540 కేజీల గంజాయి పట్టివేత
సారా బట్టీల ధ్వంసానికి వెళ్లిన మహిళల కంటపడిన గంజాయి
ఎక్సైజ్ అధికారులకు అప్పగింత
సాహస చర్యకు అభినందనలు
శంఖవరం :
శంఖవరం మండలం పెదమల్లాపురం సమీప గ్రామ రహదారి పక్క పొదల్లో స్మగ్లర్లు రవాణాకు సిద్ధం చేసిన 540 కేజీల గంజాయి మూటల్ని గిరిజన మహిళలు గుర్తించి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించిన ఘటన ఇది. పెదమల్లాపురం పరిసర గ్రామాల్లో నాటుసారా తయారీని అరికట్టేందుకు గిరిజన మహిళలు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా చేతికర్రలు పట్టుకుని తయారీ కేంద్రాలపై దాడులు చేస్తూ మంగళవారం రాత్రి వేళంగి శివారు డి మల్లాపురం, పోలవరం గ్రామాల మధ్య పొలాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో రహదారి పక్కన తుప్ప ల్లో దాచిన 18 గంజాయి మూటలు వీరి కంట పడ్డాయి. ఒక్కో బస్తాలో 30 కేజీల గంజాయి ఉంది. వాటిని మోసుకొచ్చి పెదమల్లాపురం పంచాయతీ కార్యాలయం లో భద్రపరిచి కాపలాగా ఉన్నారు. ఉదయాన్నే అధికారులకు, పాత్రికేయులకు సమాచారం అందించారు. ఎక్సైజ్ ఎస్పీ కార్యాలయ సీఐ జీవీ లక్ష్మి,, ప్రత్తిపాడు ఎక్సైజ్ ఎస్ఐ నజాముద్దీన్, స్పెషల్ టీమ్ ఎస్.ఐ. బి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలోని సిబ్బంది పంచాయతీ కార్యాలయానికి వచ్చి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీ నుంచి మూటలు కట్టించి కొండల మీదుగా ఇక్కడికి తీసుకొచ్చి ప్రత్యేక వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ నజాముద్దీ¯ŒS అన్నారు. అక్కడ కేజీ రూ.2,500లకు కొనుగోలు చేస్తారని, బయటి ప్రాంతాలకు వెళ్లి దీన్ని రూ.10 వేలకు అమ్ముకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని వివరించారు. గంజాయిని¬ పట్టుకుని అప్పగించినవారిలో గిరిజన మహిళలు కించు అప్పయమ్మ, జర్తా సరస్వతి, బోడోజు లక్ష్మి, మాడెం కామయమ్మ, తొంటా బోడమ్మ, బూసరి గొంతమ్మ తదితరులున్నారు. వీరిని ఎక్సైజ్ అధికారులు అభినందించారు.