pension Survey
-
మళ్లీ పెన్షన్ సర్వే!
జోగిపేట: నగర పంచాయతీ పరిధిలో పెన్షన్ అర్హుల ఎంపిక సక్రమంగా జరుగలేదని తేలడంతో మళ్లీ వారం రోజుల్లో మండల స్థాయి అధికారులతో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని అందోలు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాష తెలిపారు. శుక్రవారం జోగిపేటలోని తహిశీల్దారు కార్యాలయంలో పెన్షన్‌కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందిని అర్హులుగా గుర్తించారు? లబ్ధిదారుల ఎంపిక ఎలా జరిగిందని స్పెషల్ ఆఫీసర్ నగర పంచాయతీ కమిషనర్ విజయలక్ష్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆమెపై యాస్మిన్‌బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పంచాయతీలో 2408 మంది పెన్షన్‌కు అర్హతలేని వారు దరఖాస్తు చేసుకున్నారు. 175 దరఖాస్తులు తొలగించారు. కాగా 2233 దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా 1382 మందిని ఇప్పటి వరకు ఎంపిక చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా 900 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 98 శాతం అర్హులు ఎలా వచ్చారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం కొన్ని గైడ్‌లై న్స్ ఇచ్చిందని, వాటిని ఏమీ పట్టించుకోకుండా అర్హులను గుర్తించినట్లు తెలుస్తుందన్నారు. పెన్షన్ దారులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసిందో అప్పటి నుంచి పెన్షన్ డబ్బులు చెల్లిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పెన్షన్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు తనను పంపించారని, కలెక్టర్‌కు పూర్తి నివేదికను అందజేసి ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
చిరు ఆసరాపై పెనుగాభరా
- పింఛన్ సర్వే కేంద్రాలకు ఎగబడ్డ లబ్ధిదారులు - భారీవర్షంలోనూ వృద్ధులు, వికలాంగుల ఉరుకులు - తొలిరోజు జరిగింది 25 శాతం పరిశీలనే - అస్తవ్యస్తంగా, హడావుడిగా సాగిన ప్రక్రియ - ఎన్నడో ‘చెరిగిన బొటు’కు సర్టిఫికెట్ అడగడంతో - కలత చెందుతున్న వితంతువులు సాక్షి, రాజమండ్రి / మండపేట : పూలవాన కురిపిస్తామని బులిపించి, అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు సర్కారు.. అనంతరం బడుగుల బతుకుల్లో పిడుగులు కురిపిస్తోంది. మాఫీ మాయ నాటకంలో రోజుకో ఆటంకపు అంకాన్ని రచిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పింఛన్ల మొత్తం పెంపు వాగ్దానం అమలుకు ముందు అసలుకే ఎసరు పెట్టే తంతును మొదలు పెట్టింది. బతుకు పడమటి పొద్దున పండుటాకులకు, విధి వెక్కిరించిన వికలాంగులకు, వితంతువులకు పీడకలలా పింఛన్ల సర్వేను ప్రారంభించింది. సకాలంలో వెళ్లి తమ పత్రాలు చూపకపోతే గోరంత ఆసరాను ఎక్కడ రద్దు చేస్తారోనన్న కొండంత ఆందోళనతో.. పింఛన్‌దారులు కుండపోతగా వాన కురుస్తున్నా సర్వే జరుగుతున్న తావులకు ఉరుకులు, పరుగులు పెట్టారు. తాము పింఛన్లకు అర్హులమన్న రుజువులు చూపించేందుకు ఎగబడ్డారు. గుండెలు గుబగుబలాడుతుండగా.. ప్రభుత్వం తలపెట్టిన పింఛన్ల సర్వే శుక్రవారం జిల్లాలో ప్రారంభమైనా కొన్నిచోట్ల అపశ్రుతులు ఎదురవడంతో వాయిదా పడింది. అనర్హుల పేరిట పింఛన్‌దారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం వేసిన ఈ ఎత్తుగడ లబ్ధిదారుల గుండెల్లో ముందే గుబులు రేపగా.. ఓ ప్రామాణికత లేకుండా సాగిన సర్వే వారిని ఏమవుతుందోనన్న దిగులులోకి నెట్టింది. తొలిరోజు జిల్లాలో సుమారు 25 శాతం మాత్రమే సర్వే జరిగిందని అంచనా. రాజమండ్రి, కాకినాడ నగర