పోలీసులను చూసి పెళ్లికొడుకు జంప్
విశాఖపట్నం: విశాఖపట్నం పెదవాల్తేరు ప్రాంతంలో గురువారం బాల్యవివాహం జరిగింది. ఈ బాల్య వివాహంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. అంతలోనే పెళ్లికొడుకు హడావుడిగా మైనర్ బాలికకు తాళికట్టాడు. పోలీసులు చూసి పెళ్లికొడుకు పరారైయ్యాడు. దాంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులతోపాటు పెళ్లికొడుకు తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు తరలించి... విచారిస్తున్నారు.