటల వరకు చేరుకుంటుదని వివరించారు. జనగర్జనతో ప్రభుత్వంలో కదిలిక వచ్చేలా చేసే బాధ్యత ప్రజలపై ఉందని, డివిజనులోని అన్ని ప్రాంతాల నుంచి పిల్లా, పాపలతో కలిసి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఆ¯ŒSలైన్లో సిద్దిపేట జిల్లాపై వచ్చే ఫిర్యాదులను తొలగిస్తున్నారని అనుమానంగా ఉందని, ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రి వద్దు, జనగామ జిల్లా కావాలని ఇప్పటి వరకు ఆ¯ŒSలై¯ŒSలో పదివేల అభ్యం తరాలు రాగా, లిఖిత పూర్వకంగా మరో 50వేల ఫిర్యాదులు వెళ్లినట్లు వివరించారు.
జేఏసీ నాయకులు ఆకుల వేణుగోపాల్‌రావు, మేడ శ్రీను, మంగళ్లపల్లి రాజు, ఆలేటి సిద్దిరాములు, ధర్మపురి శ్రీనివాస్, పిట్టల సురేష్, తిప్పారపు విజయ్, బొట్ల శేఖర్, జి.కృష్ణ తది తరులు ఉన్నారు.