పాలక సంస్థలతో పాటు పలు మున్సిపాలిటీల్లో సాయంత్రం మూడు గంటల వరకూ పింఛనుదారుల డేటా కంప్యూటర్లలోకి ఆన్లైన్ ద్వారా చేరలేదు. సర్వే కేంద్రాల వద్ద ఉదయం నుంచి లబ్ధిదారులు బారులు తీరి, కూడూనీళ్లూ లేకుండా పడిగాపులు పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సాంకేతిక సిబ్బంది చేతులెత్తేయడంతో తొలిరోజు చేయాల్సిన సర్వేను 21కి వాయిదా వేశారు. మామిడికుదురు తదితర మండలాల్లో కూడా డేటా రాక జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పింఛ న్ల అర్హత పత్రాలను తీసుకుని సర్వే కేంద్రాలకు రావాలనడంతో వాటి నకళ్ల కోసం ఉదయం నుంచి జిరాక్సు సెంటర్ల వద్ద పింఛనుదారులు క్యూలు కట్టారు. మండపేట, జగ్గంపేట, పెద్దాపురం, రాజానగరం మండలాల్లోని పలుచోట్ల వర్షంలోనూ పింఛన్‌దారులు బారులు తీరారు. వేర్వేరు జాబితాలు ఎగనామానికేనా..? పరిశీలనలో క్రమపద్ధతి లోపించడంతో ఆ ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. మండపేటలోని కొన్ని వార్డుల్లో పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద సర్వే నిర్వహించారు. ధృవీకరణ పత్రాలను అందజేసిన వారి పేర్లను ఓ జాబితాలో, అవి లేని వారి పేర్లను మరో జాబితాలో నమోదు చేశారు. దీంతో పత్రాలు ఇవ్వని పింఛన్‌దారులు ఏమవుతుందోనని కలత చెందుతున్నారు. సర్వే తీరును బట్టి కూడా పింఛన్లకు పెద్ద సంఖ్యలో ఎగనామం పెట్టే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వితంతు పింఛన్ల లబ్ధిదారులను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. రేషన్, ఆధార్ కార్డులున్నా భర్త మరణ ధృవీకరణ పత్రం అడగడంతో చాలామంది వితంతువులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంటున్నారు. తన భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందాడని, ఇప్పటికిప్పుడు ధృవీకరణ పత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలని ఓ మహిళ వాపోయింది. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి రేషన్, ఆధార్ కార్డుల్లో దేనిలో వయసు ఎక్కువగా ఉంటే దానినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రెండింటిలో వయసు తక్కువగా ఉన్న వృద్ధులు తమ పింఛన్లకు ఎసరు పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 శాతం వరకూ రేషన్ కార్డులకు, ఆధార్ కార్డులకు పొంతన లేకుండా వయసు నమోదు జరిగింది. సర్వేకు దూరంగా టీడీపీ ప్రజాప్రతినిధులు అనర్హత సాకుతో పింఛన్లలో భారీగా కోత పెట్టడమే సర్వే లక్ష్యమన్న ఉద్దేశంతో.. ఆ నింద తమపై పడకుండా పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు సర్వేకు దూరంగా ఉన్నారు. కాగా కమిటీల్లో సామాజిక కార్యకర్తలను తొలగించి అన్ని చోట్లా టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించారు. నియోజక వర్గాల ఎమ్మెల్యేలు నేరుగా పిలిచి ఆదేశాలిస్తుండడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పింఛన్‌దారులకు న్యాయం చేయాలంటే వారి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయాలంటే సర్వే మరో మూడు రోజులైనా కొనసాగించాల్సిన అవసరం ఉందని అధికారులే అంటున్నారు. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట్ల తప్ప ఇతర ప్రాంతాల్లో శనివారంతోనే సర్వే ముగించేయనుండడంతో ఈ హడావుడి వల్ల అర్హులు కూడా పింఛన్లు కోల్పోతామని భయపడుతున్నారు. -
పింఛన్ల సర్వేలో తేడాలొస్తే అధికారులే బాధ్యులు
