బాధ్యతలు చేపట్టిన పెద్ది సుదర్శన్‌రెడ్డి
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌కు మంత్రుల శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకుని కష్టనష్టాల్లో పనిచేసిన ప్రతీ ఉద్యమకారుడిని, కార్యకర్తను గుర్తుపెట్టుకుని సీఎం కేసీఆర్ అవకాశాలు కల్పిస్తున్నారని పలువురు మంత్రులు పేర్కొన్నారు. వరంగల్‌కు చెందిన పార్టీ సీనియర్‌నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి శనివారం రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించిన వారికి సీఎం సముచిత స్థానం కల్పిస్తున్నారని, అందులో భాగంగానే సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డికి కీలకమైన పదవి లభించిందని, దీంతో సీఎం కేసీఆర్ ఉద్యమ నేతలకు సరైన గుర్తింపు ఇస్తారన్న సంగతిని రుజువు చేశారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ఆశించిన స్థాయిలో సంస్థను తీర్చి దిద్దాలని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, నిబద్దతతో పనిచేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచిం చారు.
ఉద్యమకారులను గుర్తుపెట్టుకుని సముచితస్థానం కల్పించడం ఆనందం కలిగిస్తోందని, మొదటి నుంచీ పనిచేసిన వారికి తప్పక అవకాశాలు వస్తాయని ఎంపీ కవిత అన్నారు. డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, చందూలాల్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు బి.వినోద్‌కుమార్, సుమన్, సీతారాంనాయక్, సివిల్ సప్లైస్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.