బోల్తాపడిన చేపల లారీ, ఒకరి మృతి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకువీడు మండలం పెదకాపవరం సమీపంలో గురువారం ఉదయం ఓ చేపల లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.