pedatadepalli
-
మేకల సంతలో ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపలి్లలోని మేకల సంత వివాదం కొలిక్కి రాలేదు. సోమవారం వేకువజామున సంత వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గొర్రెలు, మేకల వర్తక సంఘం, శ్రీ సాయి వర్తక సంఘ సభ్యులతోపాటు బీజేపీ, టీడీపీ వర్గీయులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో వివాదం తారస్థాయికి చేరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంత ప్రాంతంలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిగూడెం, నల్లజర్ల వైపు నుంచి వచ్చే వాహన చోదకులు, ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారనే విషయాలను పోలీసులు ఆరా తీశారు. సోమవారం వేకువజామున మేకల కొనుగోలుదారులను మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతించారు. మిగిలిన వారిని లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఆ ప్రాంతానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లగా, అప్పటికే అక్కడ మాటువేసిన టీడీపీ వర్గీయులు వందలాదిగా సంత వద్దకు చేరుకున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐలు ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, జి.మధుబాబు, చింతా రాంబాబు, దుర్గాప్రసాద్, ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, వి.చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఇరువర్గాలను నిలువరించారు. వేకువజామున 4 గంటలకు ప్రారంభమైన తోపులాట ఉదయం 8 గంటల వరకూ కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. కాగా, డీఎల్పీఓ ఆదేశాల మేరకు సంత వద్ద ఆశీలు వసూళ్లను నిలుపుదల చేశారు. -

డివైడర్‌ను ఢీకొని అంబులెన్స్ దగ్ధం
తాడేపల్లిగూడెం రూరల్ : ఎదురుగా వస్తున్న మోటార్‌సైక్లిస్ట్‌ను తప్పించబోయి ఓ అంబులెన్స్ డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు ఎగిశాయి. మండలంలోని పెదతాడేపల్లి జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఈ ఘటనలో అంబులెన్స్ దగ్ధమైంది. తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళాధికారి వి.సుబ్బారావు కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన ఎస్కేఎస్ అంబులెన్స్ సర్వీస్ వాహనం ఓ రోగిని తీసుకుని తణుకు వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొంది. ఆ సమయంలో అంబులెన్స్‌లో డ్రైవర్ ఎస్కే షఫీవుల్లా, రోగి, అతని బంధువులు ఇద్దరు ఉన్నారు. డివైడర్‌ను ఢీకొన్న వెంటనే మంటలు రావడాన్ని గమనించిన అబులెన్స్ డ్రైవర్ రోగిని, అతని బంధువులను దించేశారు. ఆతర్వాత అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. ఆ తర్వాత రోగిని తణుకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్టు అగ్నిమాపక దళాధికారి వి.సుబ్బారావు తెలిపారు. -
ప్రేమ వ్యవహారమే..ప్రాణం తీసిందా?
పెదనడిపల్లి (చీపురుపల్లి రూరల్), న్యూస్‌లైన్: తల్లిదండ్రుల చెంత గారాబంగా పెరగాల్సిన ఓ యువతి అనుమానాస్పద స్థితి లో విగతజీవిగా కనిపించింది. ప్రేమ వ్యవహారమే ఆ యువతి ప్రాణం తీసి ఉంటుం దని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీపురుపల్లి మండలం పెదనడిపల్లి గ్రామానికి చెందిన యువతి గండమాన చినమల్లి(18) గ్రామ సమీపంలోని ఒక గనిబంటాలో అనుమానాస్పదస్థితిలో ఆదివారం శవమై తేలింది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల మేరకు..గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెం దిన చినమల్లి రెండు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయింది. రెండు రోజులుగా కూతురు కనిపించకపోవడంతో తండ్రి చిన్నయ్య వెతకడం ప్రారంభించాడు. గామంలో తమకు తెలిసిన వారిని, సమీప పంటపొలాల్లో బంధువుల ఇళ్లలో వెతకసాగాడు. అయినప్పటికీ కూతురి ఆచూకీ తెలియరాలేదు. ఈ విధంగా వెతుకుతుండగా ఆదివారం ఉదయం 6గంటల సమీపంలో గని బంటాలో కుమార్తె మృతదేహం తేలిఉంది. ఈ విషయంపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో చీపురుపల్లి ఎస్ఐ షేక్అబ్దుల్మరూఫ్, ఏఎస్ఐ పాపారావు,ఆర్ఐ హైమావతిలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ఒక నాయకుడి కుమారుడితో చినమల్లికి ప్రేమవ్యవహారం ఉన్నట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కూతురు ఎంత వెదికినా దొరకలేదని చివరకు గనిబంటాలో శవమై తేలిందని మృతురాలి తండ్రి రోదిస్తున్నాడు. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి చిన్నయ్య తన కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.