కలెక్టర్ విజయకుమార్ హెచ్చరిక ఒంగోలు టౌన్ : జిల్లాలో ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే పింఛన్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, సర్వేలో ఏదైనా తేడాలు వస్తే కమిటీలో ఉన్న ప్రభుత్వ అధికారులను బాధ్యులను చేస్తామని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను హెచ్చరించారు. ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇచ్చిన సూచనలు పాటించి సర్వే చేయాలన్నారు. ఎంపికైన కమిటీ సభ్యులకు అవగాహన కల్పించి సర్వే చేయాలని, ఏ ఒక్క అర్హునికి అన్యాయం జరగకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వితంతువులు, వికలాంగులు, చేనేత పింఛన్లలో వయసుతో ఇబ్బంది లేదని, వృద్ధాప్య పింఛన్లతో వయసు నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో సర్వే సమయంలో రేషన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుల్లో ఎందులో ఎక్కువ వయసు ఉంటుందో దాన్ని పరిగణించాలని సూచించారు. పదవీ విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్, అవుట్సోర్సింగ్, నెలసరి జీతం, 2.50 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట ఉన్న వారు, ఆదాయపన్ను చెల్లించేవారు, కారు ఉన్న కుటుంబ యజమాని పింఛన్‌కు అర్హులు కాదని చెప్పారు. సర్వేలో ఎట్టి పరిస్థితుల్లో లోపాలు లేకుండా సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పచ్చని ప్రకాశం కోసం లక్ష మొక్కలు: జెడ్పీ చైర్మన్ పచ్చదనం, పరిశుభ్రతలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వెల్లడించారు. జిల్లాను పచ్చని ప్రకాశంగా తీర్చిదిద్దడంలో ఈ నెల 20వ తేదీన లక్ష మొక్కలను నాటేందుకు నిర్ణయించినందున నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆ రోజున జిల్లావ్యాప్తంగా మొక్కలను నాటాలని ఆదేశించారు. ఈ మొక్కలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఆవరణలో, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో నాటడంతో పాటుగా మొక్కలను నాటేందుకు ముందుకు వచ్చిన వారందరినీ ప్రోత్సహించాలని, మొక్కలను నాటడమే లక్ష్యంగా కాకుండా పూర్తి సంరక్షణను కూడా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాను పరిశుభ్రంగా తయారు చేసేందుకు మండలంలోని 2 గ్రామాలను ఎంపిక చేసి అక్టోబర్ 2వ తేదీ నాటికి వంద శాతం పూర్తి చేయడమే కాకుండా వాటిని ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. ఈ నెల 25వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా చేస్తారని, ఈ విషయంలో పాఠశాల హెడ్మాస్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పారు. డీఆర్డిఎ పీడీ పద్మజ మాట్లాడుతూ ఈ నెల 19,20 తేదీల్లో పింఛన్ల పరిశీలన కార్యక్రమానికి కమిటీ సభ్యులను నియమించని మండలాలు వెంటనే జాబితా అందజేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సూచించారు. ఆధార్ అనుసంధానం లేని పింఛన్‌దారుల వివరాలను సేకరించి రెండు రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. కమిటీ సభ్యుల నియామకం, కమిటీ సభ్యుల సమావేశం, 19,20వ తేదీల్లో పరిశీలన, తర్వాత ఎంపీడీఓలు లాగిన్‌లో అప్లోడ్ చేయాలని ఆమె వివరించారు. ఒకరోజు వేతనం కట్ - జెడ్పీ సీఈఓ కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఒకరోజు వేతనం కట్ చేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ ఎ.ప్రసాద్ స్పష్టం చేశారు. అంతేగాకుండా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ పోలప్ప, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నరసింహారావు పాల్గొన్నారు. -
సర్వేకి వెళితే ఛీత్కారమే!
