pellakuru srinivasulu reddy
-
‘బ్యాలెట్లో నాపేరే ఉంటుంది.. బాబు హామీ ఇచ్చారు’
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని కోవూరు నియోజకవర్గం టీడీపీలో తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కంటే తానే మంచి అభ్యర్థి అవుతానని టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే తనకు హామీ ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బ్యాలెట్లో తన పేరే ఉంటుందని.. కాబట్టి ఈరోజు నుంచే కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. కాగా ఈ విషయంపై పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఏవిధంగా స్పందిస్తారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలంరెడ్డి వర్సెస్ పెళ్లకూరు మంత్రి సోమిరెడ్డి అనుచరుడిగా 2012లో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేశారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటంతో పార్టీ కోసం పనిచేశారు. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోలంరెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ కానీ రాష్ట్రస్థాయి నామినేట్ పదవి కానీ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పోలంరెడ్డి ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఖర్చు పెట్టడంతో పాటు తిరిగి ప్రచారం చేశారు. చివరికి పోలంరెడ్డి గెలిచిన 48 గంటల్లోనే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకానొక సమయంలో.. పెళ్లకూరు దత్తత గ్రామంలో కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవటం, మినీమహానాడుకు కూడా కనీస ఆహ్వానం అందని పరిస్థితి ఏర్పడటంతో పెళ్లకూరు శ్రీనివాసులు అసమ్మతితో రగిలిపోయారు. ఈ క్రమంలో ఆయన ఈ విధంగా ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. -
తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతి భగ్గుముంటుంది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి, అధికార పార్టీలో కొనసాగుతున్న నేతలు అంతా ఒక్కొక్కరుగా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు వ్యక్తిగత లాభాలే ఏజెండాగా పనిచేస్తూ కార్యకర్తలను కనీసం పట్టించుకోకపోవడం లేదు. రూ.కోట్లు ఖర్చు పెట్టి పనిచేసిన నేతలకు సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చినా ఒక్కటీ నిలుపుకోకపోవటం, అధిష్టానాన్ని అనేక పర్యాయాలు కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవటంతో మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తిరుగుబాటు బాటలో పయనించనున్నారు. అదే తరహాలో కోవూరులో అధికార పార్టీ నేతగా ఉన్న పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి రాజీనామాకు సిద్ధం కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో హవా సాగిస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి ముఖ్య అనుచరుడు కావటంతో పార్టీలో ఏం జరగుతుందోననేది హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లా టీడీపీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. జిల్లాలో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది నేతలు అందరు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబునాయుడు క్లాస్‌లు ఇచ్చినా జిల్లా నేతలు పట్టించుకోవటం లేదు. పార్టీ అంతర్గత వేదికలు, ఇతర సభలో నేతల మధ్య గ్రూపు, గొడవలు హాట్‌టాపిక్ అవుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో ఇవి మరింత ముదిరి పాకనా పడ్డాయి. ప్రధానంగా నియోజకవర్గ మహానాడులు, జిల్లా మహానాడులో విభేదాలు సృష్టంగా కనిపించాయి. నెల్లూరు పార్లమెంట్, కోవూరు వెంకటగిరి, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాల్లో కొందరు నేతలు ముఖం చాటేయగా మరికొందరికి ఆహ్వానం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇక ఆత్మకూరు ఇన్చార్జి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అయితే నేరుగా ప్రజాప్రతినిధుల తీరును, వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎర్రచందనం నుంచి ఇసుక వరకు అక్రమ రవాణాలో కీలకంగా మనమే ఉన్నామని అందరూ విమర్శిస్తున్నా ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి సోమిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీని కొనసాగింపుగా నెల్లూరురూరల్లో జరిగిన మినీమహానాడులోనూ ముఖ్య నేతల తీరుపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాగా, మరో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి సున్నిత విమర్శలు చేశారు. ఆనం వ్యాఖ్యలు తదనంతరం పరిణమాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నట్లు బలంగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఆనం బాటలో కోవూరు టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి కూడా పయనిస్తున్నారు. పోలంరెడ్డి వర్సెస్ పెళ్లకూరు మంత్రి సోమిరెడ్డి అనుచరుడిగా 2012లో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేశారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటంతో పార్టీ కోసం పనిచేశారు. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోలంరెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ కానీ రాష్ట్రస్థాయి నామినేట్ పదవి కానీ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పోలంరెడ్డి ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఖర్చు పెట్టడంతో పాటు తిరిగి ప్రచారం చేశారు. చివరికి పోలంరెడ్డి గెలిచిన 48 గంటల్లోనే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పెళ్లకూరు దత్తత గ్రామంలో కార్యక్రమాలకు అయన్ను ఆహ్వానించకపోవటం, మినీమహానాడుకు కూడా కనీస ఆహ్వానం అందని పరిస్థితి. జిల్లా నేతకే ఇలాంటి పరిస్థితి ఉంటే పార్టీలో కార్యకర్తల పరిస్థితి ఏంటనేది చర్చ కొనసాగింది. సీఎం చంద్రబాబునాయుడు నియోజకవర్గాల సమీక్షలో ఎమ్మెల్యే పోలంరెడ్డికి క్లాస్ తీసుకున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో వైపు రెండు పర్యాయాలు పెళ్లకూరు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. గత ఏడాది మంత్రి అమరనాథ్‌రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌తో లేఖ రాయటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర నియామకం కూడా కొంత కాలం పెండింగ్‌లో పడింది. దీంతో పెళ్లకూరు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్య వైరం పెరిగింది. ప్రతి పరి ణామం మంత్రికి తెలుస్తున్నా ఆయన కూడా సరైన రీతిలో స్పందించకపోవటంతో ఇక పార్టీ వీడటమే సరైన చర్య అని నిర్ణయించుకున్నారు. వచ్చే వారంలో శ్రీనివాసులురెడ్డి ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి పార్టీ మారనున్నట్లు సమాచారం. -
ఏం చేద్దాం ?
►తిరుగుబాట్లతో టీడీపీ నేతలకు చెమటలు ►ఓడిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు వార్నింగ్ ►కోవూరు బాధ్యతలు తీసుకోవాలని పెళ్లకూరుపై ఒత్తిడి ►ఇంతకాలం గుర్తుకు రాలేదా? అని ఇరాన్ పర్యటనకు వెళుతున్న పెళ్లకూరు ►కోవూరు బాధ్యతలు తీసుకోవడానికి సోమిరెడ్డి, ఆదాల వెనకడుగు ►పోలీసులతో టీడీపీ నేతల అవతారం ఎత్తించిన నాయకులు ►తప్పుడు ఫిర్యాదులతో వైసీపీ నేతల మీద అక్రమ కేసులు ►కామిరెడ్డి, రఫీ ఇళ్ల మీదకు పోలీసులను ఉసిగొల్పిన టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి – నెల్లూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోవూరు, సూళ్లూరుపేట నియోజక వర్గాల్లో చెలరేగిన తిరుగు బాట్లను ఎలా కట్టడి చేయాలని తెలుగు దేశం పార్టీ ముఖ్యులు కిందా మీదా పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఓటర్లను తన్నుకుపోవాలని వేసిన ఉపాయం తిరగబడి తమ ఓటర్లే తరలి పోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఓటర్లు జారు కోకుండా చూసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. కోవూరులో మరింత నష్టం జరక్కుండా రంగంలోకి దిగాలని పార్టీ సీనియర్ నాయకుడు పెళ్లకూరు శ్రీని వాసులురెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకు ససేమిరా అంటూ ఆయన ఇరాన్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసు కున్నారు. వాకాటి నారాయణరెడ్డి సొంత నియోజకవర్గం సూళ్లూరుపేటలో సైతం తిరుగుబాట్లు ప్రారంభం కావడం అ«ధి కార పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన మూడేళ్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్లకు విలువే లేకుండా పోయింది. వారి పరిధిలో వృద్ధాప్య ఫించన్ ఇప్పించు