మా పేద కళాకారులకు పింఛన్
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’(మా) లోని పేద కళాకారులకు పింఛన్ ఇచ్చేందుకు, ‘మా’ సొంత భవనం ఏర్పాటుకు, పేద కళాకారులకు ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ‘మా’ సభ్యులను సీఎం కేసీఆర్‌తో మాట్లాడిస్తా’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.
ఇటీవల ‘మా’ అధ్యక్షులుగా శివాజీరాజా, జనరల్ సెక్రటరీగా నరేశ్‌లను ‘మా’ సభ్యులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. శుక్రవారం తలసానిని కలిసి, అభినందనలు అందుకున్నా రు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరి నారాయణ రావుని శివాజీరాజా, నరేశ్, సురేష్ కొండేటిలు పరామర్శించారు. ‘మా’ అధ్యక్షుడిగా శివాజీరాజా, జనరల్ సెక్రటరీగా నరేశ్‌లను ముందు ప్రతిపాదించింది దాసరి నారాయణరావే. ఆయన దగ్గర ఈ ఇద్దరూ ఆశీస్సులు తీసుకున్నారు.