సాక్షి, రాజమండ్రి : పింఛన్ మొత్తాన్ని పెంచడానికి ముందే.. రకరకాల సాకులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి సర్వే పేరుతో చంద్రబాబు సర్కారు పన్నిన కుతంత్రం.. వడ్డనకు ముందే కొంతమందిని పంక్తిలోంచి లేపేసే కుయుక్తి లాంటిదేనని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఓవైపు రుణమాఫీ హామీని అమలు చేయకుండా కుత్సితంతో తాత్సారం చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడుపై రైతులు, డ్వాక్రా మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతుండగా.. ఇప్పుడు పింఛన్ల సర్వే ప్రజల్లో నిరసన జ్వాలను రగిల్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భయపడుతున్నారు. అందుకే పింఛన్ల సర్వేకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో చేరేందుకు వెనుకాడుతున్నారు. సర్వే పేరుతో.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కొందరిని లబ్ధిదారులుగా రద్దు చేసినా, తమ పార్టీ వారిని లబ్ధిదారులుగా చేర్చినా ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని బెంబేలెత్తుతున్నారు. పింఛన్ల సర్వేకు ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, మండల కమిటీల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీల్లో వార్డుల కమిటీల్లో కౌన్సిలర్లు, నగర పాలక సంస్థల్లో డివిజన్ల కమిటీల్లో కార్పొరేటర్లను భాగస్వాములను చేశారు. మొదట్లో వీరంతా తమకేదో హోదా దక్కినట్టు సంబరపడ్డా.. ఈ సర్వేపై ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసన గ్రహించాక ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నారు. సర్కారు పింఛన్ల సర్వే కోసం కమిటీల్ని నియమించగానే లబ్ధిదారుల్లో గుబులు మొదలైంది. ముం దస్తు ప్రచారం లేకుండా హడావిడిగా కమిటీలు వేసి సర్వే అంటే ఎలా అని తీవ్రంగా నిరసిస్తున్నారు. దీంతో సర్వే పేరుతో ఇళ్లకు వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు. కమిటీలపై జీఓ వెలువడిన దగ్గర నుంచి గురువారం సాయంత్రం వరకూ టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు అనుయాయులతో సమావేశమవుతూ.. సర్వేలో పాల్గొంటే ఎదురయ్యే పరిణామాలపై చర్చిస్తున్నారు. వారిలో అత్యధికులు శుక్రవారం నుంచి మొదలవుతున్న సర్వేకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అధికారులను పాపాలభైరవులను చేద్దాం.. ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారిలో నూరు శాతం గత ప్రభుత్వాలు ఎంపిక చేసిన వారే. వీరిలో 80 శాతం పైగా పింఛన్లు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చినవరంగా భావిస్తున్నారు. అప్పటి వరకూ రూ.75గా ఉన్న పింఛన్ మొత్తాన్ని వైఎస్ అధికారంలోకి రాగానే రూ.200కు పెంచారు. పేదల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తామని వాగ్దానాలిచ్చిన చంద్రబాబు..గద్దెనెక్కాక వాటి అమలుకు పూనుకోకపోగా..నిస్సిగ్గుగా, నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టే ఎత్తులు వేస్తున్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన జనం ఇప్పటికే సర్కారు వంచనపై నిప్పులు కక్కుతున్నారు. ఇప్పుడు పింఛన్ల సర్వే పేరుతో జనం మధ్యకు వెళితే ఆ కాక తమకు తప్పదని అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. ఆ అవస్థను, పేదల పొట్ట కొటామన్న అపప్రథను తప్పించుకోవడానికి.. పింఛన్ల ఏరివేతకు అధికారులనేబాధ్యులను చేస్తే పోలా అనుకుంటున్నారు. కమిటీల్లో సభ్యులుగా ప్రజల ముందుకు వెళ్లరాదని నిర్ణయించుకుంటున్నారు. అప్పుడు ప్రజలు అధికారులనే పాపాపాపాల భైరవులుగా పరిగణిస్తారని ఆశిస్తున్నారు. ఈ తంతును అధికారులతోనే కానిచ్చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరుతున్నారు. రద్దు చేస్తామంటే జనం ఊరుకోరు క్షేత్రస్థాయిలో పింఛన్ల సర్వే మా వంటి ప్రజా ప్రతినిధులకు ఇబ్బంది కలగజేస్తుంది. గతంలో ఇచ్చిన పింఛన్లను రద్దు చేస్తామంటే జనం ఊరుకోరు. మరింత మంది అర్హులను గుర్తించి వారికీ పింఛన్లిస్తేనే జనం హర్షిస్తారు. లేదంటే ఇదికూడా ఓ రాజకీయంగా పరిగణిస్తారు. - ఇజ్జరపు రాజశేఖర్, కౌన్సిలర్, పెద్దాపురం వార్డుల్లోకి వెళితే తిరగబడతారు ప్రభుత్వ నిర్ణయం సమంజసమైంది కాదు. వార్డుల్లోకి వెళ్తే జనం తిరగబడేలా ఉన్నారు. గతంలో కూడా అర్హతను చూసే కదా పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సర్వే పేరుతో తొలగిస్తామంటే జనం ద్వేషిస్తారు. కార్పొరేటర్లు జనం మధ్య తిరిగే అవకాశం కోల్పోతారు. కమిటీల కూర్పు సరైంది కాదు. - సంజీవరావు, రిటైర్డ్ జడ్జి, కో ఆప్షన్ సభ్యుడు, రాజమండ్రి