కోవాలనుకున్నా జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు. నీరు–చెట్టు, రోడ్లు లాంటి ఏ పనులు చేపట్టినా వీరికి ప్రాధాన్యత లేకుండా చేశారు. పైపెచ్చు పార్టీలో సైతం వలస నాయకులకే పదవులు కట్టబెడుతూ వస్తున్నారు. ఈ పరిణామాలతో మనసు లోనే ఆందోళనతో ఉన్న ఎంపీటీసీలు ఆత్మాభిమానం జెండా పైకెత్తారు. మాకు విలువ లేనప్పుడు ఎవరైతే మాకేంటి అనే నిర్ణయానికి వచ్చారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగుర వేసిన ఎంపీటీసీలు టీడీపీతో తాడో పేడో తేల్చుకోవడానికి వైఎస్సార్ సీపీలో చేరా రు. ఈ తిరుగుబాటు సూళ్లూరుపేటకు సోకింది. మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవరావు, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు బీద రవిచంద్రకు ఎన్నికల బాధ్యత అప్ప గించిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాలపై సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల సీటు ఓడిపోతే తీవ్ర పరిణామాలుంటాయని వారిని హెచ్చరిం చారు. ఏం చేసైనాసరే ఎన్నికల్లో గెలవాలని, అధికార యంత్రాంగాన్నీ వాడుకోవాలని ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా మంత్రి నారాయణతో పాటు పార్టీ ముఖ్య నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద రవిచంద్ర నష్ట నివారణకు చర్చల మీద చర్చలు జరుపుతూ నేరుగా రంగంలోకి దిగారు. పెళ్లకూరుకు ఆహ్వానం కోవూరు నియోజకవర్గంలో పరిస్థితి సర్దుబాటు చేయడానికి బాధ్యతలు తీసుకోవాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర పార్టీ సీనియర్ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మీద ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వారా కూడా చెప్పించారు. పార్టీ అధిష్టానంతో పాటు, జిల్లా పార్టీ ముఖ్యుల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. అంతా అయిపోయాక తాను వెళ్లి ఏం చేయాలని ఆయన సైతం ససేమిరా అంటున్నారు. పార్టీ ముఖ్యుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఒకటి, రెండు రోజుల్లో ఇరాన్‌కు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల బాధ్యతను సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లేదా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అప్పగించేందుకు పార్టీ హై కమాండ్ యోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బాధ్యతలు తీసుకోవడానికి వారు కూడా వెనకడుగు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పోలీసులను ప్రయోగిద్దాం టీడీపీ ఓటర్లు ఎవరూ వైఎస్సార్సీపీ వైపు వెళ్లకుండా చేయడానికి అనుమానం ఉన్న వారి మీద పోలీసు బలం ప్రయోగించాలని టీడీపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. దీంతో పాటు వైఎస్సార్ సీపీకి ఓటర్లు, ఆ పార్టీకి మద్దతు తెలిపే టీడీపీ ఓటర్లను కట్టడి చేయడానికి పోలీసు అధికారులను నేరుగా రంగంలోకి దించాలని తీర్మానించారు. వైఎస్సార్ సీపీ నేతల మీద తమ వారితో తప్పుడు ఫిర్యాదులు చేయించి వారి మీద తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించే కుట్రలు పోలీసులతోనే అమలు చేయించే ఎత్తుగడకు తెరలేపారు. ఈ ఎత్తుగడలో తొలి భాగంగా గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు, సూళ్లూరుపేట సీఐ రత్తయ్యను శుక్రవారం రంగంలోకి దించారు. నాయుడు పేట మండలం విన్నమాల ఎంపీసీటీ కుంజేటి రమణమ్మ చేత వైఎస్సార్ సీపీ నేతలు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, షేక్ రఫీ, చంద్రారెడ్డితో పాటు మరింత మంది మీద గురువారం పోలీసులకు రాత్రి ఫిర్యాదు చేయించారు. కేసు నమోదైందే తడవుగా శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు వీరి ఇళ్లను చుట్టుముట్టి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. వారికి వార్నింగ్‌లు కూడా ఇచ్చి అధికార పార్టీ పట్ల తమ భక్తిని చాటుకున్నారు. చిట్టమూరు మండలం మల్లాంకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీటీసీలు స్వచ్చందంగా వైఎస్సార్ సీపీకి మద్దతు తెలిపినా వారిని బలవంతంగా తీసుకుని వెళ్లి టీడీపీ నేతలకు అప్పగించారు. పో లింగ్‌కు సమయం దగ్గర పడే కొద్దీ పోలీసు బలప్రయోగం పెంచేందుకు టీడీపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు.