ఆ ఎస్ఐ తీరుపై సర్వత్రా విమర్శలు
పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళా ఎమ్మార్వో వనజాక్షి పై పెదవేగి పోలీస్ స్టేషన్లో డ్వాక్రా మహిళలు ఇంతకు ముందు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నమోదైన ఫిర్యాదును ఎస్ఐ ముసునూరు పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఆ ఎస్ఐ వ్యవహార శైలిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.