డివైడర్‌ను ఢీకొని అంబులెన్స్ దగ్ధం
Published Wed, Dec 7 2016 12:39 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
తాడేపల్లిగూడెం రూరల్ : ఎదురుగా వస్తున్న మోటార్‌సైక్లిస్ట్‌ను తప్పించబోయి ఓ అంబులెన్స్ డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు ఎగిశాయి. మండలంలోని పెదతాడేపల్లి జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఈ ఘటనలో అంబులెన్స్ దగ్ధమైంది. తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళాధికారి వి.సుబ్బారావు కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన ఎస్‌కేఎస్ అంబులెన్స్ సర్వీస్ వాహనం ఓ రోగిని తీసుకుని తణుకు వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొంది. ఆ సమయంలో అంబులెన్స్‌లో డ్రైవర్ ఎస్‌కే షఫీవుల్లా, రోగి, అతని బంధువులు ఇద్దరు ఉన్నారు. డివైడర్‌ను ఢీకొన్న వెంటనే మంటలు రావడాన్ని గమనించిన అబులెన్స్ డ్రైవర్ రోగిని, అతని బంధువులను దించేశారు. ఆతర్వాత అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. ఆ తర్వాత రోగిని తణుకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్టు అగ్నిమాపక దళాధికారి వి.సుబ్బారావు తెలిపారు.
Advertisement
Advertisement