పేదల సంక్షేమమే ఏకైక లక్ష్యం
పెద్దశంకరంపేట, న్యూస్‌లైన్: పేదల సంక్షేమమే వైఎస్సార్ సీపీ ఏకైక లక్ష్యమని, ఇందుకు తమ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోనే నిదర్శనమని ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మహ్మద్ మొహియొద్దీన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పారావు షె ట్కార్ పేర్కొన్నారు. గురువారం వారు పెద్దశంకరంపేటలో ఇంటింటా ప్రచా రం నిర్వహించారు. అనంతరం స్థానిక భగత్‌సింగ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉ న్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు నేడు అమలు కాలేదన్నారు. రాజన్న మరణం తరువాత ఆ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే నాయకుడే కరువయ్యారని పేర్కొన్నారు. పథకాల అమలు సత్తా ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని వారు పేర్కొన్నారు. తమ పార్టీ రూపొందిం చిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోందని వారు తెలిపారు. 108, 104 వైద్య సేవలను మరింత మె రుగు పరచడానికి కొత్తగా 101, 102 సేవలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామ ని వైఎస్ జగన్ ప్రకటించారని ప్రజలకు వివరించారు. అలాగే రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున, ఉచిత విద్యుత్, ఏడాదికి 12 సిలిండర్లు, ప్రతి సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ, వికలాంగులకు రూ. వెయ్యి, వృద్ధులకు రూ. 700 పింఛను, డ్వాక్రా రుణాల మాఫీ, అమ్మ ఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే వారినే గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ స్వాతీసత్యనారాయణ పాల్గొన్నారు.